News


2024 నాటికి 69 శాతం పనులు ఆటోమేషనే

Friday 24th January 2020
news_main1579835972.png-31152

  • గార్ట్‌నర్‌ సంస్థ అంచనా

బెంగళూరు: ప్రస్తుతం మేనేజర్ల స్థాయిల్లో జరుగుతు‍న్న పనుల్లో 69 శాతం 2024 నాటికి ఆటోమేషన్‌ (యంత్రాలు) అవుతాయని అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ‘గార్ట్‌నర్‌’ అధ్యయనం పేర్కొంది. వర్చువల్‌ పర్సనల్‌ అసిస్టెన్స్‌, చాట్‌బాట్స్‌ వంటి అత్యాధునిక టెక్నాలజీలు మేనేజర్లపై పని భారం తగ్గించనున్నాయని తెలిపింది. మేనేజర్‌ పాత్ర నాలుగేళ్ల కాలంలో పూర్తిగా మారిపోబోతుందని పేర్కొంది. ‘‘ప్రస్తుతం మేనేజర్లు పత్రాలను నింపడం, తాజా సమాచారాన్ని పొందుపరచడం, పనులను ఆమోదించడం వంటి టాస్క్‌లను తరచుగా చేయాల్సి వస్తోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా వీటిని ఆటోమేట్‌ (వాటంతట అవే జరిగిపోయేలా) చేయడం వల్ల వీటిపై వెచ్చించే సమయం తగ్గిపోతుంది. తద్వారా అధ్యయనం, యాజమాన్య పనితీరు, లక్ష్యాల నిర్దేశంపై మరింత సమయం వెచ్చించే అవకాశం లభిస్తుంది’’ అని గార్ట్‌నర్‌ అధ్యయనం తెలియజేసింది. 



You may be interested

ప్రతికూల ఓపెనింగ్‌ నేడు!

Friday 24th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 15 పాయింట్లు మైనస్‌ నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 15 పాయింట్లు తక్కువగా 12,185  వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,200 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి  తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చైనాలో వైరస్‌ వ్యాపిస్తున్న

ఇక గోద్రేజ్‌ ఎయిర్‌ కూలర్లు

Friday 24th January 2020

3 కేటగిరీల్లో 17 మోడళ్లు  ధరలు రూ.12,300-19,900 రేంజ్‌లో  న్యూఢిల్లీ: గృహోపకరణాల సంస్థ, గోద్రేజ్‌ అప్లయెన్సెస్‌ ఎయిర్‌ కూలర్ల సెగ్మెంట్లోకి ​ప్రవేశించింది. ఇన్వర్టర్‌ టెక్నాలజీతో రూపొందిన ఎయిర్‌ కూలర్లను మార్కెట్లోకి తెచ్చామని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది పేర్కొన్నారు. ఈ కూలర్ల వాడకం వల్ల విద్యుత్తు 50 శాతం అవుతుందని మూడేళ్లలో రూ.3,000 వరకూ పొదుపు చేయవచ్చని వివరించారు. మూడు కేటగిరీల్లో (ఇన్వెర్టర్‌, ఎలక్ట్రానిక్‌, మెకానికల్‌ సిరీస్‌) మొత్తం 17

Most from this category