News


జీవిత బీమా తీసుకుంటున్నారా? అయితే ఇంకో వారం ఆగండి!

Monday 25th November 2019
personal-finance_main1574674248.png-29839

కొత్తగా జీవిత బీమా పాలసీలను ఈ నెల 30 లోపు తీసుకోమని ఎజెంట్లు తొందర పెడుతున్నారా? అయితే ఆచితూచి అడుగేయాల్సిందే. ఎందుకంటే జీవిత బీమాకు సంబంధించి ఐఆర్‌డీఏఐ (ఇన్సురెన్స్‌ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) కొత్త మార్గదర్శకాలు డిసెంబర్‌ 1 వ తేది నుంచి అమలులోకి రానున్నాయి. అందుకే జీవిత బీమా పంపిణిదారులు పాలసీలు తీసుకోమని వినియోగదారులను తొందరపెడుతున్నారని పరిశీలకులు తెలిపారు. ‘కొత్త ప్లాన్‌లలో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా గ్యారెంటీ రిటర్న్‌ తగ్గుతుంది. ఇలాంటి కారణాల వలనే పాలసీ పంపిణీదారులు ఆత్రుతగా ఉన్నారు. వాళ్ల సలహాలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని ఐడీబీఐ ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌, సీఎంఓ, హెడ్‌, ప్రోడెక్ట్స్‌ కార్తిక్‌ రామన్‌ అన్నారు. ‘కొత్త మార్గదర్శకాల వలన ప్రీమియం పెరగనున్నప్పటికి, అది అంత ఎక్కువగా ఉండదు. ముఖ్యంగా ప్రీమియం అధికంగా ఉందంటే వినియోగదారులకు మంచి ఫీచర్లు అందుబాటులో ఉంటాయని అర్ధం’ అని తెలిపారు. 

పెన్సన్‌ ప్లాన్‌లకు పండుగ!
ఐఆర్‌డీఏఐ తీసుకొస్తున్న కొత్త మార్గదర్శకాల వలన పెన్సన్‌ ప్లాన్‌లు ఆకర్షణీయంగా మారనున్నాయి. ‘మెచ్యురిటీ అయ్యాక ఉపసంహరించుకోవడం, ప్రీ మెచ్యుర్‌ ఉపసంహరణ, బీమా కం‍పెనీలు అందించే ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశాలు వంటి అంశాలలో అదనపు సౌకర్యాలు చేరడంతో కొత్త మార్గదర్శకాల వలన పెన్షన్‌ ప్లాన్‌లు మరింత ఆకర్షణీయంగా మారనున్నాయి’ అని ఫిన్‌సేఫ్‌ ఇండియా, వ్యవస్థాపకుడు, మ్రిన్‌ అగర్వాల్‌ అన్నారు. డిసెంబర్‌ 1 నుంచి అమలులోకి రానున్నా కొత్త మార్గదర్శకాల వలన అత్యధిక కమ్యుటేషన్‌(ఒకే సారి తీసుకునే మొత్తం) 60 శాతానికి పెరిగింది. ఇది ప్రస్తుతం 33 శాతం దగ్గరుంది. ఎజెంట్లు చెప్పినట్టు ఈ కొత్త మార్గదర్శకాల వలన ఫిక్స్‌డ్‌ రిటర్న్‌ తగ్గనున్నప్పటికి, ఇలాంటి ఆఫర్లను వినియోగదారులు పొందే అవకాశం ఉంది. అయినప్పటికి ఉపసంహరించుకునే నగదు, మొత్తం నగదులో మూడవ వంతు ఉంటే వాటిపై పన్ను యధావిదిగా విధిస్తారు. ఇది ఎన్‌పీఎస్‌కు(జాతియ పెన్సన్‌ స్కీమ్‌) బిన్నంగా ఉంటుంది. 
   ఈ కొత్త మార్గదర్శకాల వలన ఇన్సురెన్స్‌ కంపెనీలు తప్పనిసరిగా మెచ్యురిటీ నగదుకు గ్యారెంటీని ఆఫర్‌ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా పెన్సన్‌ యులిప్‌(యూనిట్‌ లింక్డ్‌ ఇన్సురెన్స్‌ ప్లాన్స్‌) విభాగం కళ తప్పే అవకాశం ఉంది. ఈ నిబంధనల వలన కంపెనీలు తప్పనిసరిగా డెట్‌ విభాగాలలో ఇన్వెస్ట్‌ చేయాలి. ఇది రిటర్న్‌లు తగ్గడానికి కారణమవుతుంది. అయినప్పటికి ఈ అంశం ఆప్షన్‌గా వినియోగదారులు తీసుకోవచ్చు. కొత్త మార్గదర్శకాల వలన పాలసీ హోల్డర్లు తమకు గ్యారెంటీ కావాలో వద్దో నిర్ణయించుకునే స్వేచ్చ ఉంటుంది. ఇప్పుడున్న నిబంధనల వలన పాలసీ హోల్డర్లు మెచ్యురిటీ వద్ద ఇతర కంపెనీల నుంచి యాన్యుటీలను కొనుగోలు చేయడానికి వీలుండదు. కానీ కొత్త నిబంధనల వలన డిసెంబర్‌ 1 తర్వాత, ప్లాన్‌ను కొనుగోలు చేసిన బీమా కంపనీకి పూర్తిగా కట్టేసుకొని ఉండాల్సిన పనిలేదు. కొత్త నిబంధనల వలన పాలసీ హోల్డర్లు ఇతర ఇన్సురెన్స్‌ కంపెనీలు ఇచ్చే అధిక రిటర్న్‌ల కోసం, తమ కార్పస్‌(మెచ్యురిటీ అయిన పాలసీ నుంచి ఒకే సారి తీసుకున్న నగదు తర్వాత మిగిలినది) నుం‍చి 50 శాతం వరకు వినియోగించుకోవచ్చు. 

