News


మీ మొబైల్‌ కొద్దిసేపు స్విచాఫ్‌ చేయండి..!

Friday 3rd January 2020
Markets_main1578023085.png-30637

  • వివో సరికొత్త ప్రచార కార్యక్రమం

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత అనుబంధాలపై అది చూపిస్తున్న ప్రభావాన్ని ‘స్విచాఫ్‌’ ప్రచార కార్యక్రమం ద్వారా ప్రముఖ మొబైల్స్‌ తయారీ సంస్థ వివో తెలియజేస్తోంది. తన బ్రాండ్‌ అంబాసిడర్‌ అమీర్‌ఖాన్‌తో కలసి ఈ కార్యక్రమాన్ని సంస్థ ఆరంభించింది. తమ మొబైల్‌ ఫోన్లను కొంత సమయం పాటు స్విచాఫ్‌ చేసి కుటుంబం, స్నేహితులతో గడపడంలో ఉన్న ఆనందాన్ని ఈ సంస్థ తన కార్యక్రమం ద్వారా భారతీయ వినియోగదారులకు తెలియజేయనుంది. కొద్దిసేపు మొబైల్‌ ఫోన్‌ను స్విచాఫ్‌ చేసి, అనుబంధాల్లోని ఆనందాన్ని ఆన్‌ చేసుకోండంటూ ప్రోత్సహించనుంది. ఇటీవలే వివో సంస్థ, సీఎంఆర్‌ భాగస్వామ్యంతో మానవ సంబంధాలపై స్మార్ట్‌ఫోన్‌ ప్రభావాన్ని తెలుసుకునేందుకు సర్వే నిర్వహించింది. స్మార్ట్‌ఫోన్‌ వల్ల ప్రవర్తనలో వచ్చే మార్పులను తెలుసుకునే ప్రయత్నం చేసింది. 75 శాతం మంది తాము యుక్త వయసు నుంచే స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్టు చెప్పగా.. ఇందులోనూ 41 శాతం మంది హైస్కూల్‌ దశ నుంచే వాడుతున్నట్టు చెప్పడం గమనార్హం. ‘‘తమ స్మార్ట్‌ పరికరాలకు అతుక్కుపోవడం వల్ల కుటుంబం, స్నేహితులతో వెచ్చించే సమయం గణనీయంగా తగ్గిపోతోంది. దీర్ఘకాలంలో ఈ చెడు అలవాటు ఒంటరితనానికి, ఒత్తిడికి దారితీస్తుంది. దీనికి తక్షణ చికిత్సల్లా అవసరమైనంత వరకు సమతులంగా వినియోగించుకోవాలి’’ అని మ్యాక్స్‌ క్యూర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన మానసిక వైద్య విభాగం హెడ్‌ డాక్టర్‌ సమీర్‌ మల్హోత్రా తెలిపారు. 



You may be interested

అంధులు కూడా కరెన్సీ నోట్లను గుర్తించొచ్చు

Friday 3rd January 2020

మనీ యాప్‌ను విడుదల చేసిన ఆర్‌బీఐ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:- ఇక నుంచి అంధులు కూడా కరెన్సీ నోట్లను గుర్తించవచ్చు. ఇందుకు అవసరమైన మొబైల్‌ ఎడెడ్‌ నోట్‌ ఐడెంటిఫయర్‌ (ఎంఏఎన్‌ఐ–మనీ) యాప్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసింది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌ ప్లే స్టోర్, ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ‘‘కలర్‌ బ్లైండ్‌నెస్, పాక్షిక దృష్టిలోపం ఉన్న వాళ్లు కూడా గుర్తించేందుకు వీలుగా

బడ్జెట్‌ తర్వాత జీఎస్టీ రేట్ల సవరణ

Friday 3rd January 2020

జీఎస్టీ నుంచి మినహాయించిన వస్తువులపై సమీక్ష దశలవారీగా పన్ను రేట్లు పెంచే యోచన మార్చి జీఎస్టీ కౌన్సిల్‌ల్లో కీలక సమావేశం సాక్షి, అమరావతి: దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి మూడేళ్లు అవుతున్న సందర్భంగా వివిధ వస్తువులపై ఉన్న పన్ను రేట్లను పునః సమీక్షించనున్నారు. అత్యధిక వస్తువులను తక్కువ శాతం పన్ను పరిధిలో ఉండటంతో ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాయి.

Most from this category