News


ఐటీ ఎగుమతులకు డిజిటల్‌ దన్ను

Wednesday 4th March 2020
news_main1583296445.png-32262

  • సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో 9 శాతం వృద్ధి అంచనా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశానికి డిజిటల్‌ వెన్నెముకగా మారిందని, ప్రధానంగా ఐటీ ఎగుమతుల వృద్ధికి బ్లాక్‌ చెయిన్, ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ), క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి డిజిటల్‌ టెక్నాలజీ దన్నుగా నిలుస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అరుణ్‌ గోయెల్‌ తెలిపారు. గత దశాబ్ద కాలంగా దేశంలో బలమైన ఐటీ మౌలిక వసతులను ఏర్పాటైందని, దీంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ బ్యాంక్‌ ఖాతాలు, మొబైల్, ఇంటర్నెట్‌ సేవల వినియోగం పెరిగిందని చెప్పారు. రెండు రోజుల ఇండియాసాఫ్ట్‌ ఇంటర్నేషనల్‌ ఐసీటీ ఎగ్జిబిషన్‌ మంగళవారమిక్కడ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. దేశీయ ఐటీ ఎగుమతులు 8 శాతం వృద్ధి రేటులో ఉంటే.. తెలంగాణ ఐటీ ఎగుమతులు 17–18 శాతం వృద్ధిలో ఉన్నాయని తెలిపారు. గతేడాది ఐటీ పరిశ్రమ 14 మిలియన్‌ చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలను నిర్వహించాయని పేర్కొన్నారు. 2019–20 సంవత్సరంలో దేశీయ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో 9 శాతం వృద్ధి ఉంటుందని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఈఎస్‌సీ) చైర్మన్‌ మణ్‌దీప్‌ సింగ్‌ పురీ తెలిపారు. 1980లో 80 మిలియన్‌ డాలర్లుగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు ప్రస్తుతం 150 బిలియన్‌ డాలర్లకు చేరాయని.. ఇందులో ఈఎస్‌సీ కీలక పాత్ర వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రదర్శన ద్వారా దేశీయంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు ఐసీటీ వ్యాపార విస్తరణతో పాటూ ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, సార్క్‌ దేశాల్లో ఎంట్రీకి మార్గం సులువవుతుందని ఇండియాసాఫ్ట్‌ చైర్మన్‌ నలిన్‌ కోహ్లి తెలిపారు. You may be interested

ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు

Wednesday 4th March 2020

26 ఏపీఐలు, మందులకు వర్తింపు జాబితాలో పారాసెటమల్‌, బీ1, బీ12 న్యూఢిల్లీ: చైనాలో కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో దేశీయంగా ఔషధాల లభ్యతకు సమస్యలు లేకుండా చూడటంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 26 యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ), ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. పారాసెటమల్‌, విటమిన్ బీ1, బీ12 మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. తాజా ఆంక్షలతో ఇకపై వీటి ఎగుమతుల కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్

మహిళలకు రూ. 17వేల కోట్ల రుణాలు

Wednesday 4th March 2020

స్టాండప్ ఇండియా స్కీమ్ కింద మంజూరు న్యూఢిల్లీ: 'స్టాండప్ ఇండియా' పథకం కింద రుణాలు పొందిన వారిలో దాదాపు 81 శాతం మంది మహిళలు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. నాలుగేళ్ల వ్యవధిలో వారు రూ. 16,712 కోట్ల రుణాలు పొందినట్లు వివరించింది. "2020 ఫిబ‍్రవరి 17 నాటికి స్టాండప్ ఇండియా స్కీమ్‌ కింద ఖాతాదారుల్లో 81 శాతం మంది మహిళలు ఉన్నారు. 73,155 ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి.

Most from this category