Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ola Cabs Ceo Hemant Bakshi Quits In Three Months
చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్‌ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు

ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ఓలా క్యాబ్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే ఆ సంస్థ సీఈఓ పదవికి హేమంత్ బక్షి రాజీనామా చేసినట్లు సమాచారం.  దీంతో పాటు సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఓలా క్యాబ్స్‌ దాదాపు 200 మంది ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయిఐపీఓకి ఓలా ఓలా క్యాబ్స్‌ ఐపీఓ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్స్‌తో ఓలా క్యాబ్స్‌ ఇటీవలే చర్చలు నిర్వహించింది. మరో రెండు మూడు నెలల్లో సెబీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్‌ ఇప్పటికే ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది.ఈ తరుణంలో సీఈఓ రాజీనామా, ఉద్యోగుల తొలగింపు అంశం ఓలా క్యాబ్స్‌ చర్చాంశనీయంగా మారింది. కాగా, ఓలా క్యాబ్స్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 

Credit Cards Use Pay For Utility Bills Banks Extra 1 Percent Charges From May 1st
మారిన క్రెడిట్‌ కార్డ్‌ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..

క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.ఇటీవల ఎస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లు మే 1 నుంచి తమ క్రెడిట్‌ కార్డ్‌ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రసిటీ బిల్‌, వాటర్‌ బిల్‌, గ్యాస్‌ బిల్‌ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.దీంతో మీరు ఎస్‌బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి నెలవారీ కరెంట్‌ బిల్లు రూ.1500 చెల్లిస్తుంటే అదనంగా రూ.15 చెల్లించాల్సి ఉంటుంది.అయితే, వినియోగదారులు ఎస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై రూ.15,000, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై రూ. 20,000 ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. లిమిట్‌ దాటితే పైన పేర్కొన్న వన్‌ (ఒకశాతం) పర్సెంట్‌ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. 18 శాతం జీఎస్టీని సైతం చెల్లించాల్సి ఉంటుంది.    

stock market rally today Closing
భారీగా పుంజుకున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 215 పాయింట్లు లాభపడి 22,635 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 941 పాయింట్లు ఎగబాకి 74,671 వద్దకు చేరింది.సెన్సెక్స్‌ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మారుతీసుజుకీ కంపెనీ షేర్లు నష్టాల్లో జారుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం రూ.3,408.88 కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.4,356.83 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

average portfolio size of a female investor is Rs 55454
ఈక్విటీల్లో మహిళల భాగస్వామ్యం ఎలా ఉందంటే..

ఈక్విటీ మార్కెట్‌లో మహిళా పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరుగుతోంది. వారి సగటు పోర్ట్‌ఫోలియో పరిమాణం రూ.55,454గా ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇది ఈక్విటీ పెట్టుబడిదారుల జాతీయ సగటు కంటే ఎక్కువ. ఈక్విటీలో పెట్టుబడిపెట్టే మొత్తం మహిళల్లో మెజారిటీ (68%) రూ.1 లక్షలోపు పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నారని ఆన్‌లైన్‌ బ్రోకరేజ్‌ ప్లాట్‌ఫామ్‌ ఫైయర్స్‌ డేటా ద్వారా తెలిసింది.ఈ నివేదిక ప్రకారం 21% మహిళలు రూ.1 లక్ష-రూ.5 లక్షల వరకు పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నారు.  11% మంది రూ.5 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. మహారాష్ట్రలోని మొత్తం ఇన్వెస్టర్లలో దాదాపు మహిళలు సగం మంది ఉన్నారు. మొత్తం మహిళా పెట్టుబడిదారుల్లో 22.38% మంది మహారాష్ట్ర వారే. ఆంధ్రప్రదేశ్‌లో 10.68%, కర్ణాటక 7.65%, కేరళ 5.78% మంది మహిళలు ఈక్వీటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు.ఇదీ చదవండి: బ్యాంకుల్లో రుణవృద్ధి తగ్గుతుందన్న ప్రముఖ సంస్థమహిళా వ్యాపారులు ఉన్న మొదటి ఐదు నగరాల్లో ముంబై (4.16%), బెంగళూరు (4.19%), పుణె (3.93%), థానే (2.66%), హైదరాబాద్ (2.62%) ఉన్నాయి. 26-55 ఏళ్ల వయసు ఉన్న మహిళలు 58% మంది ఉన్నారు. ఫైయర్స్‌ ప్లాట్‌ఫారమ్‌లో మహిళా పెట్టుబడిదారులు నెలకు 5% స్థిరమైన వృద్ధితో పెరుగుతున్నారని డేటా ద్వారా తెలిసింది.

