News


భారత మార్కెట్లో శాంసంగ్‌ ‘గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌’

Friday 21st February 2020
news_main1582256585.png-31973

  • ధర రూ. 1.10 లక్షలు

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్.. ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ‘గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌’ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. గతవారంలోనే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో తన ఆల్ట్రా-ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శించిన కంపెనీ.. ఇక్కడ మార్కెట్లో దీన్ని గురువారం విడుదలచేసింది. ధర రూ. 1.10 లక్షలు కాగా, రెండు యాప్‌లను ఒకేసారి తెరవగలిగే సౌలభ్యం ఇందులో ఉందని, సాంకేతిక ఆవిష్కరణలో మైలురాయిగా నిలిచిపోయే హ్యండ్‌సెట్‌గా జెడ్‌ ఫ్లిప్‌ నిలిచిపోనుందని ఈ సందర్భంగా కంపెనీ ఇండియా డైరెక్టర్ మొబైల్ బిజినెస్ ఆదిత్య బబ్బర్ వ్యాఖ్యానించారు. ఇక స్పెసిఫికేషన్స్‌ విషయానికి వస్తే.. 6.7 అంగుళాల పూర్తి హెచ్‌డీ డైనమిక్ అమోలెడ్‌ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లే, 8 జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుకవైపు రెండు 12 మెగాపిక్సెల్ కెమెరాలు, 10ఎంపీ సెల్పీ కెమెరా ఉన్నాయి. 



You may be interested

జీఎంఆర్‌లో ఫ్రాన్స్ సంస్థకు వాటాలు

Friday 21st February 2020

ఎయిర్‌పోర్ట్ వ్యాపారంలో 49% కొనుగోలు చేయనున్న గ్రూప్ ఏడీపీ డీల్ విలువ రూ. 10,780 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రాన్స్‌కు చెందిన గ్రూప్ ఏడీపీ తమ ఎయిర్‌పోర్ట్ వ్యాపార విభాగంలో 49 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 10,780 కోట్లు ఉంటుందని పేర్కొంది. దీని ప్రకారం జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ (జీఏఎల్‌) విలువ సుమారు రూ. 22,000 కోట్లుగా ఉండనుంది. నిర్దిష్ట మైలురాళ్లను

టీవీల రేట్లకు రెక్కలు!!

Friday 21st February 2020

10 శాతం దాకా పెరగనున్న ధరలు మార్చి నుంచే అమల్లోకి కరోనా దెబ్బతో ప్యానళ్ల కొరతే కారణం న్యూఢిల్లీ: టీవీలకు కూడా కరోనా వైరస్ (కోవిడ్‌19) సెగ తగలనుంది. టీవీల్లో కీలకమైన ఓపెన్ సెల్ టెలివిజన్ ప్యానళ్ల సరఫరా తగ్గి, కొరత పెరిగిపోతుండటంతో మార్చి నుంచి రేట్లు 10 శాతం దాకా ఎగియనున్నాయి. ప్రధానమైన ఈ భాగాన్ని దేశీ సంస్థలు ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. టీవీ యూనిట్‌ రేటులో దాదాపు 60

Most from this category