News


ప్రాఫిట్‌ ఎప్పుడు బుక్‌ చేయాలి?

Monday 13th January 2020
personal-finance_main1578897885.png-30887

ఆల్‌టైమ్‌ హై వద్ద సూచీలు
దేశీయ మార్కెట్లు గతవారం ఆరంభ నష్టాల నుంచి వెనక్కుమరలి ఆల్‌టైమ్‌ హైకి దూసుకుపోయాయి. సోమవారం నిఫ్టీ 12300 పాయింట్ల పైన బలంగా ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో లాభాల్లో ఉన్న పోర్టుఫోలియోల నుంచి లాభాలు స్వీకరించాలా? లేక అలాగే కొనసాగాలా? అని ఇన్వెస్టర్లు డైలమాలో ఉంటారు. కొందరేమో వచ్చిన లాభాలు మటుమాయం కాకముందే స్వీకరించడం మంచిదని, కొందరేమో మరిన్ని లాభాలను వదులుకొని స్వల్పలాభాలకు ఆశపడకూడదని భావిస్తుంటారు.

మరి ఈ విషయంలో నిపుణులేమంటారో చూద్దాం..
సాధారణంగా ఒక స్టాకు కొన్నివారాల వ్యవధిలో 10- 20 శాతం రాబడినిచ్చాక దాన్ని కొనసాగించాలా? లేక అమ్మేసుకోవాలా? అనేది ఎప్పుడూ సందిగ్ధమేనంటున్నారు నిపుణులు. ఈ విషయంలో వందేళ్ల స్టాక్‌మార్కెట్‌ చరిత్రను వడపోసి కొన్ని సూత్రాలు వివరిస్తున్నారు. 

  • ఒక నిర్ధిష్టస్థానం నుంచి 20- 25 శాతం ర్యాలీ జరిపాక చాలా స్టాకులు వెనుకంజ వేస్తాయి. అందువల్ల మనం కొన్న స్థానం కాకుండా, స్టాక్‌ ర్యాలీ ఆరంభించిన స్థానాన్ని గుర్తించి అక్కడ నుంచి 20- 25 శాతం ర్యాలీ తర్వాత పాయింట్‌ను గుర్తించి అక్కడ లాభాలు స్వీకరించడం ఉత్తమం. ఇందులో ఒక విషయం గుర్తించాలి. ఇంత ర్యాలీకి పట్టిన సమయం ఎంతనేది చూడాలి. ఈ సమయం మూడువారాల పైనైతే తప్పక లాభాలు స్వీకరించాలి. షేరు మూడు వారాల్లోపే 20 శాతం ర్యాలీ జరిపితే అందులో అనూహ్య బలం ఉందని అర్ధం చేసుకోవాలి. అప్పుడు 8 వారాల సూత్రం అప్లై చేయాలి. ఈ రూల్‌ ప్రకారం ఇలాంటి స్టాక్‌ను కనీసం 8 వారాలు మనం అట్టిపెట్టుకోవచ్చు. ఈ దశలో ఇవి మరిన్ని రెట్ల లాభాలిస్తాయి. 
  •  అలాగే స్టాకు దీర్ఘకాల పయనంలో ఇది ఎన్నో దశ ర్యాలీనో గుర్తించాలి. తొలి దశ ర్యాలీ అయితే మొత్తం అమ్మేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ రెండు, మూడో దశ ర్యాలీలైతే మాత్రం షేరు వెనక్కు తగ్గే అవకాశాలు మరింతగా పెరుగుతాయి.
  • ఒక షేరు అనూహ్య ఒడిదుడుకులు చూపుతూ, ఇంట్రాడేలో కనిష్ఠాలను తాకి, తిరిగి లాభాల్లోకి వస్తే దాన్ని నెగిటివ్‌ సంకేతంగా భావించాలి. అలాంటి స్టాక్స్‌ తర్వాత ట్రేడింగ్‌ దినాల్లో పతనం వైపుకు పయనించే ఛాన్సులెక్కువ. 
  •  ఒక పొజిషన్లో 7-8 శాతం నష్టాలు వచ్చాక, వేరే పొజిషన్లలో 20 శాతం వరకు లాభాలొస్తే అప్పుడు స్వీకరించడం మంచిది. లేదా 20 శాతం లాభాన్ని ట్రయిలింగ్‌స్టాప్‌లాస్‌గా పెట్టుకొని పొజిషన్‌ కొనసాగించవచ్చు.
  •  మీ పొజిషన్లలో అనేకం నష్టాలను చూపుతూ, మిగిలినవి ఒకటి అరా పొజిషన్లు 20 శాతం లాభాన్ని అందుకోలేకపోతుంటే మీ మొత్తం పోర్టుఫోలియోను, వ్యూహాన్ని పునఃసమీక్షించుకోవాలి. ఇలాంటప్పుడు మీ టెక్నికల్‌ అనాలసిస్‌ను, మార్కెట్‌పై మీ ధృక్పధాన్ని, మీ ఎంపికను పూర్తిగా పునరాలోచించుకొని తాజాగా అడుగులేయాలి. You may be interested

రూ.39,800 దిగువకు బంగారం

Monday 13th January 2020

దేశీయంగా బులియన్‌ మార్కెట్లో బంగారం ధర రూ.39,800 దిగువున ట్రేడ్‌ అవుతున్నాయి. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం, ఈక్విటీ మార్కెట్లు రికార్డు గరిష్టాలను అందుకోవడం, అమెరికా చైనాల మద్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదరవచ్చనే అంచనాలు డాలర్‌కు బలాన్నివ్వడం తదితర అంశాలు బంగారం ధర తరిగిపోయేందుకు తోడ్పాటునిచ్చాయి. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల బంగారం ధర రూ.173.00 నష్టపోయి రూ.39698.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  కిందటి వారం

ఇన్‌ఫ్రా షేర్లకు ఆర్బిట్రేషన్‌ ఆశలు..!

Monday 13th January 2020

క్లెయిముల పరిష్కారంపై అంచనాలు లాభాల్లో సద్భావ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్లస్‌లో జాతీయ రహదారుల అధీకృత సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) తాజాగా ఆర్బిట్రేషన్‌ క్లెయిముల సెటిల్‌మెంటులవైపు దృష్టి సారిస్తున్నట్లు ప్రకటించింది. కోర్టు వెలుపల పరిష్కారానికి(ఔట్‌ ఆఫ్‌ కోర్టు సెటిల్‌మెంట్‌) వీలుగా చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. తద్వారా రూ. 70,000 కోట్ల విలువైన క్లెయిముల పరిష్కార ప్రయత్రాలు ఊపందుకోనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే గత నెల(డిసెంబర్‌)లో రహదారులు, రవాణా శాఖల కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రూ.

Most from this category