News


ఐకానిక్‌ బజాజ్‌ ‘చేతక్‌’ తిరిగొచ్చింది!

Wednesday 16th October 2019
news_main1571220712.png-28927

బజాజ్‌ ఐకానిక్‌ స్కూటర్‌ ‘చేతక్‌’, ఎలక్ట్రిక్‌ స్కూటర్‌గా తిరిగి మార్కెట్‌లో సందడి చేయనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ-స్కూటర్లను(ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌) చేతక్‌ బ్రాండ్‌తో విక్రయించాలని బజాజ్‌ కంపెనీ భావిస్తోంది. కాగా సుమారుగా పదేళ్ల కిందట బజాజ్‌ చేతక్‌ స్కూటర్‌ తయారిని నిలిపివేసింది. ప్రస్తుతం ఈ స్కూటర్‌ తిరిగి వస్తున్నప్పటికి ఇది సాంప్రదాయ స్కూటర్‌లా ఉండదని బజాజ్‌ ఆటో మేనేజింగ్‌ డైరక్టర్‌ రాజీవ్‌ బజాజ్‌ అన్నారు.  చేతక్‌ స్కూటర్‌ను బుధవారం కేంద్ర రవాణా శాఖ మంత్రి, నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌, బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ ఆధ్వర్యంలో ప్రారంభించారు. చేతక్‌ ఈ-స్కూటర్‌ రెండు వేరియంట్లలో లభించనుంది. ఒకే సారి 5 గంటల చార్జింగ్‌తో 85 కి.మి, 95 కి.మి నడిచే రెండు వేరియంట్లలో చేతక్‌ అందుబాటులోకి రానుంది. ఈ స్కూటర్‌ ధర శ్రేణిని ప్రకటించనప్పటికి, దీని ధర రూ. 1.5 లక్షల పరిధిలో ఉంటుందని రాజివ్‌ బజాజ్‌  సూచనాప్రాయంగా వెల్లడించారు. అంతేకాకుండా ఈ స్కూటర్‌ను జనవరి నుంచి మొదట పూణేలో అందుబాటులోకి తీసుకొచ్చి​, తర్వాత బెంగుళూరుకి విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. ఈ రెండు నగరాలలో వచ్చే స్పందనను చూసిన తర్వాత ఇతర నగరాలలో అందుబాటులోకి తీసుకురానున్నారు.    
    కంపెనీకి చెందిన చకాన్‌ ప్లాంట్‌లో చేతక్‌ ఈ-స్కూటర్‌ను తయారు చేయనుండగా, కేటిఎం వంటి సూపర్‌బైక్‌ డీలర్‌షిప్‌ల ద్వారా వినియోగదారులకు ఇది అందుబాటులో ఉండనుంది. ద్వీచక్ర వాహనాల విభాగంలో కీలకంగా ఉన్న కంపెనీగా ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలో మొదట అడుగుపెట్టలాని నిర్ణయించుకున్నామని రాజీవ్‌ బజాజ్‌ అన్నారు. ‘ఇప్పుడున్న స్వభావంతో మేము ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు అడుగులేశాం’ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గోన్న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరి మాట్లాడుతూ..భవిష్యత్‌లో ఎలక్ట్రిక్‌, బయో ఇంధన వాహనాలు వంటి పర్యవరణహితమైన వాహనాలకు ఆటో పరిశ్రమ కట్టుబడివుంటుందని అభిప్రాయపడ్డారు. You may be interested

ఆచితూచి వ్యవహరిస్తున్న ఎఫ్‌పీఐలు!

Wednesday 16th October 2019

టాక్స్‌ తగ్గింపు ప్రభావం చూపుతుంది మార్కెట్‌ నిపుణుడు సమీర్‌ నారాయణ్‌ పతనం పూర్తయిందని భావించిన కౌంటర్లను జాగ్రత్తగా ఎంచుకొని విదేశీ ఫండ్స్‌ పెట్టుబడులు పెడుతున్నాయని ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు సమీర్‌ నారాయణ్‌ అభిప్రాయపడ్డారు. స్వల్పకాలానికి ఎర్నింగ్స్‌ వృద్ధి కన్నా పన్నుల తగ్గింపే ఎక్కువ ప్రభావం చూపుతుందని భావించే షేర్లను ఎంచుకుంటున్నాయన్నారు. ఎంపిక చేసిన కంపెనీలకు కార్పొరేట్‌ పన్ను తగ్గింపు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుందని ఎఫ్‌ఐఐలు భావిస్తున్నాయన్నారు. త్రైమాసిక ఫలితాల ఆధారంగా విదేశీ మదుపరులు

ఫెడరల్‌ బ్యాంక్‌ నికర లాభం రూ. 417 కోట్లు

Wednesday 16th October 2019

ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ ఫెడరల్‌ బ్యాంక్‌ మంగళవారం రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ2లో కంపెనీ రూ.417కోట్ల నికరలాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.266 కోట్లతో పోలిస్తే ఇది 56.3శాతం అధికం. ఇతర ఆదాయం పెరగడం, తక్కువ పన్ను వ్యయం నికరలాభం పెరిగేందుకు కారణమైనట్లు బ్యాంకు తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,748.44 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.3,135.97 కోట్లుగా

Most from this category