News


ప్యానాసోనిక్‌ నుంచి నూతన శ్రేణి ఏసీలు

Friday 21st February 2020
news_main1582258696.png-31980

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ ప్యానాసోనిక్‌ 2020 సంవత్సరానికిగాను కొత్త ఎయిర్‌ కండీషనర్లను ప్రవేశపెట్టింది. మొత్తం 55 ఏసీలను అందుబాటులోకి తేగా.. వీటిలో ఇంటర్నెట్‌తో పనిచేసే ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్‌ ఆధారిత మిరాయ్‌ శ్రేణి కనెక్టెడ్‌ మోడళ్లు 30 దాకా ఉన్నాయి. ఏసీ ఉష్ణోగ్రత ఏ సమయంలో ఎంత ఉండాలో నిర్దేశించవచ్చు. ఇన్‌బిల్ట్‌ ఎయిర్‌ ప్యూరిఫయర్‌తోపాటు బ్యాక్టీరియాను తొలగించే సాంకేతికత ఉంది. 45 అడుగుల వరకు గాలి వీస్తుంది. పీసీబీపై 5 ఏళ్లు, కంప్రెసర్‌పై 10 ఏళ్ల వారంటీ ఆఫర్‌ చేస్తోంది. ధరల శ్రేణి రూ.35 వేలు మొదలుకుని రూ.2.5 లక్షల వరకు ప్రవేశపెట్టామని ప్యానాసోనిక్‌ ఎయిర్‌ కండీషనింగ్‌ గ్రూప్‌ బిజినెస్‌ హెడ్‌ గౌరవ్‌ సాహ్‌ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘2019లో దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలవి కలిపి 70 లక్షల ఏసీలు అమ్ముడయ్యాయి. ఇందులో ప్యానాసోనిక్‌ వాటా 6 శాతం. ఈ ఏడాది 77 లక్షల ఏసీలు విక్రయం అవుతాయన్న అంచనా ఉంది. కంపెనీ 10 శాతం వాటా లక్ష్యంగా చేసుకుంది’ అని వివరించారు.



You may be interested

ఇండియాతో భారీ డీల్‌ జరగొచ్చు..ట్రంప్‌!

Friday 21st February 2020

అమెరికా, భారత్‌ల మధ్య భారీ వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉందని  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. లాస్‌వేగాస్‌లో ప్రిసనర్స్‌ గ్రాడ్యూయేషన్‌ సెర్మనీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..ఈ నెలలో తాము ఇండియా వెళ్తున్నామని, ఆదేశంతో భారీ ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. కాగా ఫిబ్రవరి 24 నుంచి 25 తేదీలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, యూఎస్‌ ఫస్ట్‌ లేడీ మెలానియా ట్రంప్‌ అహ్మాదాబాద్‌, ఆగ్రా, న్యూఢిల్లీలో

ఏజీఆర్‌తో టెలికం రంగంలో అసాధారణ సంక్షోభం...

Friday 21st February 2020

బాకీల చెల్లింపులపై సుప్రీం ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వెల్లడి కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌తో భేటీ న్యూఢిల్లీ: సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్‌) ప్రాతిపదికన టెల్కోలు భారీ బకాయిలు కట్టాల్సి రావడం .. టెలికం పరిశ్రమలో గతంలో ఎన్నడూ చూడని విధంగా, అసాధారణ సంక్షోభం తలెత్తిందని భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్‌ మిట్టల్ వ్యాఖ్యానించారు. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం బాకీలను కట్టేందుకు

Most from this category