News


మార్కెట్లోకి బీఎస్‌-6 హోండా ‘అమేజ్‌’

Thursday 30th January 2020
news_main1580358019.png-31322

  •  ప్రారంభ ధర రూ.6.09 లక్షలు 

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హోండా కార్స్‌ ఇండియా’ (హెచ్‌సీఐఎల్‌).. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఎంట్రీ లెవెల్‌ కాంపాక్ట్‌ సెడాన్‌ ‘అమేజ్‌’ కారును బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 1.2 లీటర్‌ పెట్రోల్‌ వేరియంట్‌ ధరల శ్రేణి రూ.6.09 లక్షలు – 8.75 లక్షలుగా ఉంది. ఈ వేరియంట్లో మాన్యువల్‌ లీటరకు 18.6 కిలోమీటర్ల మైలేజీని, సీవీటీ వేరియంట్‌ 18.3 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇక 1.5 లీటర్‌ డీజిల్‌ ట్రిమ్‌ ధరల శ్రేణి రూ. 7.55 లక్షలు – 9.95 లక్షలుగా ఉంది. ఈ ట్రిమ్‌లో మాన్యువల్‌ లీటరకు 24.7 కిలోమీటర్ల మైలేజీని, సీవీటీ వేరియంట్‌ 21 కి.మీ మైలేజీ ఇస్తుందని వివరించింది.

  • హోండా గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో వీఆర్‌ఎస్‌

ఉత్తర ప్రదేశ్‌లోని తన గ్రేటర్ నోయిడా ప్లాంట్‌ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) సదుపాయాన్ని కల్పించినట్లు హెచ్‌సీఐఎల్‌ ప్రకటించింది. ఈ పథకం జనవరి 28 నుంచి ఫిబ్రవరి 17 వరకు ఉంటుందని కంపెనీ వివరించింది. ఉత్పత్తి సంబంధిత విభాగాల్లో ఈ స్కీం అమల్లో ఉంటుందని వెల్లడించింది. 



You may be interested

జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌కు ఆన్‌లైన్‌ జోష్‌

Thursday 30th January 2020

 14 శాతం పెరిగిన ఆదాయం   7 శాతం వృద్ధితో రూ.104 కోట్లకు నికర లాభం  న్యూఢిల్లీ: డొమినోస్‌  పిజ్జా, డంకిన్‌ డునట్స్‌ చెయిన్లను నిర్వహించే జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.104 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌)ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో వచ్చిన నికర లాభం రూ.97 కోట్లుతో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.929

లంబోర్గిని హురాకన్‌ ఈవీఓ ఆర్‌డబ్ల్యూడీ @ రూ. 3.22 కోట్లు

Thursday 30th January 2020

ప్రారంభ ధర రూ.3.22 కోట్లు 3.3 సెకన్లలో 100 కి.మీ వేగానికి గరిష్ట వేగం గంటకు 325 కి.మీ న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన సూపర్‌ స్పోర్ట్స్‌ కార్ల తయారీ కంపెనీ ‘లంబోర్గిని’.. వెనుక చక్రాల ఆధారంగా నడిచే సరికొత్త లగ్జరీ కారును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హురాకన్‌ ఈవీఓ రియర్‌-వీల్ డ్రైవ్ (ఆర్‌డబ్ల్యూడీ) పేరిట విడుదలైన ఈ కారు ప్రారంభ ధర రూ.3.22 కోట్లుగా నిర్ణయించింది. 5.2-లీటర్ల వీ10 ఇంజిన్‌ అమర్చిన ఈ నూతన

Most from this category