News


డిపాజిట్‌ క్యాన్సిలేషన్‌ వద్దు..!

Monday 6th January 2020
personal-finance_main1578282342.png-30694

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే వారు మన చుట్టూ చాలా మంది ఉంటారు. ఎందుకంటే పెట్టుబడి విషయంలో ఇది సౌకర్యవంతమైన సాధనం. బ్యాంకు శాఖకు వెళ్లి గంట వ్యవధిలో డిపాజిట్‌ చేయడం, అవసరమైనప్పుడు వెళ్లి గంటలో నగదుగా మార్చుకోగల సౌకర్యం ఇందులో ఉంది. ఇతరత్రా ఎటువంటి సమస్యలూ ఇందులో ఉండవు. భద్రత కూడా ఎక్కువే. రాబడి తక్కువే ఉన్నా ఎక్కువ మంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను ఇష్టపడడానికి కారణం ఈ అంశాలే. డిపాజిట్‌ చేయడమే కాదు.. డబ్బుకు అవసరం ఏర్పడినప్పుడు ఆ డిపాజిట్‌ను రద్దు చేసుకునే వారు కూడా చాలా మంది ఉంటారు. కానీ, తాత్కాలిక అవసరానికి డిపాజిట్‌ను రద్దు చేసుకోవడం కంటే దానిపై రుణం తీసుకోవడమే మంచిది. ఎందుకంటే మళ్లీ డబ్బులు చేతికి అందగానే రుణాన్ని వెంటనే తీర్చేయవచ్చు. మీరు చేసిన డిపాజిట్‌పై యథావిధిగా రాబడులు కొనసాగుతాయి.
సానుకూలతలు ఇవే..
- ఆర్థిక అత్యవసర సమయాల్లో డిపాజిట్ల (ఎఫ్‌డీ)ను రద్దు చేసుకోవడానికి బదులు దానిపై రుణం తీసుకుంటే మీరు చెల్లించే వడ్డీ కూడా తక్కువగానే ఉంటుంది. గృహ రుణం తర్వాత అతి తక్కువ రుణ రేటు ఎఫ్‌డీపై తీసుకునే రుణంపైనేనని తెలుసుకోవాలి. 
- ఎఫ్‌డీ రేటు(ఎఫ్‌డీఆర్‌)పై బ్యాంకులు సాధారణంగా 1-2.5 శాతం అధికంగా రుణ రేటును అమలు చేస్తుంటాయి. ఉదాహరణకు ప్రస్తుతం మీ ఎఫ్‌డీపై బ్యాంకు రేటు 7 శాతంగా ఉందనుకోండి. అప్పుడు ఎఫ్‌డీపై తీసుకునే రుణానికి చెల్లించాల్సిన రేటు 8-9.5 శాతం మధ్యే ఉంటుంది. 
- ఎఫ్‌డీపై రుణానికి మీకు ఇతరత్రా ఎటువంటి అర్హతలు అవసరం లేదు. బ్యాంకులు క్రెడిట్‌ స్కోరు కూడా చూడవు. 
- ఎఫ్‌డీ విలువలో బ్యాంకులు గరిష్టంగా 75-95 శాతం వరకు రుణంగా ఇస్తాయి. ఇది సెక్యూర్డ్‌ రుణమే. 
- రుణం కోసం ఎటువంటి ప్రాసెసింగ్‌ ఫీజులు చెల్లించక్కర్లేదు. రుణం తీసుకుని మీరు వడ్డీ చెల్లిస్తున్న సమయంలోనూ.. బ్యాంకు ఎఫ్‌డీపై మీకు వడ్డీ రాబడి యథావిధిగా కొనసాగుతుంది.
- రుణానికి కాల వ్యవధి ఎఫ్‌డీ కాల వ్యవధిగానే ఉంటుంది. మీకు డబ్బులు చేతికి అందగానే ఎఫ్‌డీపై రుణాన్ని క్లియర్‌ చేసేయవచ్చు. ఇందులో ఉన్న మరో వెసులుబాటు ఇది. పది రోజుల కోసం, ఒక నెల రోజుల కోసమే ఎఫ్‌డీని రద్దు చేసుకోవడానికి బదులు.. రుణం తీసుకుని పది రోజుల్లో ముగించేయడం మంచిది. ముందస్తు చెల్లింపు చార్జీలు కూడా ఉండవు.
- ఒకవేళ డిపాజిట్‌ను నిర్ణీత కాలానికి ముందుగానే రద్దు చేసుకుంటే కొంత రాబడిని కోల్పోవాల్సి రావచ్చు. ఉదాహరణకు మీరు రెండేళ్ల కాలానికి డిపాజిట్‌ చేసి, మూడు నెలల తర్వాత వెళ్లి రద్దు చేసుకుంటే.. బ్యాంకు మూడు నెలల కాలానికి అమల్లో ఉన్న వడ్డీ రేటే చెల్లించొచ్చు.

ఎఫ్‌డీ రుణంపై బ్యాంకుల రేట్లు
బ్యాంకు ఎఫ్‌డీ రేటు 

రుణ రేటు

గరిష్ట రుణం ఎఫ్‌డీ 
యాక్సిస్‌ బ్యాంకు 3.50-7.00 85
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 3.50-7.00 90
పీఎన్‌బీ 4.50-6.50 95
ఫెడరల్‌ బ్యాంకు 3.50-7.10 2 90
ఇండియన్‌బ్యాంకు 4.50-6.60 90
ఎస్‌బీఐ  4.50-6.50 1 90
ఓబీసీ  5.40-6.80 1 90
బంధన్‌ బ్యాంకు 3.50-7.40 1.5-2 90
సిటీబ్యాంకు 3.00-5.50 2.5 90You may be interested

పన్ను ఆదాకు చక్కని పథకం

Monday 6th January 2020

మిరే అస్సెట్‌ ట్యాక్స్‌ సేవర్‌ ఫండ్‌  పెట్టుబడులపై అధిక రాబడులను పొందే అవకాశం.. అదే సమయంలో సెక్షన్‌ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ఆదా.. ఈ ప్రయోజనాలు ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పథకాల నుంచి పొందొచ్చు.  ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో మంచి పనితీరు చూపిస్తున్న టాప్‌ పథకాల్లో మిరే అస్సెట్‌ ట్యాక్స్‌ సేవర్‌ కూడా ఒకటి. ఈఎల్‌ఎస్‌ఎల్‌ పథకాల్లో చేసే పెట్టుబడులపై

పసిడి, చమురు ధరలు జూమ్‌

Monday 6th January 2020

అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రికత్తల ఎఫెక్ట్‌ 2 శాతం చొప్పున ఎగసిన పసిడి, చమురు ఏడేళ్ల గరిష్టాన్ని తాకిన కామెక్స్‌ బంగారం గత వారం చివర్లో మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో తాజాగా బంగారం, ముడిచమురు ధరలు వరుసగా రెండో రోజు జోరందుకున్నాయి. బాగ్దాద్‌ విమానాశ్రయం వద్ద అమెరికా డ్రోన్‌ దాడుల ద్వారా ఇరాన్‌, ఇరాక్‌ సైనికాధికారులను కాల్చివేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరానియన్‌ జనరల్‌ ఖాసిమ్‌ను డ్రోన్‌ దాడుల ద్వారా

Most from this category