News


మీ డబ్బులు బీమా కంపెనీ వద్దే ఉండిపోయాయా?

Wednesday 1st August 2018
personal-finance_main1533124485.png-18844

దేశంలోని 23 బీమా సంస్థల వద్ద పాలసీదారులు క్లెయిమ్‌ చేసుకోని నిధులు రూ.15,157 కోట్లు ఉన్నట్టు ఐఆర్‌డీఏ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో ఎల్‌ఐసీ వద్దే రూ.10,509 కోట్లు ఉన్నాయి. మిగిలిన 22 ప్రైవేటు బీమా సంస్థల వద్ద ఉన్న అన్‌ క్లెయిమ్డ్‌ మొత్తం రూ.4,657 కోట్లు. ఈ ఏడాది మార్చి నాటికి అందుబాటులో ఉన్న గణాంకాలు ఇవి. 

 

క్లెయిమ్‌ చేయని నిధుల పరిస్థితి?

క్లెయిమ్‌ చేయకుండా పదేళ్లు దాటిన పాలసీల నిధుల మొత్తాన్ని వృద్ధుల సంక్షేమ నిధి (ఎస్‌సీడబ్ల్యూఎఫ్‌)కి 2018 మార్చి 1 నాటికి బదిలీ చేయాలని ఐఆర్‌డీఏ గతేడాదే ఆదేశించింది. ఈ నిధులను వృద్ధుల సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. 

 

పాలసీదారుల బాధ్యత

క్లెయిమ్‌ చేయకుండా ఎందుకు అలా ఉండిపోయాయన్న సందేహం సాధారణంగానే వస్తుంది. పాలసీదారులు మరణిస్తే వారి వారసులకు పాలసీ ఉన్నట్టు తెలియకపోవడం లేదా పాలసీ డాక్యుమెంట్‌ కనిపించకపోవడంతో విడిచి పెట్టి ఉండొచ్చు. మరణాంతరం క్లెయిమ్‌ చేసుకునే స్థితిలో వారి నామినీలు లేకపోయి ఉండొచ్చు. అందుకే పాలసీ తీసుకున్న ప్రతి ఒక్కరూ నామినీగా తమ వారి పేరును నమోదు చేయడంతోపాటు, పాలసీ వివరాలను వారికి తప్పకుండా తెలియజేయాలి. అప్పుడు ఈ తరహా పరిస్థితి రాదు. కాల వ్యవధి ముగిసే వరకు క్లెయిమ్‌ రాని ఎండోమెంట్‌ పాలసీలకు సంబంధించిన మొత్తాన్ని ఆ తర్వాత చెక్కు రూపంలో పోస్ట్‌ ద్వారా బీమా సంస్థలు పంపిస్తాయి. పాలసీదారులు చిరునామా మారి, ఆ వివరాలను బీమా సంస్థకు తెలియజేయకపోయి ఉంటే చెక్కులు వెనక్కి తిరిగొస్తాయి. లేదా చెక్కులు కనిపించకుండా పోయి ఉండొచ్చు.

 

గుర్తించడం ఎలా?

అన్ని బీమా సంస్థలు అన్‌క్లెయిమ్డ్‌ నిధులు అసలు లబ్ధిదారులకు చేరేందుకు గాను, తమ పోర్టల్స్‌లో సెర్చ్‌ సదుపాయాన్ని కల్పించాలని ఐఆర్‌డీఏ ఆదేశించింది. కాకపోతే పాలసీ నంబర్‌, పాన్‌, పాలసీదారుడి పేరు, పుట్టిన తేదీ, ఆధార్‌ నంబర్‌ తదితర వివరాలుంటే వాటి ఆధారంగా తమకు సంబంధించి క్లెయిమ్‌ చేసుకోకుండా ఉన్న నిధుల గురించి తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. అర్ధ సంవత్సరానికి ఓ సారి ఈ వివరాలను అప్‌డేట్‌ చేయాలని బీమా సంస్థలను ఐఆర్‌డీఏ ఆదేశించింది.You may be interested

గరిష్టాలకు నాలుగు మ్యూచువల్‌ ఫండ్స్‌ 

Wednesday 1st August 2018

ప్రముఖ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ)లు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఆదిత్య బిర్లా, రిలయన్స్‌, ఎస్‌బీఐకి చెందిన పేరొందిన ఫండ్స్‌ ఈ ఏడాది జనవరిలో నమోదు చేసిన జీవిత కాల గరిష్ట ఎన్‌ఏవీలను చేరుకోవడానికి సమయం పట్టే పరిస్థితులు ఉంటే, చిన్న ఫండ్స్‌ సంస్థల పథకాలు ఓ నాలుగు మాత్రం ఇప్పటికే జీవిత కాల గరిష్ట స్థాయిలను చేరిపోవడం గమనార్హం. ఆకర్షణీయ విలువల వలలో పడిపోకుండా, స్థిరమైన వృద్ధి అవకాశాలున్న స్టాక్స్‌ను నమ్ముకోవడమే

కోట్లు సమకూరాలంటే ఇలా చేస్తే సరి!

Wednesday 1st August 2018

స్టాక్‌ మార్కెట్లు జూలైలో నూతన గరిష్టాలకు చేరాయి. కానీ, విడిగా ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్‌ లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడులు మాత్రం మార్కెట్ల స్థాయిల్లో లేవు. నిజానికి మార్కెట్ల ర్యాలీ కొన్ని బలమైన స్టాక్స్‌తోనే జరుగుతుండడంతో, విడిగా ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోపై అది ప్రతిఫలించడం లేదు. మిగిలిన స్టాక్స్‌ చాలానే ఒత్తిళ్లలో ఉన్నాయి. దీంతో సూచీలు గరిష్టాల్లో ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో రూ.కోట్లాది రూపాయల సంపద సృష్టి కోసం తమ పోర్ట్‌ఫోలియోలో

Most from this category