News


బీమాకు మరింత ధీమానివ్వాలి

Saturday 25th January 2020
news_main1579921252.png-31181

 • టర్మ్, హెల్త్‌ పాలసీలపై ప్రత్యేక పన్ను 
 • మినహాయింపునివ్వాలి
 • ప్రాపర్టీ పాలసీలకు ప్రయోజనాలు కల్పించాలి
 • జీఎస్‌టీని 12 శాతానికి తగ్గించాలి
 • ఇన్సూరెన్స్‌ సంస్థల వినతులు...

దేశ జనాభా సుమారు 133 కోట్ల స్థాయిలో ఉన్నా దేశీయంగా బీమా పాలసీలు ఇంకా అంతగా ప్రాచుర్యం పొందడం లేదు. స్థూల దేశీయోత్పత్తిలో బీమా రంగం వాటా 5 శాతం లోపే ఉంటోంది. ఈ నేపథ్యంలో బీమా విస్తృతిని మరింతగా పెంచే దిశగా బడ్జెట్‌లో పన్నుపరమైన ప్రోత్సాహకాలు మరిన్ని ఇవ్వాలని ఇన్సూరెన్స్‌ సంస్థలు కోరుతున్నాయి. టర్మ్‌ పాలసీలు, పింఛను పథకాల్లాంటి కొన్ని పాలసీలను ప్రత్యేకంగా పరిగణించి, విడిగా పన్ను మినహాయింపునివ్వాలని జీవిత బీమా సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రస్తుతం బీమా సంస్థలు పెన్షన్‌ పాలసీల విషయంలో ఎన్‌పీఎస్‌తో పోటీపడాల్సి ఉంటోంది. నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌)కు లభిస్తున్న పన్నుపరమైన ప్రోత్సాహకాలు, ఆదాయపు పన్నుకు సంబంధించి రూ. 50,000 దాకా మినహాయింపులు వంటి ప్రయోజనాలు మిగతా పెన్షన్ పథకాలకు పెద్దగా లభించడం లేదు. ఇక, టర్మ్‌ ప్లాన్లకు విడిగా పన్ను మినహాయింపులు ఇవ్వాలని అయిదేళ్లుగా డిమాండ్‌ చేస్తున్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు తాజాగా మళ్లీ దాన్ని తెరపైకి తెచ్చాయి. తొలిసారి లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేవారికి విడిగా రూ. 50,000 డిడక్షన్, ప్రత్యేకంగా టర్మ్‌ పాలసీ మాత్రమే తీసుకునేవారికి అదనంగా రూ. 50,000 పన్ను మినహాయింపులిస్తే.. ఈ పాలసీలను మరింతగా విస్తృతిలోకి తేవొచ్చని ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ కమలేష్‌ రావు అభిప్రాయపడ్డారు. మరోవైపు, ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌ తీసుకునే వారికి కూడా ప్రత్యేకంగా పన్నుపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని సాధారణ బీమా కంపెనీలు కోరుతున్నాయి. ప్రస్తుతం నాన్‌–లైఫ్‌ పాలసీల్లో హెల్త్‌ ఇన్సూరెన్స్‌కి తప్ప మిగతావాటికి పన్ను ప్రయోజనాలు ఉండటం లేదు. 

మహిళలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించాలి ..

