News


ఫ్యూచరో-ఈను ఆవిష్కరించిన మారుతీ సుజుకీ

Wednesday 5th February 2020
news_main1580897492.png-31535బుధవారం మారుతీ సుజుకీ ఆటో ఎక్స్‌పో-2020లో కూపే స్టైల్‌ ఎలక్ట్రిక్‌ కాన్సెప్ట్‌ కారు ‘‘ఫ్యూచరో-ఈ’’ను  ఆవిష్కరించింది. మిషన్‌ గ్రీన్‌ మిలియన్‌లో భాగంగా ఈకారును విడుదల చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. పర్యావరణాన్ని దృష్టిలోపెట్టుకుని వచ్చే ఐదేళ్లలో 10 లక్షల గ్రీన్‌ కార్ల(సీఎన్‌జీ, హైబ్రిడ్స్‌, ఎలక్ట్రిక్‌)ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈఓ కెనిచీ అయుక్వా వెల్లడించారు.  ఫ్యూచరో- ఈలో క్రాస్‌బార్‌ డిజైన్‌ ఉంది. కారు ముందు భాగంలో బంపర్‌ పిన్‌లు, సిల్వర్‌ నెబ్యూలా రంగులో కారు బాడీ ఉండగా, పర్పుల్‌ రంగులో టింటెడ్‌ గ్లాసెస్‌ను అమర్చి ఉన్నాయి. ఇంకా దీనిలో జియో ఆర్గానిక్‌ స్ట్రక్చరల్ ఫామ్స్‌లోని ప్లోటింగ్‌ కాన్సెప్ట్‌తో మూడ్స్‌ను బట్టి రంగులు మారే డ్రైవింగ్‌  ఎన్విరాన్‌మెంట్‌ను దీనిలో ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన  ఈ కాన్సెప్ట్‌ కారు నేటి యువత ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉంటుందని మారుతీ పేర్కొంది. దీంతోపాటు ఈ ఎక్స్‌పోలో బీఎస్‌-6 పెట్రోల్‌ విటారా బ్రెజా,ఇగ్నిస్‌ మోడల్‌లో అప్‌గ్రేడెడ్‌ వేరియంట్‌ను, స్విఫ్ట్‌ హైబ్రిడ్‌ వేరియంట్‌తో పాటు మరో 17 మోడళ్లను ప్రదర్శించనుంది. వీటిలో సెలారీయో, ఎస్‌-ప్రెస్సో, వ్యాగనార్‌, స్విఫ్ట్‌, డిజైర్‌, బాలెనో, ఎర్టిగా, ఎస్‌-క్రాస్‌, సియజ్‌ ఎస్‌, స్విఫ్ట్‌ హైబ్రిడ్‌లు ఉన్నాయి.


 You may be interested

మూడో రోజూ మార్కెట్‌ స్పీడ్‌

Wednesday 5th February 2020

సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ 41,000 పాయింట్ల ఎగువకు నిఫ్టీ సైతం లాభాల సెంచరీ ఎన్‌ఎస్‌ఈలో మీడియా వెనకడుగు  వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సాధించింది. 353 పాయింట్లు జమ చేసుకుని 41,143 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 110 పాయింట్లు ఎగసి 12,089 వద్ద స్థిరపడింది. తద్వారా సెన్సె‍క్స్‌ తిరిగి 41,000 పాయింట్ల మార్క్‌ను దాటేయగా.. నిఫ్టీ 12,000 స్థాయికి

ఎస్‌ఆర్‌ఎఫ్‌ జూమ్‌- జీ.. కుదేల్‌

Wednesday 5th February 2020

పెట్టుబడి ప్రణాళికలకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించడంతో విభిన్న కెమికల్స్‌ తయారీ కంపెనీ ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. కాగా.. మరోపక్క కంపెనీ ఖాతా పుస్తకాలను ప్రభుత్వం తనిఖీ చేయనున్న వార్తలతో మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఎస్‌ఆర్‌ఎఫ్‌ భారీ లాభాలతో కళకళలాడుతుంటే.. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కౌంటర్‌ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ ఆగ్రో కెమికల్స్‌ విభాగంలో వినియోగించగల ఇంటర్మీడియెట్స్‌ తయారీకి

Most from this category