News


యస్‌ బ్యాంక్‌ లాభం 92 శాతం డౌన్‌

Thursday 18th July 2019
Markets_main1563431964.png-27148

  • రూ.96 కోట్లకు నికర లాభం 
  • భారీగా పెరిగిన మొండి బకాయిలు
  • కేటాయింపులు కూడా అదే స్థాయిలో 
  • ఇక ఇప్పటి నుంచి పుంజుకుంటాం
  • విశ్వాసం వ్యక్తం చేసిన బ్యాంక్‌ 

ముంబై: ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 92 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.1,260 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో  రూ. 96 కోట్లకు చేరిందని యస్‌ బ్యాంక్‌ తెలిపింది.  మొండి బకాయిలు భారీగా పెరిగి కేటాయింపులు కూడా అదే స్థాయిలో పెరగడం,  ఇతర ఆదాయం తక్కువగా ఉం డటం, నికర వడ్డీ ఆదాయం, నిర్వహణ లాభాలు కూడా తగ్గడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని యస్‌బ్యాంక్‌ తెలిపింది. స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, అంతకు ముందటి క్వార్టర్‌(గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో) రూ.1,507 కోట్ల నికర నష్టాలు రాగా, ఈ క్యూ1లో రూ.114 కోట్ల నికర లాభం వచ్చిందని పేర్కొంది. రాణా కపూర్‌ తర్వాత బ్యాంక్‌ సీఈఓగా పగ్గాలు చేపట్టిన రవ్‌నీత్‌ గిల్‌ హయాంలో యస్‌ బ్యాంక్‌ నికర లాభం వరుసగా రెండో క్వార్టర్‌లోనూ భారీగా పతనమైంది. 

నికర వడ్డీ ఆదాయం రూ.2,281 కోట్లు...
నికర వడ్డీ ఆదాయం 2.8 శాతం వృద్ధితో రూ.2,281 కోట్లకు చేరిందని యస్‌ బ్యాంక్‌ పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర వడ్డీ ఆదాయం 9 శాతం తగ్గిందని తెలిపింది. నికర వడ్డీ మార్జిన్‌ 2.8 శాతం సాధించామని తెలిపింది. మొండి బకాయిలు పెరగడం వల్ల నికర వడ్డీ మార్జిన్‌ పెద్దగా పెరగలేదని పేర్కొంది. రుణ వృద్ధి 10 శాతంగానే ఉందని పేర్కొంది. రిటైల్‌ రుణాలు 43 శాతం వృద్ధి చెందాయని, మొత్తం రుణాల్లో రిటైల్‌ రుణాల వాటా 18.3 శాతమని పేర్కొంది. ఇతర ఆదాయం 25 శాతం తగ్గి రూ.1,273 కోట్లకు, నిర్వహణ లాభం 20 శాతం తగ్గి రూ.1,959 కోట్లకు చేరాయని తెలిపింది. డిపాజిట్లు 6 శాతం వృద్ధితో రూ.2.25 లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొంది. 

రూ.6,232 కోట్లకు తాజా మొండి బకాయిలు...
తాజా మొండి బకాయిలు అంతకు ముందటి క్వార్టర్‌(గత ఆర్థిక సంవత్సరం క్యూ4-రూ.3,408 కోట్లు)తో పోల్చితే దాదాపు రెట్టింపై రూ.6,232 కోట్లకు పెరిగాయి. ఫలితంగా స్థూల మొండి బకాయిలు భారీగా పెరిగాయి. గత క్యూ1లో 1.31 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 5.01 శాతానికి(రూ.12,092 కోట్లు) పెరిగాయి. అంతకు ముందటి క్వార్టర్‌లో ఇది 2.91 శాతంగా ఉంది. ఇక నికర మొండి బకాయిలు 2.91 శాతానికి (రూ.6,883 కోట్లకు) చేరాయి. మొండి బకాయిలు పెరగడంతో కేటాయింపులు భారీగా పెరిగాయి. 184 శాతం ఎగసి రూ.1,784 కోట్లకు చేరాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, కేటాయింపులు 51 శాతం తగ్గాయి. రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ల కారణంగా రెండు ఆర్థిక సంస్థల్లో తాము ఇన్వెస్ట్‌ చేసిన పెట్టుబడులకు నష్టాలు వచ్చాయని, ఈ మార్క్‌ టు మార్కెట్‌ నష్టాలకు రూ.1,109 కోట్ల కేటాయింపులు జరిపామని పేర్కొంది. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 43 శాతానికి తగ్గింది. ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ల్లో ఈ నిష్పత్తి అత్యంత కనిష్టంగా ఉన్న బ్యాంక్‌ల్లో ఇది కూడా ఒకటి.

ఇన్ని ప్రతికూలతలున్నా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి  వడ్డీ వ్యయం 1.25 శాతంగానే ఉండగలదని ఈ బ్యాంక్‌ అంచనా వేస్తోంది. ఈ క్యూ1లో వడ్డీ వ్యయం 0.32 శాతంగానే ఉందని పేర్కొంది. 


కామెంట్‌...
ఇది కన్సాలిడేషన్‌ క్వార్టర్‌ అని బ్యాంక్‌ వ్యాఖ్యానించింది.  ఈ క్వార్టర్‌ నుంచి నికర లాభం పుంజుకోగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.



You may be interested

విప్రో లాభం రూ.2,388 కోట్లు

Thursday 18th July 2019

వార్షికంగా 12 శాతం వృద్ధి  సీక్వెన్షియల్‌గా 4 శాతం క్షీణత  5 శాతం వృద్ధితో రూ.14,716 కోట్లకు ఆదాయం  న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో 12 శాతం వృద్ధితో రూ.2,388 కోట్లకు పెరిగింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, (గత క్యూ4లో వచ్చిన నికర లాభం రూ.2,484 కోట్లుతో పోల్చితే) 4 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.13,978 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 5

కేజీ-డీ6లో రూ. 35 వేల కోట్ల పెట్టుబడులు

Thursday 18th July 2019

2022 నాటికి రిలయన్స్, బీపీ ప్రణాళిక న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌లో సహజ వాయువు ఉత్పత్తికి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్‌, బ్రిటీష్ భాగస్వామ్య సంస్థ బీపీ 2022 నాటికి  రూ. 35 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. కేజీ-డీ6 బ్లాక్‌లో మూడు గ్యాస్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు ఈ నిధులను వెచ్చించనున్నట్లు బీపీ సీఈవో (అప్‌స్ట్రీమ్ విభాగం) బెర్నార్డ్ లూనీ తెలిపారు. 2022 నాటికి కొత్తగా రోజుకు వంద కోట్ల ఘనపుటడుగుల గ్యాస్‌

Most from this category