News


నోకియా సీఈఓ రాజీవ్ సూరి రాజీనామా

Tuesday 3rd March 2020
news_main1583209373.png-32236

లండన్‌: భారత సంతతికి చెందిన రాజీవ్ సూరి నోకియా ప్రెసిడెంట్‌, సీఈఓ పదవికి రాజీనామా చేశారు. సంస్థకు 25 ఏళ్ల పాటు సేవలందించిన సూరి తన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామాను సమర్పించారని నోకియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు 31తో ఈయన పదవీకాలం ముగియనుండగా.. నూతన ప్రెసిడెంట్‌, సీఈఓగా పెక్కా లండ్‌మార్క్ పేరును కంపెనీ బోర్డు ఖరారుచేసింది. సూరీ పదవీకాలం ముగిసినప్పటికీ.. వచ్చే ఏడాది జనవరి ఒకటి వరకు సలహాదారుగా ఉండనున్నారని గతంలో ప్రకటించింది. 



You may be interested

39 శాతం సబ్‌స్క్రైబయిన ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ

Tuesday 3rd March 2020

ఈ నెల 5న ముగింపు  ఇష్యూ సైజు రూ.10,355 కోట్లు  ఈ నెల 16న లిస్టింగ్‌ న్యూఢిల్లీ: ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) తొలి రోజు 39 శాతం సబ్‌స్క్రైబయింది. సోమవారం ప్రారంభమై ఈ నెల 5న ముగిసే ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్‌ను రూ.750-755గా నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.10,355 కోట్లు సమీకరిస్తుందని అంచనా. తొలి రోజు రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటా 62 శాతం,

స్టాక్స్‌ బాటలో చమురు ధరలకూ జోష్‌

Tuesday 3rd March 2020

5 శాతం జంప్‌చేసిన చమురు ధరలు ఒపెక్‌, తదితర దేశాల ఉత్పత్తి కోతపై అంచనాలు కేంద్ర బ్యాంకుల సహాయక ‍ప్యాకేజీలపై ఆశలు ఈ కేలండర్‌ ఏడాదిలో తొలిసారి ముడి చమురు ధరలు 4-5 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. కరోనా సమస్యలకు చెక్‌ పెట్టేవిధంగా ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు సహాయక ప్యాకేజీలను ప్రకటించనున్న అంచనాలు చమురు ధరలకు జోష్‌నిచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు తీసుకోనున్న చర్యలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా

Most from this category