STOCKS

News


ఫ్రిజ్‌లోనే పెరుగు రెడీ..

Thursday 23rd January 2020
news_main1579749891.png-31121

  • శాంసంగ్ కొత్త రిఫ్రిజిరేటర్లు 'కర్డ్ మేస్ట్రో'


న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ తాజాగా కొత్త రిఫ్రిజిరేటర్ల శ్రేణిని ప్రవేశపెట్టింది. పెరుగు తోడుపెట్టే బాదరబందీ లేకుండా చేసే 'కర్డ్ మేస్ట్రో' ఫ్రిజ్ కూడా వీటిలో ఉంది. పాలు.. పెరుగుగా మారడంలో కీలకమైన ఫెర్మెంటేషన్ ప్రక్రియను ఆటోమేటిక్‌గా నిర్వహించే టెక్నాలజీని శాంసంగ్ ఈ ఫ్రిజ్‌లో పొందుపర్చింది. ఇందుకోసం ఫ్రిజ్‌లో ప్రత్యేక అర ఉంటుంది. అయిదు నుంచి ఆరు గంటల్లో పెరుగు సిద్ధమవుతుందని సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోనే ఈ తరహా మొట్టమొదటి ఫ్రిజ్ ఇదేనని పేర్కొంది. 244 లీ. నుంచి 336 లీ. దాకా సామర్ధ్యముండే కర్డ్ మేస్ట్రో రిఫ్రిజిరేటర్ల ధరల శ్రేణి రూ. 30,990 నుంచి రూ. 45,990 దాకా ఉంటుంది. మరోవైపు, 2020 ఏడాదికి సంబంధించి ప్రవేశపెట్టిన ఇతర ఫ్రిజ్‌ల ధరల శ్రేణి రూ. 17,990 నుంచి రూ. 45,990 దాకా ఉందని శాంసంగ్ తెలిపింది. 



You may be interested

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Thursday 23rd January 2020

బయోకాన్‌, కెనరా బ్యాంక్‌, డీబీ కార్ప్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌, హెచ్‌టీ మీడియా, జేఎం ఫైనాన్షియల్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, పీవీఆర్‌ కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 

నేడు మార్కెట్‌ అక్కడక్కడే?

Thursday 23rd January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 4 పాయింట్లు మైనస్‌ నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 4 పాయింట్లు తక్కువగా 12,145  వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,149 వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి  తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించిన

Most from this category