 • బీమా, పొదుపువైపు మళ్లేలా మహిళలను మరింతగా ప్రోత్సహించేందుకు వారికి అదనంగా పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలి.
 • పన్ను మినహాయింపు లభించాలంటే వార్షిక ప్రీమియంకు పది రెట్లు ఇన్సూరెన్స్‌ ఉండాలన్న నిబంధన ఎత్తివేయాలి.
 • ఒకవేళ వ్యక్తిగత లైఫ్‌ పాలసీల ప్రీమియంలకు ప్రత్యేకంగా డిడక్షన్‌ ఇవ్వని పక్షంలో.. సెక్షన్‌ 80 సీ పరిమితినైనా ప్రస్తుతమున్న రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచాలి. 
 • వ్యక్తిగతంగా తీసుకునే గృహ బీమా పథకాలకు పన్ను మినహాయింపునివ్వాలి.
 • వ్యక్తిగత ప్రమాద బీమా, గృహ బీమా పథకాలకు సెక్షన్‌ 80డీ కింద ప్రత్యేకంగా పన్ను మినహాయింపులివ్వాలి.
 • పాలసీలు కొనుగోలు చేసే వేతన జీవులకు మరిన్ని పన్నుపరమైన ప్రయోజనాలు కల్పిస్తే బీమా మరింత ప్రాచుర్యంలోకి రాగలదు.
 • జాతీయ విపత్తుల సమయంలో ఎక్కువగా నష్టపోతున్నది సామాన్య ప్రజలే. వారికి చౌక ప్రీమియంలతో గృహ బీమా సదుపాయం కల్పించాలి. దీన్ని ప్రాపర్టీ ట్యాక్స్‌తో పాటే వసూలు చేయొచ్చు. విపత్తు వల్ల నష్టం వాటిల్లిన పక్షంలో క్లెయిమ్‌ మొత్తాన్ని సదరు పాలసీదారు జన ధన యోజన ఖాతాలోకి నేరుగా మళ్లించవచ్చు.
 • ప్రస్తుతం బీమా పాలసీలపై ఏకంగా 18 శాతం జీఎస్‌టీ ఉంటోంది. పాలసీల కొనుగోళ్లకు ఇది ప్రతిబంధకంగా మారుతోంది. దీన్ని 12 శాతానికి తగ్గిస్తే పాలసీదారులు, కంపెనీలకూ ప్రయోజనకరంగా ఉంటుంది. You may be interested

మిస్త్రీ కేసులో టాటాలకు మరో ఊరట

Saturday 25th January 2020

ఆర్‌వోసీ పిటిషన్‌పై ఎన్‌ఎస్‌ఎల్‌ఏటీ ఉత్తర్వుకు సుప్రీం స్టే న్యూఢిల్లీ: టాటా-మిస్త్రీ కేసులో టాటా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఎస్‌పీఎస్)కు సుప్రీంకోర్టులో మరో ఊరట లభించింది. వివరాల్లోకి వెళితే... టీఎస్‌పీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మిస్త్రీని తిరిగి నియమించాలంటూ అప్పీలెట్‌ ట్రిబ్యునల్‌ ఎన్‌సీఎల్‌ఏటీ  డిసెంబర్‌ 18న ఉత్తర్వులిచ్చింది. టాటా సన్స్‌ను పబ్లిక్‌ కంపెనీ నుంచి ప్రైవేటు కంపెనీగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ-ముంబై)  మార్చడం ‘‘అక్రమం’’ అని తన రూలింగ్‌లో పేర్కొంది.  ‘‘ఆర్‌ఓసీ సహాయంతో’’

స్థిరమైన రాబడులను ఆశిస్తు‍న్నారా..?

Saturday 25th January 2020

మార్కెట్లో ఎప్పుడు, ఏ స్టాక్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే రాబడులు తీసుకోవచ్చన్న సూక్ష్మం సాధారణంగా ఎక్కువ మంది రిటైల్‌ ఇన్వెస్టర్లకు తెలియదు. ఎందుకంటే రిటైల్‌ ఇన్వెస్టర్ల దృష్టి ఎక్కువ శాతం స్వల్పకాలంలో అధిక రాబడులను ఇచ్చే స్టాక్స్‌ ఏవి? అనే దానిపైనే ఉంటుంది. స్థిరమైన రాబడుల పట్ల వారు అంత ఆసక్తి చూపించరు. ఈ విధమైన ధోరణి ఎక్కువ సందర్భాల్లో వారు నష్టపోయేలా చేస్తోంది. వార్షికంగా సగటున డబుల్‌ డిజిట్‌ కాంపౌండెడ్‌

Most from this category