News


5జీ స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది

Monday 27th January 2020
news_main1580094048.png-31216

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- స్మార్ట్‌ఫోన్స్‌ తయారీలో ఉన్న చైనా కంపెనీ ఐకూ భారత్‌కు ఫిబ్రవరిలో ఎంట్రీ ఇస్తోంది. 5జీ స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లోకి రంగ ప్రవేశం చేయనుంది. భారత్‌లో ఇదే తొలి 5జీ మోడల్‌ కానుంది. 5జీతోపాటు 4జీ మోడళ్లనూ ప్రవేశపెట్టనున్నట్టు ఐకూ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ గగన్‌ అరోరా తెలిపారు. 2020లో దేశీయంగా 10 లక్షల యూనిట్లను విక్రయించాలన్న లక్ష్యంతో కంపెనీ దూసుకొస్తోంది. తొలుత ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకోనున్న ఈ బ్రాండ్‌, రానున్న రోజుల్లో ఆఫ్‌లైన్‌లోనూ స్మార్ట్‌ఫోన్లను విక్రయించనుంది. చైనాలో వివో సబ్‌ బ్రాండ్‌గా కార్యకలాపాలు సాగించిన ఐకూ.. ప్రస్తుతం సొంత బ్రాండ్‌లో మార్కెట్‌ చేస్తోంది. భారత్‌లోనూ ఇదే విధానాన్ని అనుసరించనుంది. వివో తయారీ కేంద్రంలో ఐకూ ఫోన్లు రూపుదిద్దుకోనున్నాయి. బెంగళూరులో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. 



You may be interested

5 నెలల్లో 50వేల కియా కార్లు

Monday 27th January 2020

5 నెలల్లో 50,000 యూనిట్ల అమ్మకాలు ముంబై: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌.. భారత్‌లో తాజాగా మరో మైలు రాయిని దాటింది. గతేడాది ఆగస్టులో తన ‘సెల్టోస్‌ మిడ్‌-సైజ్‌ ఎస్‌యూవీ’ కారును ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ సంస్థ.. కేవలం 5 నెలల్లోనే 50,000 యూనిట్ల అమ్మకాలను నమోదుచేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో కారు ఉత్పత్తి అవుతోన్న విషయం తెలిసిందే కాగా, ఈ కారు అమ్మకాల స్పీడును

7 శాతం తగ్గిన పుత్తడి దిగుమతులు

Monday 27th January 2020

న్యూఢిల్లీ: పుత్తడి దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో 7 శాతం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబర్‌ కాలానికి 2,473 కోట్ల డాలర్లుగా ఉన్న బంగారం దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 2,300 కోట్ల డాలర్లకు తగ్గాయని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ​వాణిజ్య లోటు 14,823 కోట్ల డాలర్ల నుంచి 11,800 కోట్ల డాలర్లకు తగ్గిందని పేర్కొంది. కాగా 2018 ,

Most from this category