News


ఆదాయపన్ను తగ్గింపు సాధ్యమే!

Saturday 25th January 2020
personal-finance_main1579927514.png-31194

సీఎల్‌ఎస్‌ఏ అంచనా
రాబోయే బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపన్నును ప్రభుత్వం తగ్గించవచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌ సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది. ఐటీ తగ్గింపుద్వారా వృద్ధి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం యత్నించవచ్చని పేర్కొంది. ఆదాయపన్ను తగ్గింపు కన్జూమర్‌ కంపెనీలకు మేలు చేయవచ్చని పేర్కొంది. ఆదాయపన్ను తగ్గింపుతో ఐటీ కలెక‌్షన్లు 20 శాతం(దాదాపు లక్షకోట్ల రూపాయలు) తగ్గవచ్చని అంచనా వేసింది. అయితే కొత్త ఆదాయ వర్గాలను పన్ను పరిధిలోకి తీసుకురావడం, పన్ను కట్టేవాళ్లు పెరగడంతో వసూళ్ల నిజ తగ్గింపు ఆర్థికసంవత్సరాంతానికి 5 శాతానికే పరిమితం కావచ్చని పేర్కొంది. ఈ ఏడాది విత్తలోటు బడ్జెట్‌ అంచనా 3.3 శాతం కన్నా కాస్త ఎక్కువగా 3.6 శాతం వరకు చేరవచ్చని తెలిపింది. పన్ను వసూళ్ల తరుగుదల, డిజిన్వెస్ట్‌మెంట్‌ టార్గెట్‌ అందుకోలేకపోవడం వల్ల విత్తలోటు పెరుగుతుందని తెలిపింది. వచ్చే ఏడాది విత్తలోటు 3.4 శాతానికి కట్టడి కావచ్చిన బ్రోకరేజ్‌ అంచనా వేసింది. టెలికం రెవెన్యూలు పెరగడం, ప్రభుత్వ వ్యయ కట్టడి, డిజిన్వెస్ట్‌మెంట్‌ ఊపందుకోవడంతో విత్తలోటు తగ్గవచ్చని తెలిపింది. వచ్చే ఏడాది స్పెక్ట్రం వేలం, ఏజీఆర్‌ బకాయిల వసూలుతో టెలికం నుంచి ప్రభుత్వానికి ఆదాయం పెరగవచ్చని తెలిపింది. ఐటీ తగ్గించడంతో మారుతీ, టైటాన్, ఏసియన్‌పెయింట్స్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌, జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌, హావెల్స్‌ షేర్లకు మేలని అంచనా వేసింది. ఎల్‌టీసీజీ రద్దు, డీడీటీ రద్దు లాంటివి స్టాక్‌మార్కెట్‌కు పాజిటివ్‌ ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయని పేర్కొంది. 



You may be interested

కరోనా షాక్‌-3 నెలల కనిష్టానికి చమురు

Saturday 25th January 2020

చమురుకు వైరస్‌ ఫీవర్‌! వారాంతాన 1.4 శాతం క్షీణించిన ధరలు గత వారం నికరంగా 7.5 శాతం పతనం చైనాలోని ఉహాన్‌లో తలెత్తిన కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వార్తలు ముడిచమురు ధరలను చల్లబరుస్తున్నాయి. దీంతో వరుసగా నాలుగో రోజు విదేశీ మార్కెట్లో ధరలు వెనకడుగు వేశాయి. శుక్రవారం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 1.35 డాలర్లు(2.2 శాతం) క్షీణించి 60.69 డాలర్ల వద్ద ముగిసింది. ఇక న్యూయార్క్‌ మార్కెట్లోనూ నైమెక్స్‌ బ్యారల్‌

ఐసీఐసీఐబ్యాంకు ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Saturday 25th January 2020

మూడో త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంకు లాభం దాదాపు 200 శాతం పెరగవచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. బ్యాంకుకు చెందిన పెద్ద ఎన్‌పీఏ ఎస్సార్‌ స్టీల్‌కు సంబంధించిన బకాయిలు వసూలు కావడం లాభాలను పెంచుతుందని భావిస్తున్నారు. క్యు3లో బ్యాంకు నికర వడ్డీ ఆదాయంలో 30 శాతం వరకు పెరుగుదల ఉండొచ్చని భావిస్తున్నారు. అదేవిధంగా స్థిరమైన ఎన్‌ఐఎం, ప్రీప్రొవిజన్‌ లాభంలో 20 శాతం పెరుగుదల ఉంటాయని అంచనా వేస్తున్నారు. శనివారం బ్యాంకు ఫలితాలు

Most from this category