News


నెలకు 11 జీబీ డేటా!!

Friday 28th February 2020
news_main1582860381.png-32151

- భారతీయుల సగటు వినియోగం
- చౌక డేటా ప్లాన్లు, హ్యాండ్‌సెట్స్‌ ఊతం
- నోకియా నివేదిక

న్యూఢిల్లీ: చౌక డేటా ప్లాన్లు, అందుబాటు ధరల్లో స్మార్ట్‌ఫోన్లు, వీడియో సేవలు, 4జీ నెట్‌వర్క్‌ విస్తరించడం తదితర అంశాల ఊతంతో దేశీయంగా మొబైల్ డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం నెలకు సగటున 11 జీబీ స్థాయిలో వినియోగం ఉంటోంది. టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా రూపొందించిన వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 4జీ ఊతంతో 2019లో డేటా ట్రాఫిక్ 47 శాతం పెరిగింది. 3జీ డేటా ట్రాఫిక్‌ 30 శాతం క్షీణించింది. మొత్తం డేటా వినియోగంలో 4జీ వాటా 96 శాతంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువగా జీబీకి రూ. 7 స్థాయిలో భారత్‌లో డేటా చార్జీలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో అరగంట నిడివి వీడియో చూసేందుకు లేదా 200 పాటలను వినేందుకు సుమారు ఒక జీబీ డేటా సరిపోతుంది. కంటెంట్ నాణ్యతను బట్టి డేటా వినియోగం పెరుగుతుంది. సంపన్న దేశాల స్థాయిలో దేశీయంగా బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు విస్తరించే దాకా మొబైల్ డేటా వినియోగం పెరుగుతూనే ఉండవచ్చని నోకియా ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ మార్వా తెలిపారు. 


నివేదికలోని మరిన్ని వివరాలు..

  • ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లోనే డేటా వినియోగం అత్యధికంగా ఉంటోంది. ఈ విషయంలో చైనా, అమెరికా, ఫ్రాన్స్‌, దక్షిణ కొరియా, జర్మనీ, స్పెయిన్‌ల కన్నా ముందు ఉంది. 
  • 4జీ డేటా వినియోగదారుల సంఖ్య 59.8 కోట్లు కాగా, 3జీ యూజర్ల సంఖ్య 4.4 కోట్లుగా ఉంది.
  • నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో తదితర ఓవర్‌ ది టాప్ ప్లాట్‌ఫాంల ఊతంతో దేశీయంగా వీడియోల వినియోగం గణనీయంగా పెరిగింది. 
  • ఓటీటీ ప్లాట్‌ఫాంలపై యూజర్లు రోజుకు సగటున 70 నిమిషాలు వెచ్చిస్తున్నారు. ఒక్కో సెషను సగటున సుమారు 40 నిమిషాలు ఉంటోంది. 
  • 2019లో 4జీ హ్యాండ్‌సెట్స్‌ సంఖ్య 50.1 కోట్లకు చేరి ఉంటుందని అంచనా. అంతక్రితం ఏడాది ఇది 33 కోట్లుగా ఉంది. వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ ఆధారిత స్మార్ట్‌ఫోన్ల సంఖ్య 43.2 కోట్లకు చేరింది. 



You may be interested

ఫుడ్‌ డెలివరీలోకి అమెజాన్‌

Friday 28th February 2020

ప్రస్తుతం బెంగళూరులో పైలట్‌ ప్రాజెక్టు మార్చిలో పూర్తి స్థాయిలో ఆవిష్కరించే అవకాశం ప్రైమ్‌ నౌ యాప్‌ ద్వారా అందుబాటులోకి న్యూఢిల్లీ: అమెరికన్‌ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ .. భారత్‌లో కార్యకలాపాలను జోరుగా విస్తరిస్తోంది. కేవలం ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టల్‌కే పరిమితం కాకుండా కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. తాజాగా ఫుడ్‌ డెలివరీ సేవలను కూడా ప్రారంభించనుంది. తద్వారా ఈ విభాగంలో దిగ్గజాలైన స్విగీ, జొమాటోలకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫుడ్‌ డెలివరీ వ్యాపారాన్ని మార్చిలో ప్రకటించవచ్చని,

క్రెడిట్‌ స్కోరును గుడ్డిగా అనుసరించొద్దు : కేంద్ర ఆర్థిక మంత్రి

Friday 28th February 2020

శాఖల స్థాయిలో అనుసంధానత పెంచుకోవాలి బ్యాంకులకు ఆర్థిక మంత్రి సీతారామన్‌ సూచన న్యూఢిల్లీ/గువహటి: రుణ గ్రహీతలకు సంబంధించి క్రెడిట్‌ స్కోరు (రుణ చెల్లింపుల చరిత్ర)ను గుడ్డిగా నమ్మవద్దని, కేవలం ఓ సూచికగానే పరిగణించాలని ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. కస్టమర్లతో శాఖల స్థాయిలో అనుసంధానత పెంపుపై దృష్టి పెట్టాలని కోరారు. ‘‘శాఖా బ్యాంకింగ్‌కు మళ్లీ మళ్లాలి. గతంలో మాదిరిగా శాఖల స్థాయిలో కస్టమర్లతో అనుసంధానత ఇప్పుడు లేదు.

Most from this category