News


బీమా కోసం ఆన్‌లైన్‌లో అన్వేషించే ముందు...!

Monday 6th August 2018
personal-finance_main1533556271.png-18984

ఇంటర్నెట్‌ వినియోగించే వారికి బీమా పాలసీల ప్రకటనలు కనిపించడం సహజం. ప్రతి రోజూ కేవలం రూ.11కే ఇంత మొత్తం బీమా పాలసీ అనేది ఆ ప్రకటనలో ఉంటుంది. క్లిక్‌ చేస్తే అక్కడి నుంచి మీరు మరో పోర్టల్‌కు వెళతారు. వివిధ బీమా సం‍స్థల పాలసీలు, వాటిలో ఉన్న ఫీచర్లు, ప్రీమియం తదితర వివరాలు అందించే సైట్లు అవి. ఈ వివరాలు తెలుసుకునే ముందు తమ పేరు, మొబైల్‌ నంబర్‌, ఈ మెయిల్‌ ఐడీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా మంది ఈ వివరాలు ఇచ్చి బీమా పాలసీల కోసం చూసి వదిలేస్తుంటారు. కానీ, ఇదంతా సాధారణమే అని అనుకోవద్దు. నిజానికి తాము వివరాల కోసం ఆశ్రయించినది అనుమతి ఉన్న పోర్టల్‌ అవునా, కాదా అన్నది తెలుసుకోవాలి.

 

బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ ‘ఐఆర్‌డీఏ’ అనుమతి ఉన్న వెబ్‌ అగ్రిటేటర్లే బీమా సంస్థల ప్రీమియం కొటేషన్లను పోల్చి చూసుకునే సేవల్ని అందించాల్సి ఉంటుంది. అందుకే ఈ తరహా సేవలను ఉచితంగా పొందే ముందు నిజంగా ఆయా సైట్లు అనుమతి ఉన్నవేనా, కాదా అనేది తెలుసుకోవాలి. మీ కాంటాక్ట్‌ నంబర్‌, ఇతర విలువైన వివరాలను గుర్తింపులేని సంస్థలకు ఇస్తే, అవి డైరెక్ట్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు కాసులకు అమ్ముకుంటాయి. అంతేకాదు, ఒక్కోసారి ఈ తరహా అనధికారిక సైట్ల ద్వారా డబ్బులను మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయని నిపుణుల హెచ్చరిక. నిబంధనల మేరకు వెబ్‌ అగ్రిగేటర్‌ అన్నది బీమా మధ్యవర్తిత్వ సంస్థ. బీమా పాలసీల ఆశావహ కొనుగోలు దారులకు వివిధ బీమా ఉత్పత్తుల ధరల మధ్య పోల్చుకునే సేవలను అందించాల్సి ఉంటుంది. 29 సంస్థలు వెబ్‌ అగ్రిగేటర్లుగా నమోదు చేసుకున్నాయి. వీటిలో పాలసీబజార్‌, మై ఇన్సూరెన్స్ క్లబ్‌, పాలసీఎక్స్‌, ఆస్క్‌అర్వి తదితర సంస్థలు ఉన్నాయి. ఈ నమోదిత సంస్థలు మినహా మరే సంస్థ కూడా బీమా ఉత్పత్తులను పోల్చి చూసుకునే సేవలను అందించకూడదన్నది నిబంధన. 

 

సులభ మార్గం

అనుమతి ఉన్న వెబ్‌ అగ్రిగేటర్‌ ఏదన్నది తెలుసుకునేందుకు ఐఆర్‌డీఏ వెబ్‌సైట్‌ను ఆశ్రయించొచ్చు. అక్కడ లైసెన్స్‌ ఉన్న కంపెనీల వివరాలు ఉంటాయి. వెబ్‌ అగ్రిగేటర్లు కూడా ఐఆర్‌డీఏ లైసెన్స్‌ నంబర్‌ను తమ పోర్టళ్లలో పేర్కొనాల్సి ఉంటుంది. అలాగే, రిజిస్ట్రేషన్‌ తేదీని కూడా ప్రద్శించాల్సి ఉంటుంది. అలా లేదంటే అది నకిలీ వెబ్‌సైట్‌ అయి ఉంటుందని సందేహించాల్సిందే. నకిలీ వెబ్‌సైట్లు మీ విలువైన సమాచారాన్ని సేకరించి అమ్ముకోవడం ద్వారా లబ్ధిపొందడమే వాటి వ్యాపారం. కానీ, నమోదిత వెబ్‌ అగ్రిగేటర్‌ కంపెనీలకు మాత్రం తమ పోర్టళ్ల ద్వారా పాలసీ విక్రయిస్తే కమీషన్‌ లభిస్తుంది. ఇక, వెబ్‌ అగ్రిగేటర్లు తమ పోర్టళ్లలో కంపెనీల ఉత్పత్తులకు సంబంధించి కచ్చిత సమాచారాన్నే అందుబాటులో ఉంచాలి. ప్రీమియం, క్లెయిమ్‌ హిస్టరీ, పాలసీ ఫీచర్లు తదితర సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. ఉదాహరణకు టర్మ్‌ పాలసీ, కట్టిన ప్రీమియంలను చివర్లో వెనక్కు ఇచ్చే పాలసీల కోసం అన్వేషిస్తుంటే, అటువంటి వారికి ఆ ఫీచర్‌తో ఉన్న పాలసీలను మాత్రమే ప్రదర్శించాలి. ఎంపిక చేసిన డేటా, కంపెనీల సమాచారాన్ని మాత్రమే ఇచ్చి, మానిప్యులేట్‌ చేయకూడదు. అలాగే, ప్రీమియం ఎంతో కూడా కచ్చితంగా ప్రదర్శించాల్సిందే. దాంతో పాలసీ కోసం అన్వేషించే వారు ఓ నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది.You may be interested

మళ్లీ లాభాతోనే...

Tuesday 7th August 2018

కొత్త రికార్డ్‌ స్థాయిల వద్ద సూచీలు ఆరంభం సెన్సెక్స్‌ 37,849 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11,423 పాయింట్ల వద్ద ప్రారంభం మార్కెట్లు మంగళవారం కూడా సరికొత్త రికార్డ్‌ స్థాయిల వద్ద ఆరంభమయ్యాయి. సెనెక్స్‌ 37,840 మార్క్‌కు పైన, నిఫ్టీ 11,420 మార్క్‌కు పైగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 158 పాయింట్ల లాభంతో 37,849 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 11,423 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. కాగా మార్కెట్లు

ప్రస్తుతం ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు...?

Monday 6th August 2018

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రధాన సూచీలు జీవిత కాల గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి, ఏ రంగం మార్కెట్‌ తదుపరి ర్యాలీలో పాల్గొంటుంది? అన్న సందేహాలు ఇన్వెస్టర్లకు రావచ్చు. దీనికి మార్కెట్‌ నిపుణులు బ్యాంకింగ్‌ స్టాక్స్‌ను సూచిస్తున్నారు.    కార్పొరేట్‌ ఫలితాల్లో రికవరీ కొనసాగుతుంది ఐటీ స్టాక్స్‌, ఫార్మా, బ్యాంకింగ్‌ ఇలా పలు రంగాలు ప్రస్తుతం పెట్టుబడులకు ఆకర్షణీయంగా కనిపిస్తుండడంతో ఇన్వెస్టర్లలో అయోమయం నెలకొంది. గత

Most from this category