News


భారత్‌లో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌

Tuesday 25th February 2020
news_main1582600547.png-32062

  • ఆవిష్కరించిన రియల్‌మి
  • ధర రూ. 37,999 నుంచి ప్రారంభం

న్యూఢిల్లీ: చైనాకి చెందిన హ్యాండ్‌సెట్స్ తయారీ దిగ్గజం రియల్‌మి తాజాగా భారత్‌లో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరించింది. దీని ధర రూ. 37,999 నుంచి ప్రారంభమవుతుంది. రియల్‌మి ఎక్స్‌50 ప్రొ 5జీ పేరిట ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టినట్లు సంస్థ భారత విభాగం సీఈవో మాధవ్ సేఠ్ తెలిపారు. మెమరీ స్టోరేజీ సామర్థ్యాన్ని బట్టి మూడు వేరియంట్ల ధర వరుసగా రూ. 37,999, రూ. 39,999, రూ. 44,999గా ఉంటుందని ఆయన వివరించారు. ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా వీటిని విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. 4జీ, 5జీ టెక్నాలజీపై పనిచేసేలా డ్యుయల్ సిమ్ ఫీచర్‌తో ఈ ‍స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. అయితే, దేశీయంగా ఇంకా 5జీ టెక్నాలజీ అమల్లోకే రానందున.. ఈ ఫోన్‌కు అప్‌గ్రేడ్ కావడం వల్ల పెద్దగా ఉపయోగమేమీ ఉండబోదని మార్కెట్‌ రీసెర్చ్ సంస్థ టెక్‌ఆర్క్‌ వ్యవస్థాపకుడు, చీఫ్ అనలిస్ట్ ఫైసల్‌ కవూసా వ్యాఖ్యానించారు. 2022 నాటికి గానీ భారత్‌లో 5జీ నెట్‌వర్క్ పూర్తిగా విస్తరించకపోవచ్చని, అప్పటికి ఈ ఫోన్లలోని టెక్నాలజీ పాతబడిపోవచ్చని పేర్కొన్నారు. అప్పటికి వీటి రేట్లు కూడా గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. 4జీ ఫోన్ల విషయంలో ఇదే జరిగిందని ఫైసల్ చెప్పారు. 



You may be interested

నేడు లాభాల ఓపెనింగ్‌ ?!

Tuesday 25th February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 37 పాయింట్లు ప్లస్‌ నేడు నిఫ్టీకి 11,957 వద్ద రెసిస్టెన్స్‌! యూఎస్‌ మార్కెట్లు 2.6 శాతం పతనం  నేడు(మంగళవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం  8.30  ప్రాంతం‍లో 37 పాయింట్లు పుంజుకుని 11,870 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 11,833 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి

మేక్‌మైట్రిప్‌, ఓయోలపై సీసీఐ విచారణ

Tuesday 25th February 2020

న్యూఢిల్లీ: అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ మేక్‌మైట్రిప్ (ఎంఎంటీ), హోటల్ సేవల సంస్థ ఓయోలపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటూ కంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆదేశించింది. ఓయో ప్రత్యర్థి ట్రీబో హోటల్స్ మాతృసంస్థ రబ్‌టబ్ సొల్యూషన్స్ ఫిర్యాదు మేరకు సీసీఐ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పోటీ నిబంధనలను ఉల్లంఘించాయన్న ప్రాథమిక ఆధారాలతో ఈ రెండు సంస్థల మీద సీసీఐ విచారణకు ఆదేశించడం ఆరు

Most from this category