News


చౌకగా మరిన్ని చానళ్లు..

Friday 3rd January 2020
Markets_main1578020465.png-30627

(అప్‌డేటెడ్‌...)

  • ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డరు
  • ఉచిత చానళ్ల సంఖ్య పెంపు
  • మార్చి నుంచి అందుబాటులోకి

న్యూఢిల్లీ: కేబుల్ టీవీ చార్జీల భారాన్ని కాస్త తగ్గించేలా టెలికం రంగ నియంత్ర౾ణ సంస్థ ట్రాయ్ తాజాగా కొత్త టారిఫ్ ఆర్డరు ప్రకటించింది. దీంతో మరిన్ని చానళ్లు.. ఇంకాస్త చౌక రేటుకు అందుబాటులోకి రానున్నాయి. ట్రాయ్ తన వెబ్‌సైట్‌లో ఉంచిన ఆర్డరు ప్రకారం.. ఉచిత చానళ్ల సంఖ్య పెరగనుండగా, పే చానళ్ల చార్జీలు తగ్గనున్నాయి. అలాగే, వివిధ చానళ్లను కలిపి బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు అందించే బొకే ఆఫర్లపైనా ట్రాయ్ పరిమితులు విధించింది. వీటికి సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన చర్చాపత్రాలపై పరిశ్రమవర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ మార్గదర్శకాలు రూపొందించింది. సవరించిన టారిఫ్‌లను బ్రాడ్‌కాస్టర్లు జనవరి 15లోగా, మల్టీ సిస్టం ఆపరేటర్లు 20లోగా ప్రచురించాల్సి ఉంటుంది. వినియోగదారులకు.. కొత్త నిబంధనల ప్రయోజనాలు మార్చి 1 నుంచి లభించనున్నాయి. ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డరు ప్రకారం..

  • బొకే కింద అందించే పే చానళ్ల గరిష్ట ధర రూ. 19 నుంచి రూ. 12కి తగ్గుతుంది. ప్రతి చానల్‌కు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ తమకు అనువైన రేటును వసూలు చేసినా, సదరు చానల్‌ను ఇతర చానళ్లతో కలిపి గంపగుత్తగా (బొకే) ఆఫర్ చేసేటప్పుడు గరిష్ట ధర రూ. 12కి (పన్నులు అదనం) మించరాదు.
  • నెలవారీ గరిష్టంగా రూ. 160 నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు (ఎన్‌సీఎఫ్)తో కేబుల్ ఆపరేటర్లు 200 దాకా ఉచిత.. స్టాండర్డ్ డెఫినిషన్ చానళ్లను అందించాలి. ప్రస్తుతం ఎన్‌సీఎఫ్ రూ. 130గాను, ఉచిత చానళ్ల సంఖ్య 100గాను ఉంది.
  • బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలకు దీటుగా డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫాం ఆపరేటర్లు కూడా యూజర్లను ఆకర్షించేందుకు ఆఫర్లు ఇవ్వొచ్చు. ఆరు నెలల పైగా దీర్ఘకాలిక సబ్‌స్క్రిప్షన్ తీసుకునేవారికి ఎన్‌సీఎఫ్‌పైన, డిస్ట్రిబ్యూటర్ రిటైల్ ధరపైన డిస్కౌంట్లు వంటివి ఇవ్వొచ్చు. 
  • ఒకటికి మించి టీవీలు ఉన్న ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ట్రాయ్ సమీక్షించింది. రెండో టీవీకి వసూలు చేసే ఎన్‌సీ ఫీజు.. మొదటి టీవీ సెట్‌ ఫీజులో 40 శాతాన్ని మించరాదు. ప్రతీ టీవీ కనెక్షన్‌కు వేర్వేరు చానళ్లను ఎంపిక చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. 
  • మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు, డైరెక్ట్ టు హోమ్ సేవల సంస్థలకు ట్రాయ్ షాక్‌ ఇచ్చింది. ఆయా ఆపరేటర్లు తమ చానళ్లను ప్రసారం చేసినందుకు వారికి బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థలు చెల్లించే నెలవారీ క్యారేజీ ఫీజుపై (ఎంసీఎఫ్‌) పరిమితులు విధించింది. ఒక్కో చానల్‌కు గరిష్టంగా రూ. 4 లక్షల ఎంసీఎఫ్‌ను నిర్ణయించింది. ఇప్పటిదాకా దీనిపై ఎలాంటి పరిమితులు లేవు.  You may be interested

ఎయిర్‌ ఇండియా, బీపీసీఎల్‌ డిజిన్వెస్ట్‌మెంట్‌ ఈ మార్చిలోగా లేనట్లే!

Friday 3rd January 2020

కంటైనర్‌ కార్పొల్లో కూడా  దీపమ్‌ ఉన్నతాధికారి వెల్లడి  ముంబై: ఎయిర్‌ ఇండియాలో వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో ఉండకపోవచ్చు. ఎయిర్‌ ఇండియాతో పాటు బీపీసీఎల్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌ల్లో కూడా వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి కాకపోవచ్చని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం వెనకబడి ద్రవ్యలోటుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని అంచనా.  వాటా విక్రయ ప్రయత్నాల్లో జాప్యం... ఎయిర్‌ ఇండియా, బీపీసీఎల్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా

12,300 కీలకం

Thursday 2nd January 2020

శుక్రవారం సెషన్‌లో 12,300 నిఫ్టీకి కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్‌ తదుపరి డైరెక్షన్‌కు ఇది కీ పాయింట్‌ అవుతుందంటున్నారు. నిఫ్టీ గురువారం 100 పాయింట్ల వరకు లాభపడినప్పటికీ.. కీలక నిరోధ స్థాయి 12,290ని అధిగమించలేకపోయిందని.. ఈ స్థాయికి పైన నిశ్చయాత్మకంగా క్లోజ్‌ అయితేనే నిఫ్టీ తదుపరి 12,400 మార్క్‌ను చేరుకుంటుందని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ కొనుగోళ్ల మద్దతు రాకపోతే మరికొంత స్థిరీకరణ చెందొచ్చని భావిస్తున్నారు.   ‘‘నిఫ్టీ 12,118-12,293 శ్రేణిలో గత 11 సెషన్లలోనూ

Most from this category