News


తగ్గనున్న ఈ-వెరిటో ధర..!

Friday 10th January 2020
news_main1578629867.png-30823

  • రూ. లక్ష వరకు తగ్గే అవకాశం
  • వచ్చే ఏడాదిలో ఎలక్ట్రిక్‌ ఎక్స్‌యూవీ 300
  • మహీంద్ర ఎండీ పవన్‌ గోయెంకా వ్యాఖ్య

న్యూఢిల్లీ: భారత ఎలక్ట్రిక్‌ వాహనాల డిమాండ్‌కు తగిన సప్లైని చేరుకోవడానికి మరెంతో సమయం పట్టదని మహీంద్రా అండ్‌ మహీంద్ర (ఎం అండ్‌ ఎం) మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గోయెంకా అన్నారు. ఈ పరిశ్రమను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత వరకు చేయగలదో అంతా చేసిందని, వీటితో పాటు మరిన్ని ప్రయోజనాలు చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటే.. ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు గణనీయంగా తగ్గుతాయని విశ్లేషించారు. ‘డీజిల్‌, సీఎన్‌జీ వాహనాలతో పోల్చితే ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ వాహన రుణాలపై వడ్డీ రేటు 5-6 శాతం అధికంగా ఉంది. ఈ రేటు తగ్గితే కొనుగోళ్లు పెరుగుతాయి. ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (ఓఈఎం) కంపెనీలు ధరలను 8-10 శాతం వరకు తగ్గించాల్సి ఉంది. ఈ విషయంపై అయితే ఎం అండ్‌ ఎం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రూ. 12 లక్షలుగా ఉన్న ఈ-వెరిటో ఎలక్ట్రిక్‌ కారు ధరను రూ. 11 లక్షలకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే ఏడాదిలో హై రేంజ్‌ ఎలక్ట్రిక్‌ ఎక్స్‌యూవీ 300 వాహనాన్ని విడుదల చేయాలని భావిస్తున్నాం. ఈ రంగానికి ప్రధాన సమస్యగా ఉన్న ఫైనాన్స్‌ సులభతరమైతే వృద్ధి నల్లేరు మీద నడకగా మారుతుంది. ఇదే విధంగా పలు ఉత్పత్తులపై పన్నుల భారం తగ్గితే భారత అవసరాలకు తగిన ఉత్పత్తిని అందుకోవచ్చు’ అని వ్యాఖ్యానించారు. 



You may be interested

బైజూస్‌కు భారీగా నిధులు

Friday 10th January 2020

ఇన్వెస్ట్‌ చేసిన టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ న్యూఢిల్లీ: విద్యా సంబంధిత అత్యాధునిక టెక్నాలజీల్లో ప్రముఖ కంపెనీ అయిన బైజూస్‌.. టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి పెద్ద మొత్తంలో నిధులను అందుకుంది. కంపెనీ ఎంత మొత్తం అన్నది వెల్లడించనప్పటికీ.. టైగర్‌ గ్లోబల్‌ 200 మిలియన్‌ డాలర్లు (రూ.1,400 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘‘విద్యార్థుల అభ్యాసన విధానాన్ని మార్చి వేయాలన్న మా దీర్ఘకాల దృక్పథాన్ని టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌తో భాగస్వామ్యం

లాభాల బాటలో మార్కెట్లు

Friday 10th January 2020

సెన్సెక్స్‌ లాభాల సెంచరీ నిఫ్టీ 37 పాయింట్లు ప్లస్‌ స్వల్ప ఊగిసలాట మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన వెంటనే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో వరుసగా మూడో రోజు మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఉదయం 9.20 ప్రాంతంలో సెన్సెక్స్‌ 131 పాయింట్లు పెరిగి 41,553కు చేరగా.. నిఫ్టీ 37 పాయింట్లు పుంజుకుని 12,253 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్‌, అమెరికా మధ్య గత వారం నెలకొన్న ఉద్రిక్త వాతావరణం

Most from this category