FM Sitharaman Says India GDP Must Expand To Cater To The Demands Of The People Further
అభివృద్ధి చెందే రంగాలు ఇవే.. నిర్మలా సీతారామన్

ఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. వికసిత భారత్ సాధ్యమవుతుందని, ఇండియా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని 'నరేంద్ర మోదీ' గతంలో చాలా సార్లు చెబుతూనే వచ్చారు. ఈ విషయం మీద కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు.ఎవరు ప్రధానమంత్రి అయినా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని చిదంబరం అన్నారు. ఈ మాటలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా విమర్శించారు. 2004 - 2014 మధ్య జీడీపీ కేవలం రెండు ర్యాంకులు మాత్రమే పెరిగిందని సోమవారం ఉదయం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన విక్షిత్ భారత్ అంబాసిడర్ క్యాంపస్ డైలాగ్ సభలో వెల్లడించారు.2004 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వం పదేళ్లలో కేవలం రెండు ర్యాంకులు జీడీపీ పెంచింది. ఆ తరువాత పదేళ్ల మోదీ పాలనలో జీడీపీ ఐదు ర్యాంకులకు ఎగబాకింది. రాబోయే రోజుల్లో మళ్ళీ మోదీ ప్రభుత్వం వస్తే.. తప్పకుండా జేడీపీ మరింత పెరుగుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు.ఆర్ధిక వ్యవస్థ 2014కు ముందు బాగా తగ్గింది. చెడు విధానాలు, భారీ అవినీతి కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినింది. ప్రస్తుతం భారతదేశ జీడీపీ అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తరువాత ఐదో స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో ఇది మూడో స్థానానికి చేరుతుంది. అది మోదీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని సీతారామన్ అన్నారు.భారతదేశంలో ఇన్నోవేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఎలా ఉందనే విషయాలను నిర్మల సీతారామన్ వివరించారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో  పునరుత్పాదక వస్తువులు, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆగ్రో-ప్రాసెసింగ్ రంగాలు మరింత అభివృద్ధి మార్గంలో నడుస్తాయని స్పష్టం చేశారు.

Credit Growth will be down for present financial year
బ్యాంకుల్లో రుణవృద్ధి తగ్గుతుందన్న ప్రముఖ సంస్థ

భారతీయ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్, లాభాల విషయంలో ఆశించిన వృద్ధి నమోదవుతుందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ సంస్థ తెలిపింది. అయితే అనుకున్న మేరకు డిపాజిట్లు రావని, దాంతో రుణ వృద్ధి తగ్గుతుందని సంస్థ అంచనా వేసింది.ఆసియా-పసిఫిక్ 2క్యూ 2024 బ్యాంకింగ్ అప్‌డేట్‌ కార్యక్రమంలో ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ నికితా ఆనంద్ మాట్లాడారు. ‘గతేడాదిలో 16 శాతం వృద్ధి నమోదుచేసిన రిటైల్ డిపాజిట్లు  ఈ ఏడాది 14 శాతానికి పరిమితం కానున్నాయి.  ప్రతి బ్యాంకులో రుణం-డిపాజిట్ల నిష్పత్తిలో తేడా ఉండనుంది. లోన్‌వృద్ధి డిప్లాజిట్ల కంటే 2-3 శాతం ఎక్కువగా ఉండనుంది. ఈ ఏడాదిలో బ్యాంకులు తమ రుణ వృద్ధిని తగ్గించి, డిపాజిట్ల పెంపునకు కృషి చేయాలి. అలా చేయకపోతే బ్యాంకులు నిధులు పొందడానికి కొంత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది’ అని చెప్పారు. సాధారణంగా రుణ వృద్ధిలో ప్రైవేట్ రంగ బ్యాంకులు 17-18 శాతం వృద్ధి నమోదుచేస్తాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సరాసరి 12-14 శాతం మేరకు రుణ వృద్ధి ఉంటుంది.

