STOCKS

News


కియా సెల్టో్స్ వచ్చేసింది..

Friday 9th August 2019
Markets_main1565327083.png-27654

  • అనంతపురం ప్లాంటులో తొలి కారు ఆవిష్కరణ
  • మూడు వారాల్లోనే 23వేల పైచిలుకు ప్రీ–బుకింగ్స్‌
  • ఆగస్టు 22 నుంచి డెలివరీలు
  • భారత్‌లో 2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు
  • అనంతపురం ప్లాంటుపై 1.1 బిలియన్‌ డాలర్లు
  • 11,000 మందికి ఉపాధి అవకాశాలు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: - దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ తాజాగా భారత్‌లో తమ తొలి కారు 'సెల్టోస్‌'ను ఆవిష్కరించింది. అనంతపురం ప్లాంటులో గురువారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా, భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి షిన్‌ బాంగ్‌–కిల్, కియా మోటార్స్‌ ఇండియా ఎండీ కూక్‌ హున్‌ షిమ్‌ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో టెస్టింగ్‌ చేసిన అనంతరం సెల్టోస్‌ వాహనాల పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభించినట్లు కియా మోటార్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మనోహర్‌ భట్‌ తెలిపారు. జూలై 16న ప్రీ–బుకింగ్స్‌ ప్రారంభమైనప్పట్నుంచి కేవలం మూడు వారాల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 23,311 కార్లు బుక్‌ అయ్యాయని ఆయన వివరించారు. ఆగస్టు 22 నుంచి కారు డెలివరీలు ప్రారంభించనున్నట్లు భట్‌ వివరించారు. "ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందించిన ఎనలేని సహాయ, సహకారాల తోడ్పాటుతో మేం నిర్దేశించుకున్న రికార్డు సమయంలో సెల్టోస్‌ కార్లను ఉత్పత్తి చేయగలిగాం. భారత మార్కెట్‌కి సంబంధించిన మా నిబద్ధతకు ఈ తొలి సెల్టోస్‌ నిదర్శనం" అని ఈ సందర్భంగా కూక్‌ హున్‌ షిమ్‌ చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, కియా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

విదేశాలకు ఇక్కణ్నుంచే ఎగుమతులు...
సెల్టోస్‌ కారును ఇక్కణ్నుంచే దక్షిణాఫ్రికాతో పాటు ఇతర ప్రపంచ దేశాలకు కియా మోటార్స్‌ ఎగుమతి చేయనుంది. భారత్‌లో కియా మోటార్స్‌ దాదాపు 2 బిలియన్‌ డాలర్ల మేర ఇన్వెస్ట్‌ చేసింది. ఇందులో 1.1 బిలియన్‌ డాలర్లు అనంతపురం ప్లాంటుపైనే ఇన్వెస్ట్‌ చేసింది. దీనితో 11,000 మందికి ఉపాధి లభిస్తుందని కియా మోటార్స్‌ తెలిపింది. వీరిలో పర్మనెంటు సిబ్బంది 4,000 మంది కాగా, 7,000 మంది తాత్కాలిక సిబ్బంది ఉంటారు. 

536 ఎకరాల్లో ప్లాంటు ... 
అనంతపురం జిల్లా పెనుగొండలో సుమారు 536 ఎకరాల్లో కియా ప్లాంటు ఏర్పాటైంది. వార్షికంగా దీని ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల కార్లు కాగా, భవిష్యత్‌లో 7 లక్షల యూనిట్లకు కియా పెంచుకోనుంది. హైబ్రీడ్, ఎలక్ట్రిక్‌ వాహనాలను కూడా తయారుచేసేలా ఈ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జనవరిలో కియా మోటార్స్‌ ట్రయల్‌ ఉత్పత్తి ప్రారంభించింది.  రోబోటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి అత్యాధునిక టెక్నాలజీలను ఈ ప్లాంటులో వినియోగిస్తోంది.

సెల్టోస్‌ ప్రత్యేకతలివీ ...
మధ్య స్థాయి స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాల కోవకి చెందినది కియా సెల్టోస్‌. కొత్తగా ప్రకటించిన బీఎస్‌6 కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా సెల్టోస్‌ కార్లు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. 1.5 పెట్రోల్, 1.5 డీజిల్, ఈ విభాగంలో తొలిసారిగా 1.4 టర్బో పెట్రోల్‌ వేరియంట్స్‌లో కారు లభిస్తుంది. వాహనదారుల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా 3 ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్స్‌లోను, 6 స్పీడ్‌ మ్యాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్‌లలోనూ సెల్టోస్‌ లభిస్తుంది.You may be interested

కియాకు అన్ని విధాలా సహకారం

Friday 9th August 2019

కియాకు అన్ని విధాలా సహకారం వైజాగ్‌–చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు  ఆర్టీసీలో క్రమంగా అన్నీ విద్యుత్‌ బస్సులు సెల్టోస్‌ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సందేశం ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన సదుపాయాలతో పాటు రాయితీలు కల్పిస్తామని ఆయన హామీనిచ్చారు. దివంగత నేత, తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చొరవతో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు. అయితే, అనివార్య కారణాల

పసిడి 10 డాలర్ల ర్యాలీ

Friday 9th August 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర పరుగులు ఆగడం లేదు. ఆసియాలో శుక్రవారం మరో 10డాలర్లు ర్యాలీ చేసింది. నేటి ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 10డాలర్లు(0.65శాతం) పెరిగి (0.65శాతం) 1,519.90డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రస్తుత పరిణామాలు ఈక్విటీ మార్కెట్లకు ప్రతికూలంగా ఉండటంతో పసిడి ధరలకు కలిసొస్తుంది. వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగున్న నేపథ్యంలో ఆయా ఆయాదేశాలు వడ్డీరేట్ల తగ్గింపునకు మొగ్గుచూపడం పసిడి డిమాండ్‌ను పెంచుతుందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక

Most from this category