News


సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ కొనొచ్చు!

Wednesday 11th September 2019
personal-finance_main1568183340.png-28304

కమోడిటీ నిపుణుల సూచన
పోర్టుఫోలియోలో బంగారం కూడా ఉండాలనుకునే ఇన్వెస్టర్లు 2019-20 సీరిస్‌4 సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ను కొనుగోలు చేయవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ బాండ్స్‌ సబ్‌స్క్రిప్షన్‌కు ఓపెన్‌గా ఉన్నాయి. వారాంతం వరకు వీటికి సబ్‌స్క్రైబ్‌ కావచ్చు. వీటికి డిజిటల్‌ రూపంలోనైతే గ్రాముకు రూ.3840, భౌతిక చెల్లింపులైతే గ్రాముకు రూ. 3890 చొప్పున చెల్లించాల్సిఉంటుంది. ప్రస్తుతం యూఎస్‌ మార్కెట్లు పదేళ్ల బుల్‌రన్‌ చివరి సంవత్సరంలో ఉన్నాయని, చాలా ఓవర్‌ వాల్యూడ్‌గా మారాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అల్పవడ్డీరేట్లు, కొన్నింటిలో నెగిటివ్‌ వడ్డీరేట్లు కొనసాగుతున్నాయని తెలిపింది. ఇవన్నీ రాబోయే రోజుల్లో ఈక్విటీల వెనుకంజను, కమోడిటీల ముందంజను సూచిస్తాయని పేర్కొంది. అందువల్ల ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియో కేటాయింపుల్లో 5-10 శాతం బంగారానికి కేటాయించడం ద్వారా, అంతర్జాతీయ ఒడిదుడుకులను, రూపీ క్షీణతను తట్టుకోవచ్చని వివరించింది. 

గతేడాది కాలంలో బంగారం ధరలు దాదాపు 25 శాతం ర్యాలీ చేశాయి. ఇదే సమయంలో ఈక్విటీలు 3 శాతం నష్టంలో, లిక్విడ్‌ ఫండ్స్‌ 6.7 శాతం లాభంలో ఉన్నాయి. అంటే ఏడాదిగా అన్ని రకాల ఆస్తుల్లో బంగారం మంచి ప్రదర్శన చూపిందని ఫైనాన్షియల్‌ ప్లానర్లు చెబుతున్నారు. అందువల్ల బంగారంలో పెట్టుబడులకు సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ మంచి సాధనమని వారు నమ్ముతున్నారు. వీటిని కొనుగోలు చేయడం వల్ల రక్షణతో పాటు, ఏటా 2.5 శాతం వడ్డీని పొందవచ్చని తెలిపారు. పన్నుల పరంగా కూడా వీటివల్ల ఇబ్బంది ఉండదని, మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే క్యాపిటల్‌గెయిన్‌ టాక్స్‌ కూడా ఉండదని తెలిపారు. వీటికి లిక్విడిటీ కొంచెం తక్కువని అందువల్ల ఈ బాండ్స్‌ కొన్నవాళ్లు మెచ్యూరిటీ వరకు ఎదురుచూడడం ఉత్తమమని ప్లాన్‌రూపీ సంస్థ సూచించింది. సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ కాలపరిమితి 8 సంవత్సరాలు. ఐదో సంవత్సరం నుంచి వడ్డీ చెల్లింపు దినాన బాండ్స్‌ నుంచి వైదొలగవచ్చు. మూడు రోజుల బంగారం క్లోజింగ్‌ ధర సరాసరి ఆధారంగా బాండ్‌ రిడిమ్షన్‌ ధర నిర్ణయిస్తారు. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం అప్‌

Wednesday 11th September 2019

యస్‌ బ్యాంక్‌, యస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ అండతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ఉదయం ట్రేడింగ్‌లో 1శాతానికి పైగా ర్యాలీ చేసింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 27,639.05 వద్ద ప్రారంభమైంది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన యస్‌బ్యాంక్‌ లో కొంత వాటాను పేటిఎం సంస్థ కొనుగోలు చేస్తుందనే వార్తలతో యస్‌బ్యాంక్‌ షేర్లు నేడు 15శాతం ర్యాలీ చేయడంతో

యస్‌బ్యాంక్‌16శాతం ర్యాలీ ..!

Wednesday 11th September 2019

యస్‌బ్యాంక్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 8శాతం ర్యాలీ చేశాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.66.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ కంపెనీ ఒకటి యస్‌బ్యాంక్‌లో స్వల్ప వాటాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి వాస్తవమేని కంపెనీ చీఫ్ మేనేజింగ్‌ డైరెక్టర్‌, మేనేజింగ్‌ డెరెక్టర్‌ రవ్‌నీత్‌గిల్‌ వివరణ ఇచ్చారు. సదరు కంపెనీ బ్యాంక్‌లో 10శాతం వాటాకు మించుకుండా కొనుగోలు చేస్తుందని, ఇప్పటికి వరకు ఎలాంటి

Most from this category