News


మారుతీ కొత్త ‘ఇగ్నిస్‌’ ఆవిష్కరణ

Saturday 8th February 2020
news_main1581132622.png-31610

గ్రేటర్‌ నోయిడా: మారుతీ సుజుకీ ఇండియా... ఇగ్నిస్‌ మోడల్‌లో కొత్త వెర్షన్‌ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఈ తాజా కాంపాక్ట్‌ ఎస్‌యూవీలో 1.2 లీటర్ల బీఎస్‌-6 పెట్రోల్‌ ఇంజిన్‌ అమర్చింది. కొత్త వెర్షన్‌ 17.78 సెం.మీ స్మార్ట్ ప్లే స్టూడియోతో పాటు లైవ్‌ ట్రాఫిక్‌, డ్రైవర్ భద్రతా హెచ్చరికలు, వెహికిల్‌ సమాచారం వంటి ఫీచర్లు కలిగిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌, సేల్స్‌) శశాంక్‌ శ్రీవాస్తవ వివరించారు. దీని ధర ప్రస్తుత మోడల్‌ కంటే రూ. 25,000 అధికంగా ఉండవచ్చని అంచనా. ధరల శ్రేణి రూ. 5 లక్షలు-  7.5 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని ఆటో మొబైల్‌ రంగ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే, కంపెనీ ధర పరంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. బుకింగ్స్‌ ప్రారంభమైనట్లు ప్రకటించింది. 



You may be interested

ఎన్‌టీపీసీ లాభం రూ.3,198 కోట్లు

Saturday 8th February 2020

23 శాతం వృద్ది  రూ.25,953 కోట్లకు మొత్తం ఆదాయం  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ, ఎన్‌టీపీసీ ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో రూ.3,198 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం(2018-19) క్యూ3లో వచ్చిన నికర లాభం, రూ.2,608 కోట్లతో పోల్చితే 23 శాతం వృద్ధి సాధించామని ఎన్‌టీపీసీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.25,677 కోట్ల నుంచి రూ.25,953 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ప్లాంట్‌ లోడ్‌

టాటా స్టీల్‌ నష్టాలు రూ.1,228 కోట్లు

Saturday 8th February 2020

రూ.34,774 కోట్లకు అమ్మకాలు  7 శాతం తగ్గిన నిర్వహణ లాభ మార్జిన్‌  న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో క్వార్టర్‌లో రూ.1,228 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.1,753 కోట్ల నికర లాభం ఆర్జించామని టాటా స్టీల్ తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే (ఈ క్యూ2లో)రూ.3,302 కోట్ల నికర లాభం వచ్చిందని పేర్కొంది. అమ్మకాలు తక్కువగా ఉండటం, యూరప్‌ కార్యకలాపాలకు సంబంధించిన ఇంపెయిర్‌మెంట్‌

Most from this category