News


మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ టిగువన్‌ ఆల్‌స్పేస్‌

Saturday 7th March 2020
news_main1583554908.png-32343

  • ధరల శ్రేణి రూ. 28.15 లక్షలు – 31.54 లక్షలు

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫోక్స్‌వ్యాగన్‌’.. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)–6 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న 7-సీటర్‌ టిగువన్‌ ఆల్‌స్పేస్‌ ప్రీమియం స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ (ఎస్‌యూవీ)ని శుక్రవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 2-లీటరు పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ అధునాతన ఎస్‌యూవీ ధరల శ్రేణి రూ. 28.15 లక్షలు – 31.54 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. మునుపటి వెర్షన్‌లో 5-సీటర్‌ స్పేస్‌ ఉండగా.. భారత అవసరాలకు తగిన విధంగా నూతన వెర్షన్‌ను మరింత విస్తృత పరిచినట్లు సంస్థ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ స్టెఫెన్ నాప్ అన్నారు. 



You may be interested

రూ.44,000 వద్ద స్థిరంగా పసిడి

Saturday 7th March 2020

అంతర్జాతీయ మార్కెట్‌లో అన్చితి పరిస్థితులు నెలకొనడం, దేశీయంగా రూపాయి బారీగా బలహీనపడడం, కరోనా వైరస్‌ వ్యాప్తి వంటి అంశాలు కారణంగా బంగారం ధర గత ఐదురోజులుగా పెరగుతూ వస్తూ శుక్రవారం జీవిత కాలగరిష్టానికి చేరింది. ఒకే రోజు రూ.1000 పెరిగిన బంగారం శనివారం స్వల్పంగా తగ్గింది. మల్టీకమోడిటీ మార్కెట్‌లో రూ.465 తగ్గి 10 గ్రాముల పసిడి రూ.44,158.00 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ 1,692 డాలర్లకు పెరిగిన పసిడి మార్కెట్‌

జీవితకాల గరిష్టస్థాయికి ఫారెక్స్ నిల్వలు

Saturday 7th March 2020

481.54 బిలియన్ డాలర్లుగా నమోదు ముంబై: విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) ఆల్‌టైం హైకి చేరాయి. ఆర్‌బీఐ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈఏడాది ఫిబ్రవరి 14తో ముగిసిన వారంలో 5.42 బిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 481.54 బిలియన్ డాలర్లకు ఎగశాయి. అంతక్రితం వారం 29 మిలియన్‌ డాలర్లు పెరిగి 476.12 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక తాజా వారంలో.. మొత్తం మారక నిల్వల్లో ప్రధాన భాగంగా డాలర్ల రూపంలో

Most from this category