News


2023 నాటికి 90 కోట్ల ఇంటర్నెట్‌ యూజర్లు

Thursday 20th February 2020
news_main1582168530.png-31947

  • సిస్కో నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: దేశంలో 2023 నాటికి ఇంటర్నె్‌ట్‌ వినియోగదార్ల సంఖ్య 90.7 కోట్లకు చేరుతుందని, జనాభాలో ఈ సంఖ్య 64 శాతమని సిస్కో తన వార్షిక ఇంటర్నెట్‌ నివేదికలో వెల్లడించింది. 2018లో ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య 39.8 కోట్లుగా ఉందని తెలిపింది. ఈ సంఖ్య జనాభాలో 29 శాతమని వివరించింది. ‘2018లో 76.3 కోట్ల మొబైల్‌ యూజర్లు ఉంటే, 2023 నాటికి 96.6 కోట్లకు చేరతారు. నెట్‌వర్క్‌డ్‌ డివైసెస్‌ 150 కోట్ల నుంచి 210 కోట్లకు చేరతాయి. మొబైల్‌ కనెక్టెడ్‌ డివైసెస్‌ 110 కోట్ల నుంచి 140 కోట్లకు ఎగుస్తాయి. వైర్డ్‌/వైఫై కనెక్టెడ్‌ డివైసెస్‌ 36 కోట్ల నుంచి 69.7 కోట్లను తాకనున్నాయి. నెట్‌వర్క్‌డ్‌ డివైసెస్‌లో స్మార్ట్‌ఫోన్ల వాటా 42 శాతం నుంచి 38 శాతంగా ఉండనుంది. 2023 నాటికి నెట్‌వర్క్‌డ్‌ డివైసెస్‌లో 66 శాతం స్మార్ట్‌ఫోన్లు, 34 శాతం వైఫై/వైర్డ్‌ కనెక్టెడ్‌ డివైసెస్‌ ఉంటాయి. 5జీ కనెక్షన్లు 6.72 కోట్లకు చేరతాయి. మొబైల్‌ కనెక్షన్లలో 4జీ వాటా 53.1 శాతానికి ఎగుస్తుంది. 2018లో ఇది 37.9 శాతంగా ఉంది. 2018లో 2,070 కోట్ల మొబైల్‌ యాప్స్‌ డౌన్లోడ్‌ అయితే, 2023 నాటికి ఈ సంఖ్య 4,620 కోట్లకు చేరుతుంది. మొబైల్‌ కనెక్షన్‌ సగటు స్పీడ్‌ 4.6 ఎంబీపీఎస్‌ నుంచి 16.3 ఎంబీపీఎస్‌కు చేరనుంది’ అని తన నివేదికలో వివరించింది. 



You may be interested

నేడు నిఫ్టీకి 12067 వద్ద సపోర్ట్‌

Thursday 20th February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 46 పాయింట్లు మైనస్‌ బుధవారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్స్‌ నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  ఉదయం  8.30  ప్రాంతం‍లో 46 పాయింట్లు క్షీణించి 12,102 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,148 పాయింట్ల  వద్ద  ముగిసింది.  ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కరోనా భయాల నుంచి బయటపడిన

విమానాల్లో నెల్కో వై-ఫై సర్వీసులు

Thursday 20th February 2020

విస్తార ఎయిర్‌లైన్స్‌తో ప్రారంభం న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌లో భాగమైన నెల్కో సంస్థ తాజాగా విమానాల్లో వై-ఫై సర్వీసులు ఆవిష్కరించింది. విస్తార ఎయిర్‌లైన్స్‌ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తేనుంది. తద్వారా విస్తార.. దేశీయంగా ఇన్‌-ఫ్లయిట్ వై-ఫై సర్వీసులు (ఐఎఫ్‌సీ) అందిస్తున్న తొలి విమానయాన సంస్థ కానుంది. పానసోనిక్ ఏవియోనిక్స్‌తో కలిసి ఈ సేవలు అందిస్తున్నట్లు నెల్కో ఎండీ, సీఈవో పీజే నాథ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఐఎఫ్‌సీకి భారీ అవకాశాలు ఉన్నాయని,

Most from this category