News


క్రెడిట్‌ రిస్క్‌ నిర్వహణ చాలా ముఖ్యం

Monday 15th July 2019
personal-finance_main1563171666.png-27068

డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్‌ అన్నది ఓ విభాగం. తక్కువ రేటింగ్‌ ఉన్న డెట్‌ సాధనాల్లో ఈ పథకం ప్రధానంగా ఇన్వె‍స్ట్‌ చేస్తుంది. సెబీ మార్గదర్శకాల ప్రకారం... క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌ ప్రధానంగా 65 శాతం పెట్టుబడులను ఏఏ అంతకంటే తక్కువ రేటింగ్‌ ఉన్న పేపర్లలో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. అధిక రిస్క్‌ తీసుకునే సామర్థ్యం ఉన్న వారు, వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా రెండంకెల రాబడులు పొందేందుకు అవకాశాలు ఉండడంతో గత కొన్నేళ్లలో ఈ విభాగం ఎంతో ఆక‌్షణీయంగా మారింది. అయితే, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణ చెల్లింపుల్లో విఫలం అయిన తర్వాత నుంచి, ఈ విభాగం అమ్మకాల ఒత్తిళ్లను ఎదుర్కొన్నది. పలు ఏఎంసీలకు చెందిన ఎన్నో పథకాలు సమస్యాత్మక కంపెనీల డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేయడంతో, వాటి యూనిట్ల ఎన్‌ఏవీలు ఒక్క ట్రేడింగ్‌ సెషన్‌లోనే దారుణంగా పతనమయ్యాయి. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారితీసింది. 

అయితే, ఇటువంటి పరిస్థితుల్లోనూ కొన్ని ఏఎంసీల పథకాలు ఈ ప్రతికూల పరిణామాల ప్రభావానికి దూరంగా ఉన్నాయి. కారణం, సమస్యలను ఎదుర్కొంటున్న కంపెనీల డెట్‌ పేపర్లలో అవి ఇన్వెస్ట్‌ చేయకపోవడమే. దీంతో ఈ పథకాలు ఎంత భిన్నంగా వ్యవహరించాయి? అనే ప్రశ్న ఇక్కడ ఎదురవుతుంది. ఇందుకు జవాబు... వాటి రిస్క్‌ నిర్వహణ విధానాలేనని చెప్పుకోవాలి. గత కొన్ని నెలల్లో ఎక్కువగా ప్రభావితం అయిన పథకాల్లోని పెట్టుబడులకు అధిక నష్టం జరగడం... ఫలితంగా ఇన్వెస్టర్లు నాణ్యమైన, బలమైన రిస్క్‌, నిర్వహణ విధానాలు కలిగిన ఫండ్‌ హౌస్‌లకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. 

ఎంపిక ఎలా...?
ఈ పరిణామాల నేపథ్యంలో క్రెడిట్‌రిస్క్‌ ఫండ్‌ను ఏ విధంగా ఎంచుకోవాలన్న ప్రశ్న ఎదురవుతోంది. దీనికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ పాటిస్తున్న రిస్క్‌, నిర్వహణ మాదిరి విధానాలేనని చెప్పుకోవాలి. ఈ పథకం మెరుగైన రాబడులను ఇవ్వడమే కాకుండా, నష్టదాయక డెట్‌ పేపర్లకు దూరంగా ఉంది. ఈ ఫండ్‌ పాటిస్తున్న విధానాలను పరిశీలిస్తే.. ఈ పథకం ఇ‍న్వెస్ట్‌మెంట్‌ టీమ్‌ భద్రతతోపాటు, లిక్విడిటీ, రాబడులకు ప్రాధాన్యం ఇస్తోంది. అలాగే, పరిశోధన, పోర్ట్‌ఫోలియో నిర్మాణం, పర్యవేక్షణ వంటి అంశాలతో కూడిన బలమైన నిర్వహణ విధానాలను ఆచరిస్తోంది. ఇక పోర్ట్‌ఫోలియోలో భాగం చేసుకునే ప్రతీ డెట్‌పేపర్‌ను స్వతంత్ర పరిశోధన బృందం క్షుణంగా పరిశీలించడం, రిస్క్‌ నిర్వహణ టీమ్‌ ఆమోదం తీసుకోవడాన్ని కూడా గమనించాలి. క్రెడిట్‌ రేటింగ్‌ అన్నది కేవలం ఒక అంశమేనని, నిర్ణయం తీసుకోవడానికి ఇదొక్కటే ప్రామాణికం కాదన్నది ఈ ఫండ్‌ హౌస్‌ చెబుతోంది. డ్యురేషన్‌ ఫండ్స్‌ మాదిరిగా కాకుండా, అక్ర్యూయల్‌ ఫండ్స్‌లో రాబడుల వెనుక రెండు ముఖ్యమైన అంశాలను చూడాల్సి ఉంటుంది. అవి... రిస్క్‌ సర్దుబాటుతో కూడిన రాబడుల రేటు, పెట్టుబడుల కాల వ్యవధి. ఏ డెట్‌ పెట్టుబడికైనా అప్‌సైడ్‌ పరిమితం అనుకున్నప్పుడు, బలమైన రిస్క్‌ నిర్వహణ కలిగిన మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లోనే ఇన్వె‍స్ట్‌ చేయడం మంచిది.
 - పృథ్వి పొట్టా, వ్యవస్థాపక భాగస్వామి, వర్ట్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ 

 You may be interested

మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో మెరుగైన రాబడులు

Monday 15th July 2019

ఎల్‌అండ్‌టీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ఇప్పటికే బాగా దిద్దుబాటుకు గురికాగా, అవి ఇంకా నేలచూపులే చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలానికి మెరుగైన రాబడులు ఆర్జించాలనుకునేవారు మిడ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను ప్రస్తుత పరిస్థితుల్లో పరిశీలించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విభాగంలో మంచి పనితీరు కలిగిన పథకాల్లో ఎల్‌అండ్‌టీ మిడ్‌క్యాప్‌ కూడా ఒకటి. అయితే, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో రిస్క్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక రిస్క్‌ తీసుకునే సామర్థ్యం ఉన్న వారు, అది

పెద్దలకు హెల్త్‌ పాలసీ సాధ్యమే

Monday 15th July 2019

ప్రీమియం మాత్రం ఖరీదు అయినా సరే తీసుకోవడమే సురక్షితం అప్పటికే ఉన్న వ్యాధులకూ కవరేజీ కాకపోతే పరిమితులు ఎక్కువ కోపేమెంట్‌, రూమ్‌రెంట్‌ క్యాప్‌ గమనించాలి తక్కువ పరిమితులున్న పాలసీ బెటర్‌ పాలసీ లేకపోతే ఆర్థికంగా బోలేడు భారం అందుకే 60 దాటితే హెల్త్‌ పాలసీ ఎంతో అవసరం చెన్నైకు చెందిన సుమీత్‌ (60) ఇటీవలే పదవీ విరమణ చేశాడు. ప్రైవేటు రంగంలో పనిచేసినంత కాలం సంస్థ తరఫున గ్రూపు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ అతడి కుటుంబ సభ్యుల అవసరాలను ఆదుకుంది. కానీ,

Most from this category