News


టీవీ చానెల్స్‌ ఇకపై మరింత చౌక!

Thursday 2nd January 2020
news_main1577940802.png-30610

నిబంధనలు సవరించిన ట్రాయ్‌
కస్టమర్ల ప్రయోజనాలు కాపాడే దిశగా ట్రాయ్‌ కేబుల్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ నిబంధనలకు కొత్త సవరణలు చేసింది. దీంతో ఇకపై కస్టమర్లు మరింత తక్కువ చందాకు మరిన్ని ఎక్కువ ఛానెళ్లు వీక్షించడం కుదురుతుంది. తాజా సవరణలో భాగంగా అన్ని ఫ్రీ చానెళ్లకు వసూలు చేసే ఫీజును ట్రాయ్‌ రూ. 140కి పరిమితం చేసింది. ఒక ఇంట్లో ఒకటి కన్నా ఎక్కువ టీవీలుంటే వాటికి నెట్‌వర్క్‌ కెపాసిటీ ఫీజు(ఎన్‌సీఎఫ్‌)లో 40 శాతం చొప్పున అదనంగా వసూలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఎన్‌సీఎఫ్‌ను 200 చానెళ్లకు రూ. 130గా సవరించింది. సమాచార మంత్రిత్వ శాఖ తప్పనిసరిగా ప్రసారం చేయాలని నిర్ధారించిన ఛానెళ్లను ఎన్‌సీఎఫ్‌లో చానెళ్ల కింద లెక్కించకూడదని తెలిపింది. ఆరునెలలకు అంతకుమించిన దీర్ఘకాలిక సబ్‌స్క్రిప్షన్స్‌కు డీపీఓలు డిస్కౌంట్లు ఆఫర్‌ చేసుకునేందుకు అనుమతినిచ్చింది. డీపీఓలు వసూలు చేసే కాయరేజీ ఫీజుపై నెలకు రూ. 4లక్షల పరిమితి విధించింది. దీంతో పాటు ఆల్‌కార్ట్‌ చానెల్లు, ఎలక్రా‍్టనిక్‌ ప్రోగ్రామ్‌ గైడ్‌, చానెల్‌ బొకెట్‌ తదితరాలకు సంబంధించిన నిబంధనల్లో కూడా మార్పులు తెస్తున్నట్లు ట్రాయ్‌ తెలిపింది. ఈ మార్పులన్నీ మార్చి1 నుంచి అమల్లోకి వస్తాయి. 
మరిన్ని వివరాలు https://main.trai.gov.in/notifications/press-release/trai-releases-amendments-tariff-order-interconnection-regulations-and    సైట్‌లో చూడవచ్చు.You may be interested

బలరామ్‌పూర్‌ చినీ.. మరింత పెరుగుతుందా?

Thursday 2nd January 2020

2013 తదుపరి సరికొత్త గరిష్టానికి షేరు ఇటీవల కొద్ది రోజులుగా దూకుడు చూపుతున్న షుగర్‌ రంగ కౌంటర్‌ బలరామ్‌పూర్‌ చినీ మిల్స్‌ మరోసారి వెలుగులో నిలిచింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో గురువారం ఎన్‌ఎస్‌ఈలో తొలుత రూ. 2 పెరిగి రూ. 189 సమీపానికి చేరింది. ఇది 2013 మే తదుపరి గరిష్టంకావడం విశేషం! కాగా.. 10.32 ప్రాంతంలో క్రితం ముగింపు రూ. 187 సమీపంలో ట్రేడవుతోంది. బుధవారం సైతం ఈ

ఐబీ రియల్టీ జోరు- సన్‌ టీవీ డీలా

Thursday 2nd January 2020

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వీక్‌ వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి వీలుగా ఈ నెల 15కల్లా ప్రాథమిక దశ ఒప్పందం కుదరనున్న వార్తలు ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పైనా అంచనాలు పెరుగుతున్నట్లు తెలియజేశారు. దీంతో ఉదయం 10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 107 పాయింట్లు ఎగసి 41,413కు చేరగా..నిఫ్టీ

Most from this category