Azim Premji family will invest more money into AI investment tools
ఏఐ టూల్స్‌ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ

సాఫ్ట్‌వేర్ దిగ్గజం అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం వివిధ విభాగాల్లో దాదాపు రూ.83వేలకోట్లు(10 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడి పెట్టింది. తాజాగా ప్రేమ్‌జీఇన్వెస్ట్ ఆఫీస్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల్లో పెట్టుబడులను పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు సంస్థతో సంబంధం ఉన్న సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు మీడియాకు తెలియజేశారు.ప్రైవేట్ ఈక్విటీ రంగంలో ఏఐ సాధనాలను ఉపయోగించిన మొట్టమొదటి అతిపెద్ద భారతీయ అసెట్ మేనేజ్‌మెంట్‌ సంస్థగా ప్రేమ్‌జీఇన్వెస్ట్‌ నిలిచింది. కంపెనీ ప్రస్తుతం ఏఐ క్వాంట్ మోడల్‌పై పని చేస్తోందని మేనేజింగ్ పార్ట్‌నర్‌, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ టీకే కురియన్ తెలిపారు. అధికరాబడుల కోసం ఏఐటూల్స్‌ను వినియోగిస్తూ ఆయా కంపెనీల్లో తన పెట్టుబడులను సైతం పెంచుకోవాలనుకుంటుందని ఆయన చెప్పారు.బ్లాక్‌రాక్ ఇంక్., సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడి సంస్థలు మార్కెట్‌లోని డేటా స్ట్రీమ్‌లను విశ్లేషించడానికి ఏఐపై ఆధారపడుతున్నాయి. దాంతోపాటు ఈ రంగంలో మరింత పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాయి. అందులో భాగంగానే ప్రేమ్‌జీఇన్వెస్ట్ మూడేళ్ల క్రితం ఏఐ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. దానికోసం ఏఐ ఇంజినీర్లను నియమించుకుంది. అదే సమయంలో ఏఐ ఇన్వెస్ట్‌మెంట్‌ టూల్స్‌ తయారుచేసే సంస్థలకు మద్దతుగా నిలవడం మొదలుపెట్టినట్లు తెలిసింది.ఇదీ చదవండి: నిమిషానికి 500 గంటల కంటెంట్‌ అప్‌లోడ్‌.. యూట్యూబ్‌ ప్రస్థానం ఇదే..ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ కంపెనీల్లో   పెట్టుబడి అవకాశాలను గుర్తించడానికి 600 పారామీటర్లను విశ్లేషించేందుకు ఏఐ సహాయం చేస్తోందని కురియన్‌ అన్నారు. ఈ కసరత్తు వల్ల తోటివారి కంటే ముందంజలో ఉండేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. కోహెసిటీ ఇంక్‌-డేటా మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ, లండన్‌లోని ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ-హోలిస్టిక్ ఏఐ, ఇకిగాయ్‌, ఫిక్సిస్‌ వంటి ప్రముఖ కంపెనీలకు ప్రేమ్‌జీఇన్వెస్ట్‌ సేవలందిస్తోందని తెలిసింది. దేశంలో అధికంగా పోగవుతున్న కోర్టు కేసులను వేగంగా పరిష్కరించడానికి ఉపయోగపడే ఏఐను అభివృద్ధి చేసేందుకు సంస్థ సహకరిస్తుందని కురియన్‌ అన్నారు. 

