News


పీఎఫ్‌పై 8.65 శాతం వడ్డీ రేటు కొనసాగింపు!!

Monday 2nd March 2020
personal-finance_main1583122361.png-32201

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో ప్రావిడెంట్ ఫండ్‌ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ రేటునే కొనసాగించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 5న జరిగే ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2018-19లో కూడా ఇదే రేటు ఉంది. ‍అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో దీన్ని 8.5 శాతానికి తగ్గించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. పోస్టాఫీస్ పొదుపు పథకాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మొదలైన ఇతరత్రా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల స్థాయికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటును కూడా సవరించాలంటూ కార్మిక శాఖపై ఆర్థిక శాఖ ఒత్తిడి తెస్తుండటమే ఇందుకు కారణం. సాధారణంగా ప్రతీ ఆర్థిక సంవత్సరం వడ్డీ రేట్లను నిర్ణయించే విషయంలో ఆర్థిక శాఖ అభిప్రాయాలను కూడా కార్మిక శాఖ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 



You may be interested

ఫిబ్రవరిలో రూ.1.05 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లు

Monday 2nd March 2020

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రూపంలో ఫిబ్రవరి నెలలో రూ.1,05,366 కోట్ల ఆదాయం సమకూరింది. క్రితం ఏడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే 8 శాతం పెరిగింది. అంతేకాదు, ఆర్థిక మందగమన పరిస్థితుల్లో జీఎస్‌టీ ఆదాయం రూ.లక్ష కోట్ల పైనే కొనసాగడం సానుకూలతను తెలియజేస్తోంది. అయితే, ఈ ఏడాది జనవరి నెలలో వసూలైన రూ.1.10 లక్షల కోట్లతో పోలిస్తే మాత్రం స్వల్పంగా తగ్గింది. సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.20,569

700 పాయింట్ల భారీగ్యాప్‌అప్‌ తో సెన్సెక్స్‌ ప్రారంభం

Monday 2nd March 2020

11400 పైన నిఫ్టీ ప్రారంభం భారీ స్థాయిలో షార్ట్‌కవరింగ్‌ ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు  ఆరు రోజుల వరుస నష్టాల ముగింపు పలుకుతూ దేశీయ మార్కెట్‌ సోమవారం భారీ లాభంతో మొదలైంది. కరోనా వైరస్‌ భయాలతో ఆర్థిక మందగమన భయాలతో క్రితంవారం సూచీలు కనిష్ట స్థాయిలకి పతనమైన నేపథ్యంలో నేడు ట్రేడర్లు భారీ స్థాయిలో షార్ట్‌ కవరింగ్‌ను పాల్పడ్డారు. సెన్సెక్స్‌ 718.66 పాయింట్ల లాభంతో 39015.95 వద్ద, నిఫ్టీ 209.15 పాయింట్లు పెరిగి

Most from this category