News


అప్పు తీసుకున్నా ఆదాయపన్ను ప్రయోజనాలు

Sunday 29th July 2018
personal-finance_main1532868998.png-18756

రుణం తీసుకోవాలంటే తగిన కారణం ఉండాలంటారు. అలా చూసుకుంటే కొన్ని రకాల రుణాలకు ఆదాయపన్ను ప్రయోనాలు ఉన్నాయి. ఇంటి కోసం రుణం, విద్యా రుణం, పర్సనల్‌ లోన్‌ వీటన్నింటిపైనా పన్ను ప్రయోజనాలు అందుకోవచ్చు. అవేంటన్నది తెలిపే కథనం ఇది.

 

విద్యా రుణం

విద్యా రుణాలు తీసుకునే వారు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80ఈ కింద పన్ను ప్రయోజనాలకు అర్హులు. వరుసగా ఎనిమిది సంవత్సరాలపాటు రుణంపై చెల్లించే వడ్డీ (ఎంత మొత్తమైనా)ని ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవచ్చు. కాకపోతే ఆర్‌బీఐ అనుమతి ఉన్న ఆర్థిక సంస్థ నుంచి విద్యారుణం తీసుకుంటేనే ఈ ప్రయోజనం లభిస్తుంది.

 

ఇంటి రుణం

మనలో చాలా మంది ఏదో ఒక సందర్భంలో ఇంటి రుణాన్ని ఆశ్రయించేవారే. రుణం తీసుకుంటే, ఆదాయపన్ను పరంగా చాలా ప్రయోజనం ఉంటుందని చెప్పుకోవచ్చు. అసలుకు, వడ్డీ చెల్లింపులకూ పన్ను ప్రయోజాలు ఉన్నాయి. సెక్షన్‌ 24 కింద రూ.2 లక్షల వడ్డీకి మినహాయింపు లభిస్తుంది. మీ ఇల్లు నిర్మాణంలో ఉన్నప్పటికీ  ముందుగా చెల్లించిన వాయిదాలపై వడ్డీకి పన్ను మినహాయింపును క్లెయిమ్‌ చేసుకోవచ్చని బ్యాంకు బజార్‌ సీఈవో ఆదిల్‌ శెట్టి తెలిపారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఐదు వాయిదాల్లో దీన్ని క్లెయిమ్‌ చేసుకోవచ్చని, రూ.2 లక్షల పరిమితికి లోబడి ఇది ఉంటుందని వివరించారు. ‘‘సెక్షన్‌ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంటి రుణం అసలుకు చేసిన చెల్లింపులు రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ ప్రయోజనాన్ని పొందాలంటే ఐదేళ్ల వరకు ఇంటిని విక్రయించకూడదు. ఒకవేళ విక్రయించినట్టయితే ఆ సంవత్సరాల్లో పొందిన పన్ను మినహాయింపులన్నీ తొలగిపోతాయి. అంటే గతంలో పొందిన మినహాయింపుల మొత్తం మీ ఆదాయానికి వచ్చి కలుస్తుంది’’ అని ఆదిల్‌శెట్టి తెలిపారు. స్టాంప్‌ డ్యూటీ చార్జీలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలను కూడా సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల పరిమితి కింద చూపించుకోవచ్చని సూచించారు. ఇక మొదటి సారి ఇంటి రుణం తీసుకునే వారు సెక్షన్‌ 80ఈఈ కింద అదనంగా మరో రూ.50,000కు పన్ను మినహాయింపు పొందొచ్చు. కాకపోతే రుణం మొత్తం రూ.35 లక్షలు దాటకూడదు. ఇంటి విలువ రూ.50 లక్షలు మించకూడదు.

 

వ్యక్తిగత, వాహన రుణం

చాలా మందికి తెలియని మరో విషయం పర్సనల్‌ లోన్స్‌, వాహన రుణాలకూ పన్ను ప్రయోజనాలున్నాయని. కార్లు లగ్జరీ ఉత్పాదన అయినప్పటికీ... వాణిజ్య అవసరాల రూపేణా స్వయం ఉపాధి కోసం వాటిని కొనుగోలు చేసేవారు పన్ను ప్రయోజనాలకు అర్హులే. అలాగే వ్యాపార, ఉపాధి అవకాశాల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకున్నా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.You may be interested

సాక్షి బిజినెస్‌ క్విజ్‌ - 20 "ఇంటర్నేషనల్ టైగర్ డే"

Sunday 29th July 2018

1. పులి శరీర భాగాల అక్రమ వ్యాపారం విలువ అంతర్జాతీయ స్థాయిలో సాలీనా సుమారు 6 బిలియన్ల అమెరికన్ డాలర్లు. పులిని వేటాడడం నిషేధం. అంతర్జాతీయ నల్ల మార్కెట్లో ఒక పెద్ద పులి చర్మం రూ. ఎంత ధర పలుకుతుంది? ఎ) 10 లక్షలు బి) 5 లక్షలు సి) 20-25 లక్షలు డి) 2 లక్షలు   2. వన్యప్రాణుల చట్టం 1972 క్రింద అంతరించిపోతున్న జాతులను తమతో ఉంచుకోవడం నేరం. అంతర్జాతీయ చీకటి మార్కెట్లో ఒక పులి పిల్ల ధర

మరో బుల్‌ర్యాలీకి మార్కెట్‌ సన్నద్ధమవుతోంది: జున్‌జున్‌వాలా

Sunday 29th July 2018

ప్రముఖ బడా ఇన్వెస్టర్‌ రాకేశ్‌ జున్‌జున్‌వాలా దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరో బుల్‌ ర్యాలీకి సన్నద్ధమవుతున్నాయని అన్నారు. అయితే, రెండు అంశాలు తనకు ఆందోళన‍ కలిగిస్తున్నట్టు చెప్పారు. అవి పెరుగుతున్న చైనా రుణ భారం, యూరోజోన్‌ విచ్ఛిన్నానికి అవకాశాలేనని చెప్పారు. యూరోజోన్‌లో ఏదైనా ప్రతికూలత చోటు చేసుకుంటే అది మన బుల్స్‌కు విఘాతం కలిగించే పరిణామంగా ఆయన పేర్కొన్నారు.    ‘‘యూరో అన్నది శాశ్వతంగా ఉండేది కాదు. ఇది ఏడాదిలో విచ్ఛినమవుతుందా లేక

Most from this category