యులిప్‌ కొనుగోలుదారులకు..
డిసెంబర్‌ 1 నుంచి యులిప్‌ కింద జీవిత బీమా కవరేజి వార్షిక ప్రీమియం 10 రెట్లు నుంచి ఏడు రెట్లకు తగ్గించారు. ఇది 45 ఏళ్లకు దిగువన ఉన్నవాళ్లకు కూడా వర్తిస్తుంది. జీవిత బీమా కవరేజిలో మోర్టాలిటీ చార్జీలు కూడా కలిసుండడంతో,  ఇన్వెస్ట్‌ చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఫలితంగా రిటర్న్‌లు మెరుగుపడతాయి. కానీ సెక్షన్‌ 80సీ, 10(10డీ) కింద అధిక పన్ను ప్రయోజనాలను పొందాలనుకుంటే, జీవిత బీమా కవరేజి వార్షిక ప్రీమియం కంటే 10 రెట్లు అధికంగా ఉండాలి. 

వేచి చూడడం మంచిది..
కొత్త మార్గదర్శకాల వలన పాలసీలు వినియోగదారులకు మరింత  స్నేహపూర్వకంగా మారతాయి. పదేళ్ల కాలపరిమితిగల ఎండోమెంట్‌ పాలసీల సరండర్‌ విలువను(మెచ్యుర్‌ కాకముందే ఎగ్జిట్‌ అయితే వచ్చే నగదు) పొందాలంటే ఇక నుంచి రెండేళ్లు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఇది ముందు మూడేళ్లుగా ఉంది. పాత పాలసీలకు ఈ పరిమితి చెల్లించిన ప్రీమియంలో 30 శాతంగా ఉండేది(కంపెనీ చెల్లించిన ఎటువంటి ప్రయోజనాలనైనా తీసివేయాలి). కొత్త నిబంధనల వలన డిసెంబర్‌ 1 నుంచి ఈ పరిమితి స్వల్పంగా పెరిగి 35 శాతానికి చేరుకుంది. అంతేకాకుండా పాలసీ నుంచి తొందరగా బయటకు వెళ్లిపోతే పడే పెనాల్టీలు గణనీయంగా తగ్గనున్నాయి. అదనంగా పాలసీలు ఏడేళ్ల కాలపరిమితికి మించి ఉంటే, సరండర్‌ విలువ పెరగాలని ఐఆర్‌డీఏఐ తెలిపింది. అంతేకాకుండా పాలసీ మెచ్యురిటీకి చేరువవుతుండడంతో కవరేజీ సుమారుగా 90 శాతానికి పెరుగుతుంది. అయినప్పటికి ఇలాంటి ప్రయోజనాల కోసం ఎండోమెంట్‌ పాలసీలను తీసుకోవద్దు. ఒకవేళ మీ ప్రాథమిక దృక్పథం వృద్ధి కంటే రక్షణ అనుకుంటే, వారు చెప్పే ప్రయోజనాలకు ఏకీభవిస్తే అప్పుడు వీటిని ఎంచుకోవడం మంచిది. ‘15-20 ఏళ్ల వరకు ప్రీమియంలు కట్టడానికి సిద్ధపడితే, ప్రిమెచ్యుర్‌ ఎగ్జిట్‌ నిబంధనలకు సమంజసంగా ఉండదు’ పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఇన్సురెన్స్‌, హెడ్‌ ప్రోడక్ట్స్‌ మోహిత్‌ గార్గ్‌ అన్నారు. 

ఇతర ప్రయోజనాలు..
