News


ఏ వయసులో ఎంత వైద్య బీమా?

Monday 14th January 2019
personal-finance_main1547490566.png-23583

ఒకరిపై కుటుంబం ఆధారపడి ఉంటే, జీవిత బీమా పాలసీ తప్పకుండా తీసుకోవాలి. కానీ, వైద్య బీమా అలా కాదు. ఎవరికి వారు వారి ఆరోగ్య సమస్యలు, ఖర్చులను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. అనారోగ్యం అన్నది ఎప్పుడు ఏ రూపంలో ఎదురవుతుందో తెలియదు. ప్రమాదం బారిన పడినా వైద్య చికిత్సలు అవసరం అవుతాయి. చిన్న వయసులో ఆరోగ్య సమస్యల ముప్పు తక్కువ. కానీ, వయసు పెరుగుతున్న కొద్దీ జీవనశైలి వ్యాధుల రిస్క్‌ పెరుగుతుంటుంది. అందుకే వైద్య బీమా తీసుకునే విషయంలో తప్పకుండా వారి వయసును పరిగణనలోకి తీసుకోవాలి. అంటే రూ.2-3 లక్షల బీమా చాలులే అనుకుంటే అది సరికాదు. యువతీ, యువకులకే ఈ కవరేజీ. అదే 45 ఏళ్లు దాటిన వారికి ఈ కవరేజీ సరిపోదు. 

 

వైద్య బీమా తీసుకుంటే ఏ సమస్య వచ్చి ఆస్పత్రిలో చేరినా బీమా సంస్థలే ఆ భారాన్ని భరిస్తాయి. దాంతో ఇతర అవసరాల కోసం ఉంచుకున్న కష్టార్జితం కరిగిపోకుండా ఉంటుంది. అయితే, సరైన వైద్య బీమా పాలసీ తీసుకోవడం ఇందుకు కీలకం. ఈ విషయంలో ఎంత కవరేజీ తీసుకోవాలి? అందరికీ ఒకటే సమాధానం వర్తించదు. ఒక్కొకరి వయసు, వారి ఆరోగ్య చరిత్ర తదితర అంశాలు కీలకం అవుతాయి. అయితే, ఎంత కవరేజీ అవసరం అనే విషయంలో అపోలో మ్యూనిక్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీచో సూచిక రూపొందించింది. ఆ వివరాలే ఇవి...

 

వివాహం కాని 18-28 సంవత్సరాల్లోపు వారు రూ.5 లక్షల వైద్య బీమా తీసుకోవడం సముచితం. ఇందుకు ప్రీమియం రూ.8,000-10,000 వరకు ఉంటుంది. ఈ వయసులో ఆరోగ్యం మంచిగానే ఉన్నా, ఇన్ఫెక్షన్లు, ప్రమాదాల వల్ల పెద్ద మొత్తంలో ఆ‍స్పత్రి బిల్లు ఎదురయితే ఈ కవరేజీ ఆదుకుంటుంది. వివాహం అయి పిల్లల్లేని 30 సంవత్సరాల్లోపు దంపతులు... రూ.5 లక్షలకు ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ తీసుకోవాలి. ప్రీమియం రూ.10,000-12,000 వరకు ఉంటుంది. 35 ఏళ్లలోపు వయసుగల దంపతులు, ఇద్దరు పిల్లలు కలిగి ఉంటే రూ.7 లక్షలకు ఫ్యామిలీ ఫ్లోటర్‌ కవరేజీ తీసుకోవాలి. ఇందుకు ప్రీమియం రూ.15,000-20,000 మధ్య ఉంటుంది. 40 ఏళ్లకు దగ్గర్లో ఉండి, టీనేజీ వయసులో ఉన్న పిల్లలు కలిగిన దంపతులు రూ.10 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ తీసుకోవాలి. ప్రీమియం రూ.20,000-30,000 వరకు ఉంటుంది. 50 ఏళ్లకు సమీపంలో ఉన్న దంపతులకు తీవ్ర అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది. వీరు తమకు, పిల్లలకు వేర్వేరుగా కవరేజీ తీసుకోవడం సముచితం. దంపతులు రూ.10 లక్షలకు, పిల్లలకు రూ.5 లక్షల కవరేజీ తీసుకోవాలి. ఇక వృద్ధులు అయితే ఒక్కొకరు రూ.10-15 లక్షల మధ్య కవరేజీ తీసుకోవాలి. ఇందుకు రూ.30,000-45,000 ప్రీమియం ఉంటుంది. 



You may be interested

10750లపైన ప్రారంభమైన నిఫ్టీ

Tuesday 15th January 2019

ఆశాజనకమైన ఆర్థిక గణాంకాల విడుదలతో మంగళవారం సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 36వేల ఎగువును, నిఫ్టీ 107500లపై ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర తిరిగి 60డాలర్లకు దిగిరావడం, ఆసియా మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ సైతం దేశీయ సూచీలకు సానుకూల సంకేతాలనిచ్చాయి. కేంద్ర గణాంకాలు శాఖ డిసెంబర్‌ నెలకు సంబంధించిన టోకు, రీటైల్‌ ద్రవ్యోల్బణ గణాకాంలు నిన్న విడుదల చేసింది. టోకు ధర సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత

ఈ రంగాలకు ప్రస్తుతం దూరం: మోతీలాల్‌ ఓస్వాల్‌

Monday 14th January 2019

ఆటో, మెటల్స్‌, సిమెంట్‌ రంగాల షేర్లకు ప్రస్తుతం దూరంగా ఉండడం నయమని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా సూచించారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎన్నికల వరకు వేచి ఉండాలా అనే దానిపై సంశయంతో ఉన్నారని చెప్పారు. గతేడాది చివర్లో రాష్ట్రాల ఎన్నికల ముందు వ్యాల్యూమ్‌లు తగ్గిపోయాయని, కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలైనా గానీ తర్వాత మార్కెట్లు పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Most from this category