Stock Market Rally On Today Opening
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 22,497కు చేరింది. సెన్సెక్స్‌ 298 పాయింట్లు దిగజారి 74,021 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 106.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 88.2 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.67 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 1.02 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 2 శాతం ఎగబాకింది.ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలు ఉండనున్నాయి. దాంతోపాటు బుధవారం వడ్డీరేట్లపై  వెల్లడయ్యే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాలు మార్కెట్‌కు దిశానిర్దేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎంపిక చేసిన షేర్లు, రంగాల్లో కదలికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మే 1న సెలవు కావడంతో, మార్కెట్లు ఈవారం 4 రోజులే పనిచేయనున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Banks will remain closed on THESE days in May 2024
బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో 12 రోజులు బంద్‌!

Bank Holidays in May 2024: బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యమైన సమచారం ఇది. మే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి.దేశవ్యాప్తంగా బ్యాంకులకు మే నెలలో మొత్తం 12 రోజులు సెలవులు ఉండగా వీటిలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతోపాటు పండుగలు, ప్రత్యేక సందర్భాలు కలిసి ఉన్నాయి. ఇవి రాష్ట్రాలను బట్టి మారే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు ఏదో ఒక పని కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. ఆన్‌లైన్ లో ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా కొన్ని పనులు బ్యాంకులకు వెళ్లి చేయాల్సి ఉంటుంది. అటువంటివారి కోసం బ్యాంకు సెలవుల సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం.మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే..మే 1: మహారాష్ట్ర దినోత్సవం/ మే డే (కార్మిక దినోత్సవం) మే 5: ఆదివారం.మే 8: రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకుల బంద్మే 10: బసవ జయంతి/ అక్షయ తృతీయమే 11: రెండో శనివారంమే 12: ఆదివారం.మే 16: సిక్కిం రాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవుమే 19: ఆదివారం.మే 20: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా బేలాపూర్, ముంబైలో బ్యాంకుల  మూతమే 23: బుద్ధ పూర్ణిమ మే 25: నాలుగో శనివారం. మే 26: ఆదివారం.

Ankur Jain Married To Ex WWE Star Erika Hammond
మాజీ రెజ్లర్‌ను పెళ్లాడిన టెక్ సీఈఓ అంకుర్ జైన్.. ఫోటోలు

భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త, బిలినీయర్ 'అంకుర్ జైన్' గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. భారతీయ మూలాలున్న ఈయన బిల్ట్ రివార్డ్స్ సీఈఓగా ఉన్నారు. ఇటీవల ఈయన మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ 'ఎరికా హమ్మండ్‌'ను వివాహం చేసుకుని ఓ ఇంటివారయ్యారు.అంకుర్ జైన్, ఎరికా హమ్మండ్‌ ఏప్రిల్ 26న ఈజిప్ట్‌లోని పిరమిడ్స్ ఎదురుగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు.. పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.పెళ్లి కొంత భిన్నంగా ఉండాలనే ఆలోచనతోనే వారు దక్షిణాఫ్రికాలోని సఫారీ సందర్శనలో మొదలు పెట్టి ఈజిప్ట్‌లో పెళ్లి వేడుకలను ముగించారు. న్యూయార్క్ సిటీకి చెందిన భారత సంతతి బిలియనీర్ అంకుర్ జైన్ రంబుల్ బాక్సింగ్ జిమ్‌కి వెళ్లే సమయంలో.. ఎరికా హమ్మండ్‌, అంకుర్‌కు ఫిజికల్ ట్రైనర్‌గా వ్యవహరించారు. ఈ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.ఎవరీ ఎరికా హమ్మండ్?ఎరికా హమ్మండ్ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్. ఆమె రెజ్లింగ్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఫిట్‌నెస్ కోచ్‌గా మారింది. ఈ సమయంలోనే బిలినీయర్ 'అంకుర్ జైన్'ను కలుసుకున్నారు. ఈమె స్ట్రాంగ్ అనే యాప్‌ కూడా స్టార్ట్ చేశారు.    View this post on Instagram           A post shared by Ankur Jain (@ankurjain)

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 65.70 75.20

Egg & Chicken Price

Title Price Quantity
Egg 100.00 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement