STOCKS

News


అందరి దృష్టి ఆల్గోట్రేడింగ్‌ పైనే!

Monday 12th August 2019
news_main1565605584.png-27719

విపరీతంగా పెరిగిపోతున్న ఆల్గోమెథడ్‌
కామన్‌ ట్రేడర్లకు కూడా అందుబాటులో టెక్నాలజీ
ఇటీవల కాలంలో ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌పై ఆల్గోట్రేడింగ్‌(కంప్యూటర్ల ద్వారా ఆటోమేటిగ్గా ఆర్డర్లు ఎగ్జిక్యూట్‌ చేయడం) పెరిగిపోతోంది. ఆల్గోట్రేడింగ్‌తో టెక్‌ ట్రేడర్లకు మరింత పవర్‌ పెరిగింది. మార్కెట్లో వచ్చే అతి స్వల్ప వేగవంతమైన మార్పును కూడా ఒడిసిపట్టగలుగుతున్నారు. దీంతో మానవ సంబంధిత తప్పులు తగ్గాయి. కానీ ఇదే సమయంలో పెరిగిపోతున్న ఆల్గోట్రేడింగ్‌ క్రమంగా సాధారణ ట్రేడర్స్‌ను బెంబెలెత్తించి మార్కెట్‌కు దూరమయ్యేలా చేస్తోందంటున్నారు కొందరు నిపుణులు. పదేళ్ల క్రితం బడా సంస్థ సైతం పెద్ద ట్రేడ్‌ చేయాలంటే అనేక పద్దులు తయార చేసుకోవాల్సివచ్చేది. అంతేకాకుండా పలు ట్రేడర్లను, కంప్యూటర్లను ఇందుకు నియోగించాల్సివచ్చేది. మార్కెట్‌కు అనుమానం రాకుండా, పెద్ద కదలికలు ఏర్పడకుండా ఉండేందుకు పలు చిన్న ట్రేడ్లను ఎగ్జిక్యూట్‌ చేయడం జరిగేది. కానీ ఇదంతా గతం. ఇప్పుడు ఎంత పెద్ద ట్రేడ్‌నైనా, ఎన్ని విడతలైనా ఒకే కంప్యూటర్‌తో ఆల్గో ట్రేడింగ్‌లో ముగించవచ్చు. సంస్థాగత క్లయింట్లకు డీఎంఏ(మార్కెట్‌ ప్రత్యక్ష యాక్సెస్‌)కల్పించాలని సెబి నిర్ణయించడంతో దేశీయ మార్కెట్‌లోకి ఆల్గోలు ప్రవేశించాయి. ప్రధానంగా బడా ఏయూఎంలు, ఎఫ్‌పీఐలు, డీఐఐలు వీటిని వాడేవి. ఇప్పుడు చిన్న ట్రేడర్లకు కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఎక్చేంజ్‌ టర్నోవర్స్‌లో ఆల్గోట్రేడింగ్‌ వాటా దాదాపు 30- 40 శాతముంది. భవిష్యత్‌ మొత్తం ఆల్గోట్రేడింగ్‌దేనని, ఆటోమేషన్‌ పెరిగేకొద్దీ ఈ ట్రేడింగ్‌ మరిన్ని కొత్త పుంతలు తొక్కుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2024 నాటికి అంతర్జాతీయ ఆల్గోట్రేడింగ్‌ మార్కెట్‌ 1880 కోట్ల డాలర్లకు చేరుతుందని  అంచనాలున్నాయి. ఆల్గోట్రేడింగ్‌ అనేకరూపాల్లో మానవ ప్రమేయాన్ని తగ్గిస్తున్నా కొంతవరకు మనిషి ప్రమేయం ఉండక తప్పని పరిస్థితి ఉంది. ఇలా ఉంటేనే ఫైనాన్షియల్‌ మార్కెట్లు ఉజ్వలంగా ఉంటాయని, పూర్తిగా మిషన్ల నిర్ణయాలపై ఆధారపడితే మార్కెట్‌ పరిస్థితి అస్థవ్యస్థంగా ఉంటుందని నిపుణుల భావన. 
కామన్‌ట్రేడర్‌ కోసం కాస్త కట్టడి..
సాధారణ ట్రేడర్‌ను కాపాడేందుకు ఆల్గారిధమ్‌ ట్రేడింగ్‌పై రుసుము విధించాలని సెబి భావిస్తోంది. వివిధ శ్లాబులను ఏర్పరిచి వాటికనుగుణంగా ట్రేడర్ల నుంచి కంజెషన్‌ చార్జీలు వసూలు చేసే దిశగా యత్నాలు ఆరంభించింది. ఈ చార్జీల ద్వారా ఆల్గో ట్రేడింగ్‌ అందుబాటులో లేని వినియోగదారులకు, అల్గో ట్రేడర్స్‌కు మధ్య బేధాన్ని తొలగించాలని యోచిస్తోంది. ఇప్పటివరకు సాధారణ ట్రేడర్లతో పోలిస్తే ఆల్గోట్రేడర్లు సాంకేతికతతో అనుచిత లబ్ది పొందుతూవస్తున్నారు. సెంకడరీ మార్కెట్‌ సలహా కమిటీలో ఆల్గోట్రేడింగ్‌పై చార్జీలు విధింపు అంశం చర్చకు వచ్చింది. సెబి కనుక ఈ చార్జీలకు సై అంటే ప్రపంచంలో ఈ తరహా చార్జీలు వసూలు ఇదే తొలిసారి కానుంది. గతంలోసైతం ఆల్గోట్రేడింగ్‌ కట్టడికి సెబి పలు ప్రతిపాదనలు తీసుకువచ్చింది. కేవలం గందరగోళం సృష్టించేందుకు ఆల్గోట్రేడర్లు భారీ ఆర్డర్లు పెట్టి, క్యాన్సిల్‌ చేస్తుంటారు. దీన్ని నివారించేందుకు గరిష్ఠ ఆర్డర్‌ మెసేజ్‌ టు ట్రేడ్‌ నిష్పత్తిని సెబి 2016లో ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ప్రకారం ప్రతికొన్ని ఆర్డర్లకు కనీసం ఒక్కఆర్డర్‌నైనా ట్రేడర్‌ ఎగ్జిక్యూట్‌ చేయాల్సిఉంటుంది. దీంతో పాటు ఆర్డర్లకు కనీస విరామ సమయం, స్పీడ్‌ బమ్స్‌, డేటా విశ్లేషణ లాంటి పలు ప్రతిపాదనలను సెబి ప్రతిపాదించింది. వీటి ద్వారా ఆల్గోట్రేడింగ్‌ అవలక్షణాలను తగ్గించాలన్నది సెబి ఆలోచన. ఇలాంటి అల్లాటప్పా ఆర్డర్ల కారణంగా సాధారణ ఇన్వెస్టర్‌ గజిబిజికి గురవడమేకాకుండా మొత్తం సిస్టమ్‌పై ఒత్తిడి ఎక్కువ పడుతోంది. వీటిని దృష్టిలో ఉంచుకొని త్వరలో సెకండరీమార్కెట్‌ సలహా కమిటీ ఒక నిర్ణయానికి రానుంది. సెబి ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే వాల్యూంలు తగ్గుతాయని అయితే నిజమైన ఇన్వెస్టర్లకు ఎలాంటి ఇబ్బంది, ‍ప్రమాదం ఉండదని నిపుణులు భావిస్తున్నారు. You may be interested

