News


టెక్నికల్స్‌తో ఇబ్బందా?.. ఇలా చేయండి...

Saturday 22nd February 2020
personal-finance_main1582351871.png-32004

అనలిస్టు సీకే నారాయణ్‌ సూచనలు

టెక్నికల్‌ విశ్లేషణ నేర్చుకునేవాళ్లు వివిధ రకాల సాధనాలను విశ్లేషించడం ద్వారా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్ని పుస్తకాలు చదివి ఎన్ని టెక్నికల్స్‌ పరిశీలించినా చివరకు అవన్నీ స్వల్ప వ్యాలిడిటీ ఉన్నవేనని అర్ధమవుతుంది. అయితే వీటిలో కొన్ని దీర్ఘకాలిక వాలిడిటీ ఉంటుందని మనం భావిస్తుంటాం. మనం నేర్చుకునేటప్పుడే కొన్ని టెక్నికల్స్‌పై గురి ఎక్కువగా పెంచకుంటాం. ఇక అనాలసిస్‌లో భాగంగా ఎవరమైనా ముందుగా చార్టుల విశ్లేషణ చేస్తారు. ఇందులో భాగంగా స్టాకులు వాటి మద్దతు, నిరోధ జోన్స్‌లోకి ప్రవేశిస్తున్న విషయాన్ని, కొన్నేమో కొన్ని రకాల ప్యాట్రన్స్‌ను ఛేదించి బయటపడడాన్ని గమనిస్తాం. అక్కడ మనం నేర్చుకున్న టెక్నికల్స్‌ను అప్లై చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. కానీ అప్పటివరకు అంతా ఈజీగా ఉన్నట్లు అనిపించినది ఉన్నట్లుండి ఏదో అవరోధం ఎదురైనట్లు అనిపిస్తుంటుంది. విశ్లేషణ నేర్చుకునే దశలో ఎంతో ఈజీగా అనిపించినవి, ప్రాక్టికల్‌గా అప్లై చేసే సమయంలో అర్ధం కానట్లుంటాయి. ఇది చాలా సార్లు చాలా మందికి అనుభవమయ్యే విషయమే! కానీ ఎవరూ దీనికి పెద్దగా భయపడరు. అలవాటు లేక ఇలా జరుగుతోందని భావిస్తారు. కొన్నాళ్లు ట్రేడింగ్‌ చేసుకుంటూ పోతుంటే కన్ఫ్యూజన్‌ పోతుందనుకుంటారు.. కానీ ఈ అయోమయం చాలామందికి ఎప్పటికీ పోదన్నదే నిజం...! ఎందుకిలా? అని కొందరు మాత్రమే ఆలోచిస్తారు. మిగిలిన వాళ్లు ఇది మనకు అచ్చిరాని వ్యవహారమని భావించి వదిలేస్తారు. 
ప్రముఖ అనలిస్టు సీకే నారాయణ్‌ సైతం ఇలాంటి అయోమయంలో పడ్డానని చెబుతున్నారు. ఇంత అనుభవం ఉన్నా ఈ అయోమయం తనకు ఇప్పటికీ కొన్నిమార్లు కలుగుతూనే ఉంటుందన్నారు. ఎందుకిలా అంటే.. విశ్లేషణకు ప్రాక్టీస్‌కు మధ్య టెక్నికల్‌ సిగ్నల్స్‌ మధ్య ఉండే వైరుధ్యమే కారణమంటున్నారు. చార్టులను పరిశీలిస్తే రెండు వర్గాల సంకేతాలు కనిపిస్తుంటాయని చెప్పారు. ఒక వర్గం సంకేతాలను మనం వదిలివేస్తాం(ఫేడింగ్‌ సిగ్నల్స్‌- మద్దతు, నిరోధ సంకేతాలు. వీటిని దాటిన తర్వాత ఇక ఈ సంకేతాలను పట్టించుకోము), ఇంకో వర్గం సంకేతాలను వెంటాడుతాం(ఛేజింగ్‌ సిగ్నల్స్‌- బ్రేకవుట్‌ సంకేతాలు). ఇలా భిన్న సంకేతాలను గుర్తించి ఫాలో అవడానికి మనం ఒకేమారు పరస్పర వ్యతిరేక కోణంలో ఆలోచించగలగాల్సిఉంటుంది. ఇది ఎక్కువమందికి వీలయ్యేది కాదు కాబట్టే చాలామంది ఫెయిల్‌ అవుతుంటారని నారాయణ్‌ చెప్పారు. ఒక కౌంటర్లో మనం ఫేడింగ్‌ సంకేతాలను అనుసరించాల్సిఉంటుంది, మరో కౌంటర్లో ఛేజింగ్‌ సిగ్నల్స్‌ను అనుసరించాల్సిఉంటుంది. అదేవిధంగా ఒక కౌంటర్లో లాంగ్‌ తీసుకుంటే ఇంకో కౌంటర్లో షార్ట్‌ తీసుకుంటాము. అలాగే ఒక చార్టును ఆఫ్‌లైన్‌లో ట్రేడింగ్‌ అనంతరం పరిశీలించడానికి, ఆన్‌లైన్లో ట్రేడింగ్‌ చేస్తూ పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇంత ఒత్తిడిని చాలామంది మైండ్‌ భరించలేదు. దీంతో పైన చెప్పుకున్న అయోమయం ఎదురవుతుంది. ఇది క్రమంగా తప్పుడు నిర్ణయాలకు ఆపై నష్టాలకు ఆపై మన సమర్ధతపై మనకే అపనమ్మకం ఏర్పడి. ట్రేడింగ్‌ నుంచి వైదొలగడానికి దారితీస్తుంది. దీన్నించి బయటపడాలంటే మనం ఎలాంటి తొట్రుపాటు లేకుండా ఏ కౌంటర్‌లో ఆ కౌంటర్‌కు తగ్గ వ్యూహాన్ని అవలంబించేలా మైండ్‌ ట్యూన్‌ చేసుకోవడమే మార్గమని నారాయణ్‌ చెప్పారు. 
ఉదాహరణ...
ఒక స్టాకు తన మద్దతు జోన్‌లో ప్రవేశించింది. ఇకపై అది ఆ మద్దతు నిలబెట్టుకోగలదా? అక్కడ నుంచి పైకి రాగలదా? అనేవి విశ్లేషించుకుంటాం. అంటే ఒకే సమయంలో రెండు పరస్పర భిన్న విశ్లేషణ చేస్తున్నాము. ఒకటి షేరు మద్దతు నిలుపుకోలేకపోవడం, రెండోది ధర అక్కడ నుంచి పైకి రావడం అనే రెండు అంశాలను పరిశీలిస్తాము. అంటే ఒకటేమో అమ్మేసుకోవడం గురించి మరొకటి కొనుగోలు చేయడం గురించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఒక బ్రేకవుట్‌ సిగ్నల్స్‌ విషయంలో సరైన బ్రేకవుట్‌జోన్‌ను నిర్ధారించుకోవడం, ఆపై ధరను ఫాలో అవుతుండడం అనేవి విశ్లేషిస్తాము. ఇక్కడ రెండు కేసుల్లో కొనుగోలు గురించే ఆలోచిస్తాం కాబట్టి మద్దతు, నిరోధ సిగ్నల్స్‌ సమయంలో ఉండే సంక్లిష్టత ఉండదు. 
ఏం చేయొచ్చు?
ఈ సంక్లిష్టత, అయోమయం తప్పించుకోవడానికి రెండు రకాల మార్గాలను నారాయణ్‌ సూచిస్తున్నారు. ఒకటి రెండు భిన్న మార్గాలను ఏకకాలంలో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలిగే స్థిరత్వాన్ని నేర్చుకోవడం లేదా ఏదో ఒక రకమైన ట్రేడ్‌(అది మద్దతు స్థాయిల వద్ద కొనుగోలు కావచ్చు లేదా నిరోధాల వద్ద అమ్మడం కావచ్చు. లేదా బ్రేకవుట్స్‌ వద్ద కొనుగోళ్లు లేదా బ్రేక్‌డౌన్స్‌ వద్ద అమ్మకాలు కావచ్చు..)కు కట్టుబడి ఉండడం. తొలి మార్గంలో నైపుణ్యం సంపాదించే వరకు రెండో మార్గాన్ని అవలంబించాలని, క్రమంగా భిన్న ట్రేడ్స్‌ను ఏకకాలంలో నిర్వహించగల సామర్ధ్యం వస్తే అప్పుడు ఒకేసారి ఆపోజిట్‌ ట్రేడ్స్‌ చేయడం మొదలెట్టవచ్చని చెప్పారు. You may be interested