కొత్త నిబంధనల వలన సరండర్‌ ప్రయోజనాలతో పాటు ఇతర ప్రయోజనాలను కూడా వినియోగదారులు పొందనున్నారు. దీర్ఘకాలంగా కొనసాగిన ప్రీమియంలను తిరిగి పునరుద్ధరించేందుకు ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడనున్నాయి. ఇలాంటి పాలసీ హోల్డర్లు ఐదేళ్ల తర్వాత తమ ప్రీమియంను 50 శాతం మేర తగ్గించుకొని పాలసీని కొనసాగించవచ్చు. మధ్యలోనే ప్రీమియం చెల్లింపులను ఆపేసిన పాలసీ హోల్లర్లు తిరిగి తమ పాలసీలను కొనసాగించుకునేందుకు అవకాశం ఉంటుంది. 
   రిస్క్‌ టెర్మ్‌ ఇన్సురెన్స్‌ పాలసీ కోసం అంటే పాలసీ హోల్డర్‌ మరణం తర్వాత ఆయన మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబం కోసం పాలసీలను తీసుకోవచ్చు. ‘ఒక వేళ జీవిత బీమా కోసం అన్వేషిస్తుంటే
,  అది మీకు, మీ కుటుంబానికి రక్షణగా ఉండేలా చూసుకోవాలి’ అని గార్గ్‌ అన్నారు. You may be interested

12050పైన క్లోజయితే ఆల్‌టైమ్‌ హై పక్కా!

Monday 25th November 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా దేశీయ మార్కెట్‌ గతవారం ఒడిదుడకుల పయనం నుంచి ఈ వారం గాడిలో పడింది. సోమవారం చిన్నపాటి లాభంతో ఆరంభమైన నిఫ్టీ మధ్యాహ్న సమయానికి దాదాపు 140 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. దీంతో మరోమారు నిఫ్టీ కీలక 12వేల పాయింట్ల పైకి చేరింది. గత నిరోధం 12038 పాయింట్లను దాటి 12050 పాయింట్లకు అటుఇటుగా కదలాడుతోంది. దీంతో నిఫ్టీ పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించినట్లే కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ

5నెలల గరిష్టానికి నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ

Monday 25th November 2019

ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మార్కెట్లో కొనుగోళ్లు జరగడంతో సూచీలు రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 505 పాయింట్లు పెరిగి 40,868.30 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 153 పాయింట్ల ఆర్జించి 12,067.05 వద్ద 5నెలల గరిష్టాన్ని తాకింది. అలాగే బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 453 పాయింట్లు లాభపడి 31,564.60 వద్ద 5నెలల గరిష్టాన్ని అందుకుంది. ఈ నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ

Most from this category