News


ఫోర్డ్‌ ఎండీవర్‌లో 2020 ఎడిషన్‌

Wednesday 26th February 2020
news_main1582685462.png-32090

  • ధరలు రూ.29.55 లక్షల నుంచి 
  • ఏప్రిల్‌ వరకూ ఈ ధరలు 
  • ఆ తర్వాత రూ.70,000 అదనం 

న్యూఢిల్లీ: ఫోర్డ్‌ ఇండియా కంపెనీ ప్రీమియమ్‌ ఎస్‌యూవీ మోడల్‌, ఎండీవర్‌లో 2020 ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఎండీవర్‌ ఎస్‌యూవీ 2020 ఎడిషన్‌ పరిచయ ధరలు రూ.29.55 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌, ఢిల్లీ) నుంచి ఆరంభమవుతాయని ఫోర్డ్‌ ఇండియా ప్రెసిడెంట్‌, ఎమ్‌డీ అనురాగ్‌ మెహరోత్ర చెప్పారు. ఈ ధరలు ఈ ఏడాది ఏప్రిల్‌ 30 వరకే అని, ఆ తర్వాత నుంచి రూ.70,000 అధికంగా ఉంటాయని వివరించారు.  బీఎస్‌-సిక్స్‌ ప్రమాణాలకు అనుగుణంగా 2.0 లీటర్‌ ఈకోబ్లూ ఇంజిన్‌తో ఈ ఎస్‌యూవీని రూపొందించామని, 10 గేర్ల ఆటోమేటిక్‌ ట్రాన్సిమిషన్‌ ప్రత్యేక ఆకర్షణ అని వివరించారు. 

14 శాతం అధిక మైలేజీ...
ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇంధన సామర్థ్యం అధికంగా ఉన్న ఎస్‌యూవీ ఎండీవరే అని అనురాగ్‌ పేర్కొన్నారు. ఈ 2020 ఎడిషన్‌ 14 శాతం అధిక మైలేజీని ఇస్తుందని తెలిపారు. ఈ మోడల్‌లో 4x2 డ్రైవ్‌లైన్‌ వేరియంట్‌ 13.9 కి.మీ. 4x4 డ్రైవ్‌లైన్‌ వేరియంట్‌ 12.4 కి.మీ. మైలేజీని ఇస్తాయని పేర్కొన్నారు. ఎస్‌యూవీలను కొనుగోలు చేయాలనుకునే కొత్త వినియోగదారులు ఎండీవర్‌నే ఎంచుకుంటారన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. 



You may be interested

మార్కెట్లోకి హోండా బీఎస్‌-VI డియో స్కూటర్‌

Wednesday 26th February 2020

ధరలు రూ.64,584 నుంచి ఆరంభం  బెంగళూరు: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా కంపెనీ డియో మోడల్‌లో బీఎస్‌ సిక్స్‌ వేరియంట్‌ను బెంగళూరు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్‌ ధరలు రూ.64,584(ఎక్స్‌ షోరూమ్‌, బెంగళూరు) నుంచి ఆరంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్‌ రెండు వేరియంట్లు-స్టాండర్డ్‌, డీలక్స్‌ల్లో లభ్యమవుతుందని వెల్లడించింది. మార్కెట్లోకి విడుదల చేసిన రోజే 301 స్కూటర్లను డెలివరీ చేశామని పేర్కొంది. దక్షిణాదిలో తమదే నంబర్‌ వన్‌  టూ వీలర్‌

కొందరికే పరిమితం కాకూడదు!

Wednesday 26th February 2020

టెక్నాలజీ సొల్యూషన్లు అందరికీ అందాలి డెవలపర్లకు బాధ్యత, నైతికత తప్పనిసరి మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల సూచనలు బెంగళూరు: టెక్నాలజీ ఆధారిత పరిష్కార మార్గాలను అభివృద్ధి చేసే డెవలపర్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల సూచించారు. సొల్యూషన్స్‌ రూపొందించేటప్పుడు నైతికత, విశ్వసనీయతపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. టెక్నాలజీ ప్రయోజనాలు అందరికీ లభించేలా చూడాలని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సొల్యూషన్స్‌ రూపకల్పనలో ఎలాంటి పక్షపాత ధోరణులు చొరబడకుండా

Most from this category