News


డిసెంబర్‌ ముగిసేలోపు వీటిపై ఓ సారి లుక్కేయరూ!

Wednesday 12th December 2018
personal-finance_main1544554825.png-22831

ఈ ఏడాది ముగిసేలోపు అంటే మరో 20 రోజుల్లోపు తప్పకుండా దృష్టి పెట్టాల్సిన ముఖ్యమైన ఆర్థిక అంశాలు కొన్ని ఉన్నాయి. అవి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు, ఈవీఎం చిప్‌ కార్డులు, సీటీఎస్‌ చెక్‌బుక్కులు తదితరమైనవి ఉన్నాయి. వాటి గురించి వివరంగా చూస్తే...

 

ఆలస్యంగా ఐటీ రిటర్నులు

ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేవారు గడిచిన ఆర్థిక సంవత్సరానికి రిటర్నులు వేయడం మర్చిపోయి ఉంటే, సకాలంలో దాఖలు చేయకుంటే ఒక అవకాశం ఉంది. బీలేటెడ్‌ ఐటీఆర్‌ను డిసెంబర్‌ 31లోపు దాఖలు చేయాలి. ఆదాయపన్ను చట్టంలోని నూతన నిబంధన మేరకు ఆలస్యంగా దాఖలు చేసిన వారి నుంచి ఫీజు వసూలు చేస్తారు. ఒకవేళ ఈ నెలాఖరులోపు కూడా రిటర్నులు వేయకపోతే ఆ తర్వాత మరింత అధికంగా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవ గడువు ముగిసిన తర్వాత డిసెంబర్‌ 31లోపు రిటర్నులు వేస్తే రూ.5,000 ఫీజు చెల్లించాలి. 2019 జనవరి 1 నుంచి వచ్చే మార్చి 31 మధ్య దాఖలు చేస్తే ఫీజు రెట్టింపై రూ.10,000కు పెరుగుతుంది. అధిక పెనాల్టీ వద్దనుకునే వారు ఈ నెలాఖరులోపే దాఖలు చేయాల్సి ఉంటుంది. రూ.5 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారు అయితే గరిష్ట పెనాల్టీ రూ.1,000 మాత్రమే. 

 

ఈఎంవీ చిప్‌కార్డు

బ్యాంకులు తమ కస్టమర్లకు సంబంధించి మ్యాగ్‌స్ట్రిప్‌ ఆధారిత (మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌) డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను ఈ నెల 31లోపు తప్పకుండా మార్చాలన్నది ఆర్‌బీఐ ఆదేశాల సారం. వీటి స్థానంలో ఈఎంవీ చిప్‌ కార్డులను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గడువు తర్వాత అంటే వచ్చే నెల 1 నుంచి మ్యాగ్‌స్ట్రిప్‌ ఆధారిత కార్డులను బ్లాక్‌ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ తమ మ్యాగ్‌స్ట్రిప్‌ కార్డులను మార్చుకోని వారు వెంటనే ఈఎంవీ చిప్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడం నయం. 

 

నాన్‌ సీటీఎస్‌ చెక్కులు

సీటీఎస్‌ 2010 కాంప్లియంట్‌ చెక్‌బుక్కులను బ్యాంకులు ఖాతాదారులకు ఇవ్వాలని ఆర్‌బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. 2018 సెప్టెంబర్‌ 1 నుంచి నాన్‌ సీటీఎస్‌ చెక్‌ల క్లియరింగ్‌ను నెలలో ఒకసారికి పరిమితం చేసింది. ప్రతీ నెలా రెండో బుధవారమే వీటిని క్లియర్‌ చేయడం జరుగుతుంది. 2018 డిసెంబర్‌ 31 తర్వాత క్లియరింగ్‌ కోసం నాన్‌ సీటీఎస్‌ చెక్‌లు వస్తే అనుమతించరు. ఒకవేళ నాన్‌ సీటీఎస్‌ చెక్‌బుక్కులు ఉన్నవారు తమ బ్యాంకుకు వెళ్లి 2010 సీటీఎస్‌ చెక్‌బుక్‌లను తీసుకోవాలి.

 

ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్‌

తమ మొబైల్‌ నంబర్‌ను నమోదు చేసుకోని ఖాతాదారుల ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లాగిన్‌ను ఈ నెల 1 నుంచి ఎస్‌బీఐ బ్లాక్‌ చేసింది. కనుక ఓ సారి నెట్‌బ్యాంకింగ్‌ లాగిన్‌ను చెక్‌ చేసుకుని బ్లాక్‌ అయితే, బ్యాంకు శాఖకు వెళ్లి మొబైల్‌ నంబర్‌ నమోదు చేసుకుని సేవలను తిరిగి యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

 

ఎస్‌బీఐ బుడ్డీ

ఎస్‌బీఐ బుడ్డి మొబైల్‌ వ్యాలెట్‌ను ఈ ఏడాది నవంబర్‌ 30 నుంచి మూసేయడం జరిగింది. ఒకవేళ ఎస్‌బీఐ బుడ్డిని గతంలో వినియోగించి ఉంటే, అందులో బ్యాలన్స్‌ ఉంటే గనుక బ్యాంకు శాఖను సంప్రదించి అందులో మొత్తాన్ని తిరిగి పొందొచ్చు. You may be interested

మార్కెట్లపై నిపుణులు ఏమంటున్నారు?

Wednesday 12th December 2018

మార్కెట్లు దేనిని అయినా ముందే డిస్కౌంట్‌ చేసుకుంటాయన్నది మరోసారి రుజువైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ముందు రోజే సెన్సెక్స్‌ 700 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా పతనమైన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఈ మూడు రాష్ట్రాల్లోనూ బేజీపీ ఓటమి చెందొచ్చన్న అంచనాలే ఆ రోజు మార్కెట్‌ నష్టాలకు కారణమని విశ్లేషకుల అభివర్ణన. ఇక ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్ రాజీనామా వార్త కూడా ఆ

ఎన్నికల ఫలితాలు మార్కెట్లకు ఎందుకు పట్టలేదు?

Tuesday 11th December 2018

మరోమారు దేశీయ సూచీలు అంచనాలకు భిన్నంగా స్పందించాయి. రాజకీయాలను, ఎన్నికల ఫలితాలను అందరూ చూసేలా కాకుండా వేరే కోణంలో చూస్తామని మార్కెట్లు నిరూపించాయి. ఒకపక్క ఉర్జిత్‌ రాజీనామా వ్యవహారం బెంబేలెత్తిస్తుందని, ఇదే సమయంలో ఎన్నికల ఫలితాలు బీజేపీకి సానుకూలంగా రాకపోవడంతో ఇక భారీ పతనమేనని చాలామంది భావించారు. ఇందుకు తగ్గట్లే మార్కెట్లు సోమవారం ఎగ్జిట్‌ పోల్స్‌కు బాగా నెగిటివ్‌గా స్పందించాయి. మంగళవారం ఆరంభంలో కూడా ఇదే విధంగా భారీ పతనాన్ని

Most from this category