News


ఆధార్‌ ఉంటే ఇన్‌స్టంట్‌గా పాన్‌

Monday 10th February 2020
news_main1581274895.png-31633

కొత్తగా పాన్‌ కార్డు తీసుకోవాలనుకుంటున్న వారికి శుభవార్త. ఇందుకోసం ఫిజికల్‌గా లేదా ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ను నింపడం, దానికోసం పుట్టిన తేదీ ధ్రువీకరణ, ఇతర ఆధారాలు సమర్పించాల్సిన శ్రమ ఇకపై ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆధార్‌ కార్డు ఉంటే చాలు.. పాన్‌కార్డ్‌ ఇన్‌స్టంట్‌గా జారీ అయిపోతుంది. ఆధార్‌ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇన్‌స్టంట్‌గా పాన్‌ కార్డు జారీ అవుతుందని పొరపడొద్దు. పాన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారికేనని అర్థం చేసుకోవాలి. ఈ నెల్లోనే ఆధార్‌ ఆధారిత ఇన్‌స్టంట్‌ పాన్‌ కార్డ్‌ విధానం అమల్లోకి వస్తుందని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్‌భూషణ్‌ పాండే తాజాగా వెల్లడించారు.

 

2020-21 బడ్జెట్‌లో ఆధార్‌ నంబర్‌ ఆధారంగా పాన్‌ను జారీ చేసే విధానాన్ని ప్రతిపాదించారు. ఆన్‌లైన్‌లో చాలా సులభంగా ఈ విధానంలో పాన్‌ను పొందొచ్చు. పాన్‌ జారీ ప్రక్రియను మరింత సులభంగా మార్చడమే ఈ విధానంలోని ఉద్దేశ్యం. ‘‘పాన్‌ కావాల్సిన వారు ఆదాయపన్ను శాఖ వెబ్‌సైట్‌కు వెళ్లి.. అక్కడ నిర్దేశిత కాలమ్‌లో ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆధార్‌ వద్ద నమోదైన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ జారీ అవుతుంది. ఆధార్‌ వివరాలను ధ్రువీకరించుకునేందుకు దీన్ని. ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇన్‌స్టంట్‌గా పాన్‌ జారీ అవుతుంది. తర్వాత ఈ-పాన్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు’’ అని పాండే ఈ విధానం గురించి వివరించారు.

 

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఎన్‌ఎస్‌డీఎల్‌, యూటీఐఐటీఎస్‌ఎల్‌ సంస్థలు పాన్‌కార్డు జారీ సేవలను అందిస్తున్నాయి. ఇందుకోసం అప్లికేషన్‌ పూర్తి చేసి, ధ్రువీకరణ పత్రాలను కూడా పోస్ట్‌ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇన్‌స్టంట్‌ విధానంలో ఈ ఇబ్బంది తప్పిపోనుంది. మరోవైపు పాన్‌, ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 30.75 కోట్ల పాన్‌లు ఆధార్‌లో లింక్‌ కూడా అయ్యాయి. అయితే, ఇంకా 17.58 కోట్ల పాన్‌లు ఆధార్‌తో అనుసంధానం కావాల్సి ఉంది. మార్చి 31 వరకు గడువు ఉంది. 



You may be interested

కరోనా వైరస్‌ పరిణామాలు, గణాంకాలు కీలకం

Monday 10th February 2020

పెరుగుతున్న కరోనా మృతులు  కరోనా పరిణామాలపై మార్కెట్‌ అప్రమత్తత రిటైల్‌, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై దృష్టి  చివరి దశ క్యూ3 ఫలితాలు  న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ సంబంధిత పరిణామాలు, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ వారం మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, ప్రపంచ మార్కెట్ల పోకడ, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల

మార్కెట్లు అలసిపోయాయా..?

Monday 10th February 2020

నిఫ్టీలో గత శుక్రవారం కనిపించిన స్థిరీకరణ సోమవారం నాటి సెషన్‌లో ముగియవచ్చని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తెలిపారు. నిఫ్టీ శుక్రవారం వెనుదిరిగే ప్రయత్నం చేసినప్పటికీ 50 డీఎంఏ అయిన 12,118 వద్ద నిరోధం ఎదుర్కొన్నట్టు చెప్పారు. సూచీలకు 12,050-12,120 కీలక నిరోధ స్థాయిలుగా తెలిపారు. నిఫ్టీకి సోమవారం 12,120-12,615 నిరోధాలుగా పనిచేస్తాయని తెలిపారు. అదే విధంగా 12,035-11,980 వద్ద మద్దతు స్థాయిలు

Most from this category