News


సిప్‌ వైపే ఫండ్స్‌ ఇన్వెస్టర్ల మొగ్గు..

Monday 14th October 2019
personal-finance_main1571021534.png-28857

  • ప్రథమార్ధంలో రూ. 49,000 కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ:     మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌ (సిప్స్‌) వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో సిప్‌ మార్గంలో ఫండ్స్‌లోకి ఏకంగా రూ. 49,361 కోట్ల మేర పెట్టుబడులు రావడం ఇందుకు నిదర్శనం. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం.. 2018 ఏప్రిల్‌-సెప్టెంబర్ మధ్య వ్యవధిలో సిప్‌ల ద్వారా ఫండ్స్‌లోకి రూ. 44,487 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ సంస్థల్లో 2.84 కోట్ల సిప్ ఖాతాలు ఉన్నాయి. 2019-20లో ప్రతి నెలా సగటున 9.29 లక్షల సిప్ ఖాతాలు తెరవగా, పెట్టుబడుల సగటు పరిమాణం రూ. 2,900గా ఉంది. కొత్త సిప్ ఖాతాలు పెరుగుతుండటం.. భారీ వృద్ధి అవకాశాలకు నిదర్శనమని యాంఫీ సీఈవో ఎన్‌ఎస్‌ వెంకటేష్ తెలిపారు. ప్రస్తుతం మొత్తం 44 మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్వహణలో రూ. 25.68 లక్షల కోట్ల అసెట్స్‌ ఉన్నాయి. ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయకుండా క్రమానుగతంగా (వారంవారీ, నెలవారీ) పెట్టుబడులు పెట్టేందుకు సిప్‌ సాధనం ఉపయోగపడుతుంది. 



You may be interested

ఆరోగ్యం విషయంలో ముందే మేల్కొంటేనే ...

Monday 14th October 2019

చిన్న వయసు నుంచే వైద్య బీమా అవసరం ఊహించని ఆరోగ్య సమస్యలు ప్రమాదాల కారణంగా గాయాలు పెరిగిపోతున్న క్లెయిమ్‌లు పెరుగుతున్న చికిత్సల వ్యయాలు వైద్య బీమాతో ఆర్థికంగానూ రక్షణ  పెద్ద వయసులోనే వైద్య బీమా (హెల్త్‌ ప్లాన్‌) అవసమరని చాలా మంది భావిస్తుంటారు. నేటి జీవన శైలి, పర్యావరణ కాలుష్యం, ఉద్యోగ పని స్వభావాల నేపథ్యంలో చిన్న వయసు నుంచే హెల్త్‌ కవరేజీ ఎంతో అవసరమన్న విషయాన్ని ఇప్పటికీ ఎక్కువ మంది గుర్తించడం లేదు. ఆరోగ్య బీమా పరిశ్రమ

అలహాబాద్‌ బ్యాంక్‌ విలీనం శుభ పరిణామం

Monday 14th October 2019

ఇండియన్‌ బ్యాంక్‌ సీఈఓ పద్మజ చుండూరు సాక్షి, విజయవాడ: అలహాబాద్‌ బ్యాంకును తమ బ్యాంకులో విలీనం చేయడం శుభ పరిణామమని ఇండియన్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ పద్మజ చుండూరు అన్నారు. ఆదివారం ఇక్కడ ఇండియన్‌ బ్యాంక్, అలహాబాద్‌ బ్యాంక్‌ ఉన్నతస్థాయి అధికారులు, ఖాతాదారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 113 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇండియన్‌ బ్యాంక్‌లో అలహాబాద్‌ బ్యాంక్‌ను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న

Most from this category