News


వరదల సమయంలో వాహనానికి రక్షణ..

Monday 23rd September 2019
personal-finance_main1569211963.png-28485

(సంజయ్‌దత్తా, అండర్‌రైటింగ్‌, క్లెయిమ్స్‌ చీఫ్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌)

మన దేశంలోని చాలా పట్టణాల్లో గట్టిగా వర్షం పడితే వరద పారే పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏడాది ముంబై నగరంలో 48 గం‍టల్లోనే 540 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వందలాది ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి. రోడ్డు పక్కన, ఫ్లైవోటర్ల కింద కార్లు నిలిచిపోయాయి. యజమానులు వాటిని విడిచిపెట్టేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. వాహనాన్ని, మరీ ముఖ్యంగా కారును వరద నీటిలో నడపడం పూర్తిగా సురక్షితం కాదు. ఎప్పుడు నీటి పరిమాణం పెరిగిపోతుందో, సెంట్రల్‌ డోర్‌ లాక్‌ సిస్టమ్‌ జామ్‌ అయిపోతుందో తెలియని పరిస్థితి. దీంతో మీరు, మీతోపాటు కారులో ఉన్న వారు లోపల చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ముంబై, ఇతర ప్రాంతాల్లో వర్షపు నీరు కారణంగా వాహనాలకు నష్టం వాటిల్లడంతో, మోటారు బీమా క్లెయిమ్‌లు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది మోటారు ఇంజన్లు దెబ్బతిన్నట్టు, అందుకు సంబంధించి కొన్ని అధిక క్లెయిమ్‌లు వచ్చాయి. అయితే, మోటారు ఇన్సూరెన్స్‌ పాలసీలో ఇంజన్‌కు వాటిల్లే నష్టానికి రక్షణ ఉండదు. కనుక వరద నీటిలోనూ మీకు, మీ కారుకు రక్షణ ఉండేలా అదనపు కవరేజీ తీసుకోవాలి. వరదల సమయంలో మనుషులకు, వాహనాలకు సమస్యలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఇవి...

