News


అక్టోబర్‌1 నుంచి ఈ మార్పులు గుర్తించండి!

Tuesday 1st October 2019
personal-finance_main1569921941.png-28658

సాధారణ ప్రజల ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేసే ఐదు మార్పులు ఈ నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి...
1. రుణాలపై వడ్డీరేట్లలో మార్పులు: ఆర్‌బీఐ ఆదేశించిన ప్రకారం ఒకటి నుంచి అన్ని ఫ్లోటింగ్‌ రేట్‌ సంబంధిత రుణాలపై రేటును బహిర్గత బెంచ్‌మార్క్‌ రేటుకు అనుసంధానించనున్నారు. దీనివల్ల వ్యక్తిగత, హౌసింగ్‌, ఆటో తదితర రుణాలపై రేట్లు తగ్గవచ్చు. ప్రతిమూడు నెలలకు ఒకసారి బ్యాంకులు ఈ బహిర్గత బెంచ్‌మార్క్‌ రేటుకు అనుగుణంగా తమ రేట్లను సవరించాలి. ఈ నిర్ణయంతో రుణాల ఈఎంఐ మొత్తాల్లో మార్పులు వస్తాయి.
2. ఐటీ నోటీసులకు డీఐఎన్‌: ఇకపై అన్ని ఆదాయ పన్ను నోటీసులు లేదా ఉత్తర ప్రత్యుత్తరాలకు ఒక ఏకీకృత నెంబర్‌(డీఐఎన్‌- డాక్యుమెంట్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్) కేటాయిస్తారు. ఈ నెంబర్‌ను ఐటీ వెబ్‌సైట్‌లో సరిచూసుకోవచ్చు. డీఐఎన్‌ లేని ఎలాంటి నోటీసు, లేఖ ఐనా చెల్లదు. వ్యక్తిగతంగా ఇచ్చే నోటీసులకు వేరే నిబంధనలుంటాయి. 
3.ఇంధన చెల్లింపులపై క్రెడిట్‌కార్డ్‌ బైబ్యాక్స్‌ ఉండవు: పెట్రోల్‌ పంపుల వద్ద క్రెడిట్‌కార్డ్‌ ఉపయోగించి నింపుకుంటే దాదాపు 0.75 శాతం వరకు డిస్కౌంట్‌ లభించేది. ఈ ఒకటి నుంచి ఈ సదుపాయాన్ని తొలగించారు. రెండున్నరేళ్ల క్రితం ఈ సదుపాయాన్ని ఓఎంసీలు ప్రవేశపెట్టాయి. డెబిట్‌కార్డులు, ఇతర డిజిటల్‌ మార్గాల్లో చెల్లింపులపై మాత్రం బైబ్యాక్స్‌ యథాతధంగా ఉంటాయి.
4. ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త: ఇకపై ఏడేళ్ల సర్వీసు కూడా పూర్తి చేయకుండా మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా ఫ్యామిలీ పెన్షన్‌ రానుంది. ఈ మేరకు ప్రభుత్వం కేంద్ర పెన్షన్‌ నిబంధనల్లో మార్పుల చేసింది. 
5. ఆన్‌లైన్‌ టికెట్‌ పోర్టల్స్‌లో ట్రావెల్‌ బీమా విక్రయాలపై పరిమితులు: ఆన్‌లైన్‌ పోర్టల్స్‌లో టికెట్లు కొనుగోలు చేసేవారికి ట్రావెట్‌ బీమా విక్రయించడానికి సంబంధించి ఐఆర్‌డీఏఐ పరిమితులు విధించింది. నిబంధనలకు అనుగుణంగా లేని గ్రూప్‌ బీమా ఒప్పందాలు అక్టోబర్‌ 1 నుంచి రద్దవుతాయని తెలిపింది. You may be interested

రాణా కపూర్‌ ఎఫెక్ట్‌: రెండోరోజూ కుప్పకూలిన యస్‌బ్యాంక్‌

Tuesday 1st October 2019

ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ షేర్లు మంగళవారం మరోసారి భారీ నష్టాన్ని చవిచూశాయి. నేటి ఎన్‌ఎస్‌ఈలో ఈ బ్యాంక్‌ షేర్లు రూ.42.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభంలో ప్రైవేట్‌రంగ షేర్లకు కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో 7శాతం మేర లాభపడ్డాయి. బ్యాంక్‌ ప్రధాన ప్రమోటర్‌ రాణా కపూర్‌ కంపెనీ మోర్గాన్‌ క్రెడిట్స్‌ తన మొత్తం వాటాలో 2.16శాతం వాటాకు సమానమైన 5.2కోట్ల ఈక్విటీ షేర్లను 26-27 తేదీల్లో ఓపెన్

నిఫ్టీ 220, సెన్సెక్స్‌ 630 పాయింట్ల పతనం

Tuesday 1st October 2019

స్థూల ఆర్థిక డేటా బలహీనంగా ఉండడంతో పాటు, సెప్టెంబర్‌ నెలకు సంబంధించి దిగ్గజ ఆటో కంపెనీల వాహన అమ్మకాలు మార్కెట్‌ అంచనాలను అందుకోకపోవడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం 2శాతానికి పైగా నష్టపోయి ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వెల్లువెత్తడంతో బెంచ్‌మార్క్‌ సూచీలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయి. మధ్యాహ్నం 2.19 సమయానికి నిఫ్టీ 220.80 పాయిట్లు నష్టపోయి 11,253.65 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 639.1 పాయింట్లు నష్టపోయి 38,021.66

Most from this category