News


కొనేవారు రాకుంటే .. ఎయిరిండియా మూసివేతే

Tuesday 31st December 2019
Markets_main1577766859.png-30550

  • ఆందోళనలో కంపెనీ వర్గాలు

ముంబై: వచ్చే ఏడాది జూన్‌లోగా కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎవరూ ముందుకు రాకపోయిన పక్షంలో ప్రభుత్వ రంగ విమానయాన రంగ సంస్థ ఎయిరిండియా మూసివేత తప్పదని కంపెనీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. నిర్వహణ వ్యయాల అవసరాల కోసం రూ. 2,400 కోట్లు సమీకరించుకోవడానికి తగినంత పూచీకత్తు ఇవ్వాలని కోరినప్పటికీ కేంద్రం కేవలం రూ. 500 కోట్లకు మాత్రమే హామీనిచ్చిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతానికి కార్యకలాపాలు ఎలాగోలా జరిగిపోతున్నప్పటికీ .. జూన్‌ దాకా మాత్రమే నిభాయించుకునే పరిస్థితి ఉందన్నారు. అప్పట్లోగా కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోయిన పక్షంలో .. జెట్ ఎయిర్‌వేస్ తరహాలోనే ఎయిరిండియా మూసివేత తప్పకపోవచ్చని అధికారి తెలిపారు. 2018-19లో ఎయిరిండియా నికర నష్టం సుమారు రూ. 8,556 కోట్లుగా ఉండగా, మొత్తం రుణభారం రూ. 60,000 కోట్ల మేర ఉంది. ఇందులో సగం రుణభారాన్ని ఎయిరిండియా అసెట్ హోల్డింగ్ అనే సంస్థకు బదలాయించి.. ఎయిరిండియాను విక్రయించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. 



You may be interested

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు జీతాలొచ్చాయ్‌

Tuesday 31st December 2019

రూ. 1,700 కోట్ల పాత బకాయిలు చెల్లింపు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌.. విక్రేతలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పాత బకాయిలను చెల్లించినట్లు సోమవారం ప్రకటించింది. వీరికి చెల్లించాల్సిన రూ. 1,700 కోట్ల మొత్తాన్ని ఇచ్చేసినట్లు సంస్థ చైర్మన్ పి.కె. పుర్వార్ వెల్లడించారు. ఈ మొత్తంతో పాటు ఉద్యోగులకు చెల్లించాల్సిన నవంబర్‌ జీతాలు (రూ. 800 కోట్లు) విడుదలచేసినట్లు చెప్పారు. ఇక తాజా సర్ధుబాట్లు అనంతరం రుణదాతలకు రూ. 10,000

తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు బిలియనీర్లు

Tuesday 31st December 2019

ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌లో రూ.3,80,700 కోట్లతో రిలయన్స్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ భారత్‌లో అపర కుబేరుడుగా నిలిస్తే, ఇదే జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు బిలియనీర్లకూ స్థానం దక్కింది. అరబిందో ఫార్మా చైర్మన్‌ పీవీ రాంప్రసాద్‌ రెడ్డికి(రూ.14,800 కోట్లు) 51వ స్థానం లభించగా, ఎంఈఐఎల్‌ చైర్మన్‌, ఎండీలు పి. పిచ్చిరెడ్డి (రూ.13,400),  పీవీ కృష్ణారెడ్డి (రూ12,900 కోట్లు)లు 57, 63 స్థానాల్లో నిలిచారు. ఇక

Most from this category