- వరదల సమయంలో కారులో ఉండిపోవడం సురక్షితం కాదు. వర్షపు నీటిలో కారును నడుపుతుంటే, విండో అద్దాలను కిందకు దించేసి, డోర్లను అన్‌లాక్‌ చేసి ఉంచాలి. దీంతో బయట వర్షపునీటి స్థాయి పెరుగుతుంటే ఆ విషయం తెలుస్తుంది. నీటి పరిమాణం పెరిగిపోతుంటే కారు నుంచి దిగిపోయి ఎత్తయిన ప్రదేశానికి చేరుకోవాలి. ఎందుకంటే వాహనం కంటే మనిషి ప్రాణమే విలువైనది.
- బుదర నీటిలో కారు ఎంత మేర మునిగిపోయిందో చూడాలి. కారు డోర్ల స్థాయి నుంచి నీరు పెరగకపోతే అప్పుడు కారుకు పెద్దగా నష్టం వాటిల్లనట్టే. డ్యాష్‌బోర్డు స్థాయికి వర్షపునీరు చేరుతుంటే వెంటనే బీమా సంస్థకు లేదా సర్వీసింగ్‌ యూనిట్‌కు కాల్‌ చేసి వారు చెప్పినట్టు చేయాలి.  
- ఫ్యూయల్‌ వ్యవస్థను పరిశీలించాలి. పాత కార్లు అయితే వాటి నుంచి ఇంధనం తొలగించడం అవసరం. బ్రేక్‌, క్లచ్‌, పవర్‌ స్టీరింగ్‌, కూలంట్లు మార్చాల్సి వస్తుంది. 
- వరద నీటిలో కారు కొంత సమయం పాటు నిలిచిపోయిన తర్వాత ఇంజన్‌ను ఆన్‌ చేయవచ్చు. ముఖ్యంగా కారు పూర్తిగా మునిగిపోయిన సమయంలో ఈ పని అసలే చేయకూడదు. ఆన్‌ చేస్తే ఇంజన్‌లోని భాగాల్లోకి నీరు చేరిపోయే అవకాశం ఉంటుంది. దీంతో ఇంజన్‌లోని భాగాలు దెబ్బతింటాయి. దెబ్బతిన్న ఇంజన్‌ను బాగు చేసేందుకు రూ.20,000-1,00,000 వరకు ఖర్చు అవుతుంది. మోడల్‌ను బట్టి ఖర్చు మారుతుంది. 
- వీలైతే కొన్ని రోజుల వరకు కారును స్టార్ట్‌ చేయకుండా వేచి చూడడం మంచిది. ఎందుకంటే కారులోని ఎయిర్‌డక్టుల్లో నీటి ఆవిరి మిగిలి ఉంటే  ఆన్‌ చేయడం వల్ల ఇంజన్‌ దెబ్బతింటుంది. 
- షార్ట్‌ సర్క్యూట్‌ అవకుండా బ్యాటరీని తొలగించాలని సర్వీస్‌ ప్రొడైవర్లు చెబుతుంటారు. బ్యాటరీని తిరిగి కనెక్ట్‌ చేస్తున్నట్టు అయితే, ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఎలక్ట్రికల్‌ సిస్టమ్స్‌ను జాగ్రత్తగా తనిఖీ చేయాలి. హార్న్‌, హెడ్‌లైట్లు, ఇండికేటర్లు, ఎయిర్‌ కండీషనింగ్‌, స్టీరియో, పవర్‌లాక్‌లు, ఇంటీరియర్‌ లైట్లను తనిఖీ చేయాలి. ఎక్కడైనా ఫ్లిక్కరింగ్‌ను గుర్తించినట్టయితే మెకానిక్‌కు కాల్‌ చేయాలి.
- మీ కారును సమీపంలోని గ్యారేజ్‌ లేదా సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లి పూర్తి తనిఖీ చేయించేందుకు గాను టౌసర్వీస్‌కు కాల్‌ చేయాలి. టౌవ్యాను వచ్చే లోపు కారులోపల తడి ఉంటే, వస్త్రంతో తొలగించేందుకు ప్రయత్నించాలి. ఉప్పు నీటిలో కారు మునిగిపోయి ఉంటే నష్టం ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది. 
- సమగ్ర మోటారు వాహన ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవాలి. తగిన యాడాన్‌ కవరేజీలు కూడా తీసుకోవాలి. దాంతో ఆర్థిక భారం తగ్గిపోతుంది. మీ కారుకు నష్టం వాటిల్లిన సందర్భాల్లో అధిక శాతం బీమా కంపెనీయే చెల్లిస్తుంది. కనుక మీరు మీ జేబు నుంచి చెల్లించాల్సిన ఇబ్బంది తప్పుతుంది. పాలసీ తీసుకునే ముందు పత్రాలను క్షుణంగా చదవడం ద్వారా మంచి డీల్‌ అవునో, కాదో తెలుస్తుంది.

 



You may be interested

ఈ సమయంలో అనుకూలమైన పథకం

Monday 23rd September 2019

స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నవారు ప్రస్తుత సమయంలో తప్పకుండా తమ పెట్టుబడులు కొనసాగించడం ఎంతో అనుకూలం. ఎందుకంటే గత ఏడాదిన్నర కాలంలో స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ఎంతో దిద్దుబాటుకు గురయ్యాయి. దీంతో వాటి విలువలు అత్యంత ఆకర్షణీయమైన స్థాయికి చేరాయి. ఫలితంగా ఈ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే స్మాల్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల ధరలు కూడా తగ్గాయి. స్మాల్‌క్యాప్‌ విభాగంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు ఇప్పటి నుంచి

మీ ద్రవ్యోల్బణ రేటు ఎంత..?

Monday 23rd September 2019

ఆర్థిక ప్రణాళికలకు ఇది కచ్చితంగా అవసరమే అప్పుడే అవసరమైనంత సమకూర్చుకోగలరు ప్రభుత్వం ప్రకటించే ద్రవ్యోల్బణ రేటు వేరు వ్యక్తుల ‍వ్యక్తిగత వాస్తవ రేటు వేరు జీనవ పరిస్థితులను బట్టి మారుతుంది ఆహారోత్పత్తులు, సేవలు, విద్య, వైద్య ద్రవ్యోల్బణం వీటి మధ్య వ్యత్యాసం  అంచనాలు సరిగ్గా ఉంటేనే అవసరాలు తీరేవి భవిష్యత్తు లక్ష్యాలు, ఆర్థిక ప్రణాళికల విషయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ద్రవ్యోల్బణం. చాలా మంది ఈ ద్రవ్యోల్బణాన్ని పెద్దగా పట్టించుకోరు. వాస్తవంగా మీరు ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం రేటు కంటే

Most from this category