కొన్ని షేర్ల బుల్‌ రన్‌ ఆశ్చర్యకరం

Saturday 22nd February 2020

పెట్టుబడులకు వ్యక్తిగత వ్యూహాలు అనుసరించవలసిందే షేర్ల విలువ, ధర, మార్కెట్‌ ధోరణి వంటివి గమనించాలి - కొటక్‌ ఏఎంసీ ఎండీ నీలేష్‌ షా  షేరు ధరకు లేదా విలువకు ప్రాధాన్యత ఇవ్వకుండా మార్కెట్లో కొనుగోళ్లు కనిపిస్తున్నంతవరకూ ఏదైనా ఒక కంపెనీ షేరు ధర పెరుగుతూనే ఉంటుందని కొటక్‌ ఏఎంసీ ఎండీ నీలేష్‌ షా చెబుతున్నారు. ఈ ట్రెండ్‌ ఇంతక్రితం హర్షద్‌ మెహతా కుంభకోణం బయటపడకముందు దేశీ మార్కెట్లో నమోదైన బుల్‌రన్‌లో కనిపించినట్లు పేర్కొంటున్నారు. ఒక

మరో కేజీఎఫ్‌! రూ.12 లక్షల కోట్ల బంగారం గనులు!

Saturday 22nd February 2020

బంగారం ధరలు ఆకాశనంటుతున్న తరుణంలో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ)బంగారు నిక్షేపాల్ని గుర్తించినట్లు తీపి కబురు చెప్పింది. ఉత్తర ప్రదేశ్‌లోని నక్సలైట్‌ ప్రభావిత ప్రాంతమైన సోన్‌భద్ర జిల్లాలో 3,000 టన్నులకు పైగా బంగారు నిక్షేపాలు ఉన్నట్టు జీఎస్‌ఐ, ఉత్తరప్రదేశ్‌ భూగర్భ, గనుల శాఖ అధికారులు నిర్ధారించారు. వీటి విలువ సుమారు రూ12 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. జిల్లాలోని సోన్‌ పహాడీ, హార్దీ ప్రాంతాలలో ఈ బంగారు గనులు

Most from this category