News


మూడు నెలల్లో బాకీలు కట్టేయాల్సిందే

Thursday 14th November 2019
Markets_main1573701522.png-29566

  •  టెల్కోలకు టెలికం శాఖ నోటీసులు

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మూడు నెలల్లోగా లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు తదితర బాకీలన్నీ కట్టేయాలంటూ టెల్కోలకు టెలికం శాఖ (డాట్‌) ఆదేశాలు జారీ చేసింది. స్వయం మదింపు ప్రాతిపదికన బకాయీలను తీర్చవచ్చంటూ నోటీసుల్లో పేర్కొన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. లైసెన్సు ఫీజు మొదలైన వాటికి ప్రాతిపదిక అయిన ఏజీఆర్‌ను (సవరించిన స్థూల ఆదాయం) లెక్కించే ఫార్ములా విషయంలో.. ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు అక్టోబర్ 24న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం మూడు నెలల్లోగా వడ్డీ సహా బాకీలు చెల్లించాలంటూ టెల్కోలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. డాట్ అంతర్గతంగా వేసిన లెక్కల ప్రకారం టెల్కోల నుంచి రూ. 1.33 లక్షల కోట్ల దాకా వసూలు కావాల్సి ఉంది. భారతి ఎయిర్‌టెల్ అత్యధికంగా రూ. 62,188 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 54,184 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌.. ఎంటీఎన్‌ఎల్‌ రూ. 10,675 కోట్లు బాకీ పడ్డాయి. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న టెలికం పరిశ్రమ.. ఈ బాకీల చెల్లింపులతో మరింత సంక్షోభంలోకి జారిపోతుందని టెల్కోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పరిశ్రమకు తోడ్పాటునిచ్చే చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 



You may be interested

ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్త సీఈఓలు..!

Thursday 14th November 2019

బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరో (బీబీబీ) తాజా సిఫార్సులు న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్ అండ్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను (ఎండీ & సీఈఓ) బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరో (బీబీబీ) బుధవారం సిఫారసు చేసింది. ఈ మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులకూ వరుసగా సంజీవ్ చద్దా, ఎల్ వీ ప్రభాకర్, అటను కుమార్ దాస్ పేర్లను సూచించింది. మంగళవారం జరిగిన

అదుపు తప్పిన రిటైల్‌ ధరలు

Thursday 14th November 2019

అక్టోబర్‌లో 4.62 శాతం పెరుగుదల 4 శాతం దాటకూడదని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశం ఇదే ధోరణి కొనసాగితే మరో దఫా రేటు కోత అసాధ్యం! న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2019 అక్టోబర్‌లో అదుపు తప్పింది. 4.62 శాతంగా నమోదయ్యింది. అంటే వినియోగ వస్తువుల బాస్కెట్‌ ధర 2018 అక్టోబర్‌తో పోల్చిచూస్తే, 2019 అక్టోబర్‌లో 4.62 శాతం పెరిగిందన్నమాట. గడిచిన 16 నెలల కాలంలో (జూన్‌ 2018లో 4.92

Most from this category