News


గెలాక్సీ ఎస్‌10 లైట్‌ @ రూ. 44,999

Saturday 29th February 2020
news_main1582948408.png-32174

  •  512జీబీ వేరియంట్‌ విడుదల

గురుగ్రామ్‌: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ కంపెనీ శాంసంగ్‌ తన గెలాక్సీ ఎస్‌10 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌లో 512జీబీ వేరియంట్‌ను శుక్రవారం భారత మార్కెట్లో విడుదలచేసింది. వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలు (48 మెగాపిక్సెల్ స్టడీ ఓఐఎస్‌, 12ఎంపీ అల్ట్రా-వైడ్, 5ఎంపీ మాక్రో సెన్సాన్స్‌) ఉండగా, సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరాను అమర్చింది. 6.7 అంగుళాల పూర్తి హెచ్‌డీ సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ఆక్టా-కోర్ ఎస్‌ఓసీ, జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఇందులో ఉన్నట్లు కంపెనీ పక్రటించింది. దీని ధర రూ. 44,999 కాగా, పాత వేరియంట్‌తో మార్పిడి ద్వారా రూ. 5000 వరకు బోనస్‌ ఇస్తున్నట్లు వెల్లడించింది. 



You may be interested

పరిస్థితిని అవకాశాలుగా మలుచుకోవాలి

Saturday 29th February 2020

ఫిక్కీ ప్రెసిడెంట్‌ సంగీత రెడ్డి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుతమున్న కార్మిక చట్టాల్లో కొన్ని సవరణలు చేయాల్సిన తరుణం వచ్చిందని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సంగీత రెడ్డి అభిప్రాయపడ్డారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ‘ఆరు త్రైమాసికాలుగా జీడీపీ పడిపోతూ వస్తోంది. చాలా రంగాల్లో వినియోగం తగ్గింది. గ్రామీణ భారత్‌లో కూడా ఇదే పరిస్థితి. ఇది

జనవరిలో మౌలిక రంగం వృద్ధి 2.2 శాతం

Saturday 29th February 2020

న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్‌ వృద్ధి జనవరిలో కొంచెం కోలుకుని 2.2 శాతంగా నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 44 శాతం వాటా ఉన్న ఈ గ్రూప్‌ ఏప్రిల్‌-జనవరి మధ్య 0.6 శాతం మాత్రమే వృద్ధిని నమోదుచేసుకుంది. శుక్రవారం విడుదలైన గణాంకాలకు సంబంధించి ఎనిమిది విభాగాలనూ వేర్వేరుగా చూస్తే.... వృద్ధిలో ఐదు - బొగ్గు పరిశ్రమ ఉత్పత్తి 8 శాతం పెరిగింది. రిఫైనరీ ప్రొడక్టుల్లో వృద్ధి 1.9 శాతం కాగా,

Most from this category