రిలయన్స్‌ హోమ్‌ పైనాన్స్‌లో వాటా విక్రయానికి రిలయన్స్‌ క్యాపిటల్‌ చర్చలు

Monday 12th August 2019

రిలయన్స్‌ హోమ్స్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో తన మెజారిటీ వాటాను విక్రయించేందుకు రిలయన్స్‌ క్యాపిటల్‌ సిద్ధమైంది. ఈ మేరకు నాలుగు ప్రముఖ కంపెనీలతో చర్చలు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వాటిలో వార్దే పాట్నర్స్‌ ఇంక్‌.., ఐయాన్‌ క్యాపిటల్‌, క్యాబెరీస్‌ క్యాపిటల్‌ మేనేజెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సం‍స్థలతో పాటు ఎన్బీబీసీ కంపెనీ ఆల్టికో క్యాపిటల్ ఇండియా లిమిటెడ్‌ కంపెనీలున్నాయి. రిలయన్స్‌ హోమ్ ఫైనాన్స్‌ ప్రస్తుతం బుక్‌లోన్‌ విలువ రూ.11,000 కోట్లుగా ఉంది. వీటిలో

రిలయన్స్‌ షేరు పెరిగే ఛాన్స్‌

Monday 12th August 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ఆయిల్‌ రిఫైనింగ్‌, పెట్రో కెమికల్‌  విభాగాలలో  సౌదీ ఆరామ్‌తో అతిపెద్ద ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ కంపెనీ షేరు విలువ మంగళవారం పాజిటివ్‌గా కదులుతుందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆర్‌ఐఎల్‌ ఎజీఎం మీటింగ్‌లో కంపెనీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌ ముకేష్‌ అంబానీ మాట్లాడుతూ..వచ్చే 18 నెలలో కంపెనీని జీరో నికర అప్పు కలిగిన కంపెనీగా తీర్చుదిద్దుతామని, వచ్చే కొన్నేళ్లలో బోనస్‌లు, డివిడెండ్‌లు అధికంగా పంచనున్నామని ప్రకటించారు. ఈ

Most from this category