News


ధర, ఫీచర్లతో ఆకట్టుకుంటున్న రియల్ మీ సీ2

Thursday 25th July 2019
news_main1564063639.png-27319

10 లక్షల ఫోన్లు అమ్ముడుపోయాయి!

ధర, ఫీచర్లతో ఆకట్టుకుంటున్న రియల్ మీ సీ2

స్మార్ట్‌ఫోన్ల తయారీలో ఉన్న చైనా కంపెనీ రియల్‌మీ సీ2 మోడల్‌ అమ్మకాలు 10 లక్షల యూనిట్లను దాటాయి. ఏప్రిల్‌లో భారత్‌లో విడుదలైన ఈ ఫోన్‌ అతి తక్కువ కాలంలో రికార్డు స్థాయి విక్రయాలు సాధించడం విశేషం. ధరల శ్రేణి రూ.5,999-7,999 ఉంది. బడ్జెట్‌ ధరలో పెద్ద తెరతో ఇది తయారైంది. 6.1 అంగుళాల హెచ్‌డీ, డ్యూడ్రాప్‌ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌-3 ప్రొటెక్షన్‌ ఉంది. ఇందులోని బ్రైట్‌నెస్‌ కారణంగా డైరెక్ట్‌ సన్‌ లైట్‌లోనూ తెరను స్పష్టంగా  వీక్షించవచ్చు. ప్రత్యేకంగా చెప్పాలంటే మెరుగైన కెమెరాలున్నాయి. ఫేస్‌ డిటెక్ట్‌ ఆటోఫోకస్‌ 13 ఎంపీ, 2 ఎంపీ డెప్త్‌ సెన్సార్‌ బ్యాక్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎంట్రీ లెవెల్‌ స్మార్ట్‌ఫోన్లలో ఈ స్థాయి కెమెరాల ఏర్పాటు ప్రముఖంగా చెప్పుకోవాలి. ఇక సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఉంది. ఆన్‌డ్రాయిడ్‌ 9 పై ఓఎస్‌తో రూపొందిన ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఏర్పాటు చేశారు. పవర్‌ఫుల్‌ 2 గిగాహెట్జ్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో పీ22 చిప్‌సెట్‌తో తయారైంది. రెండు వేరియంట్లలో 2/3జీబీ ర్యామ్‌, 16/32 జీబీ ఎక్స్‌పాండబుల్‌ మెమరీతో రూపొందింది. డైమండ్‌ కట్‌ డిజైన్‌తో ఆకర్శణీయమైన డైమండ్‌ బ్లూ, డైమండ్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. లైట్‌ను బట్టి మారే డైమండ్‌ ప్యాటెర్న్‌ ప్రత్యేక ఆకర్షణ. ప్లాస్టిక్‌ బాడీ అయినప్పటికీ అందంగా తీర్చిదిద్దారు. సెక్యూరిటీ కోసం ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను జోడించారు. You may be interested

లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు ఎలా ఉంది..?

Thursday 25th July 2019

యాక్టివ్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారికి గతేడాది ఆశించిన రాబడులు లేకపోవడం అనుభవమయ్యే ఉంటుంది. యాక్టివ్‌గా నడిచే 31 లార్జ్‌క్యాప్‌ఫండ్స్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టీఆర్‌ఐ స్థాయిలో రాబడులను ఇవ్వలేకపోయాయి. మరి వీటిల్లో పెట్టుబడులు పెట్టడం సరైన నిర్ణయమేనా...? అన్న సందేహం ఇన్వెస్టర్లకు రావడం సహజం. లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌, బీఎస్‌ఈ సెన్సెక్స్‌తో పోలిస్తే తక్కువ లేదా ప్రతికూల పనితీరు చూపించడం అన్నది స్థిరమైన ధోరణేనా..? నేడు చాలా మంది ఇన్వెస్టర్లు

దివాలా చట్ట సవరణలు బ్యాంకింగ్‌కు సానుకూలం: మూడీస్‌

Thursday 25th July 2019

 కేంద్ర ప్రభుత్వం దివాలా చట్టంలో చేసిన ఏడు సవరణల వలన ఈ చట్ట ప్రభావం మెరుగుపడుతుందని, అంతేకాకుండా ఈ చర్య ఇండియా బ్యాంకులకు సానుకూలంగా పనిచేస్తుందని మూడీస్‌ ఇన్వెస్ట్‌ర్స్‌ సర్వీసెస్‌ తెలిపింది. ప్రభుత్వం దివాలా చట్టంలో భాగంగా కార్పోరేట్‌  రిజల్యూషన్‌ పక్రియ పూర్తిచేయడానికి 330 రోజుల డెడ్‌లైన్‌ను విధించింది. ఈ సమయంలోనే వివాదాలు, న్యాయ సంబంధ విషయాలను క్లియర్‌ చేసుకోవాలని తెలిపింది. అంతేకాకుండా దివాలా కంపెనీలోని వాటాదారులపై పరిష్కార ప్రణాళికను

Most from this category