News


సేవింగ్స్‌ ఖాతాల్లో బ్యాలన్స్‌పై భలే రాబడులు

Sunday 16th February 2020
personal-finance_main1581874968.png-31833

రిస్క్‌ లేకుండా మంచి రాబడులు కేవలం బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకే పరిమితం కాదు. బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాల్లో ఉంచుకున్నా మంచి రాబడి రేటు పొందొచ్చు. కాకపోతే ఇది అన్ని బ్యాంకుల్లోనూ కాదు. కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకులు సేవింగ్స్‌ ఖాతా డిపాజిట్లపై ఆకర్షణీయమైన రేటును ఆఫర్‌ చేస్తు‍న్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల రూపంలో మరిన్ని నిధులు సమకూర్చుకోవడమే ఆయా బ్యాంకులు అధిక రేటు ఆఫర్‌ చేయడానికి కారణం. బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాల్లో కనీస బ్యాలన్స్‌ అనేది తప్పకుండా ఖాతాదారులు నిర్వహిస్తుండాలి. కొన్ని ప్రముఖ బ్యాంకులు సేవింగ్స్‌ బ్యాలన్స్‌పై 3.5 శాతం రేటునే ఆఫర్‌ చేస్తు‍న్నాయి. వీటితో పోలిస్తే మంచి రేటును ఆఫర్‌ చేస్తున్న బ్యాంకుల వివరాలు ఇవి..

 

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు
సేవింగ్స్‌ ఖాతాల్లో రూ.లక్షలోపు ఉండే బ్యాలన్స్‌పై 6 శాతం వార్షిక వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తోంది. ఒకవేళ ఈ బ్యాలన్స్‌ రూ.లక్ష మించితే అప్పుడు 7 శాతం రేటును ఇస్తోంది. 

 

ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు
రూ.25 లక్షల వరకు ఉండే సేవింగ్స్‌ బ్యాంకు బ్యాలన్స్‌పై 7 శాతం రేటును ఆఫర్‌ చేస్తోంది. అదే రూ.25 లక్షలు మించి రూ.10 కోట్ల వరకు ఉండే బ్యాలన్స్‌పై 7.25 శాతం రేటును ఆఫర్‌ చేస్తోంది. రూ.10 కోట్లకు మించిన బ్యాలన్స్‌పై అమల్లో ఉన్న రేటు 7.75 శాతం. ఇది దగ్గర దగ్గర పీపీఎఫ్‌ రేటుతో సమానం. 

 

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు
రూ.5 లక్షల వరకు ఉండే సేవింగ్స్‌ బ్యాలన్స్‌పై 4 శాతం రేటును ఆఫర్‌ చేస్తోంది. రూ.5-50 లక్షల మధ్య బ్యాలన్స్‌పై 5.50 శాతం, రూ.50 లక్షలకు పైన రూ.5 కోట్ల వరకు ఉండే బ్యాలన్స్‌పై 6.75 శాతం, రూ.5 కోట్లకు పైన బ్యాలన్స్‌పై 7 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. 

 

ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు
రూ.లక్షలోపు బ్యాలన్స్‌పై 4.50 శాతం, రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు బ్యాలన్స్‌పై 6 శాతం, రూ.1-5 కోట్ల బ్యాలన్స్‌పై 7 శాతం రేటును ఇస్తోంది. అదే విధంగా రూ.5-30 కోట్ల బ్యాలన్స్‌పై 7.25 శాతం, రూ.30-50 కోట్ల బ్యాలన్స్‌పై 7.50 శాతం రేటు ఆఫర్‌ చేస్తోంది.

 

కోటక్‌ మహీంద్రా బ్యాంకు
రూ.1-10 లక్షల బ్యాలన్స్‌పై 6 శాతం రేటును ఆఫర్‌ చేస్తోంది రూ.లక్షకు లోపు బ్యాలన్స్‌పై 4 శాతం రేటు ఆఫర్‌ చేస్తోంది. You may be interested

అంతర్జాతీయ అంశాలే నడిపిస్తాయ్‌..

Monday 17th February 2020

కరోనా వైరస్‌ పరిణామాలు కీలకం గురువారం ఎఫ్‌ఓఎంసీ, ఆర్‌బీఐ మినిట్స్‌ వెల్లడి ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితం మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం మార్కెట్‌కు సెలవు ముంబై: కోవిడ్‌–19(కరోనా వైరస్‌) తాజా పరిణామాలు, ఏజీఆర్‌ అంశం వంటి పలు కీలక అంశాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్‌ గురించి ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందో అనే అంశంపైనే మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించాయి.

ఎల్‌ఐసీలో ఇన్వెస్ట్‌ చేయను..: శంకర్‌శర్మ

Sunday 16th February 2020

ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపీవోకు రానుండగా, ఓ ఇన్వెస్టర్‌గా తాను అయితే ఎల్‌ఐసీలో ఇన్వెస్ట్‌ చేయనని ఫస్ట్‌ గ్లోబల్‌ సంస్థ వ్యవస్థాపకుడు శంకర్‌ శర్మ స్పష్టం చేశారు. ప్రభుత్వరంగంలో అమ్ముడుపోని సంస్థల వాటాలను కొనుగోలు చేసే సంస్థగా ఎల్‌ఐసీని ప్రభుత్వం వాడుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. ‘‘ఓ ఇన్వెస్టర్‌గా ఎల్‌ఐసీని అస్సలు టచ్‌ చేయను. ప్రభుత్వం అమ్ముడుపోని వాటిని ఎల్‌ఐసీకి విక్రయిస్తోంది. ఆ అమ్ముడుపోని వస్తువుల

Most from this category