News


సెక్యురిటీ సేవల్లోకి జియో

Thursday 5th September 2019
Markets_main1567652718.png-28196

  • అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలకు సర్వీసులు
  • జియోగేట్‌ పేరుతో ప్లేస్టోర్‌లో యాప్‌

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో మరిన్ని కొత్త రంగాల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తోంది. తాజాగా అపార్ట్‌మెంట్ల భద్రత నిర్వహణ సేవల విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు సంబంధించి యాపిల్‌ యాప్‌ స్టోర్, గూగుల్‌ ప్లే స్టోర్‌లో జియో గేట్‌ పేరిట కొత్త యాప్‌ ప్రత్యక్షమవడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. గేటెడ్‌ కమ్యూనిటీల్లో విజిటర్లు మొదలుకుని రోజువారీ సిబ్బంది, డెలివరీ బాయ్స్, క్యాబ్స్‌ దాకా అన్నింటి రాక, పోక వివరాల నిర్వహణ అంతా జియోగేట్‌ క్రమబద్ధీకరిస్తుందని యాప్‌ గురించిన వివరణలో ఉంది. ‘దొంగతనాలు, నేరాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా కమ్యూనిటీ పరిసర ప్రాంతాలను సురక్షితంగా తీర్చిదిద్దేలా సెక్యూరిటీ నిర్వహణ ప్రక్రియను సమూలంగా మారుస్తున్నాం‘ అంటూ యాప్‌ గురించి జియో పేర్కొంది. 

ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీ...
ప్రస్తుతం మైగేట్, అపార్ట్‌మెంట్‌ అడ్డా, స్మార్ట్‌గార్డ్‌ వంటి సంస్థలు యాప్‌ ఆధారిత అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు అందిస్తున్నాయి. జియో గానీ భారీ యెత్తున వస్తే వీటికి గట్టి పోటీనివ్వొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. జియోగేట్‌ ఫీచర్స్‌ను బట్టి చూస్తే యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌నే ఇంటర్‌కామ్‌ డివైజ్‌గా కూడా వాడుకోవచ్చన్నట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో తామెక్కడ ఉన్నామో కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ గార్డుకు తెలియజేసేందుకు వీలుగా పానిక్‌ అలర్ట్‌ ఫీచర్‌ కూడా ఇందులో ఉంది. అయితే, సెక్యూరిటీ సేవల విభాగంలోకి ఎంట్రీపై జియో ఇంకా స్పందించాల్సి ఉంది. You may be interested

ఫుడ్‌ యాప్స్‌ మధ్య డిస్కౌంట్‌ పోరు

Thursday 5th September 2019

అగ్రిగేటర్స్, హోటళ్ల మధ్య చిచ్చు భారీ డిస్కౌంట్లు ఇవ్వలేమంటున్న హోటళ్లు ఫుడ్‌ యాప్స్‌ నుంచి నిష్క్రమణ   వంద రూపాయలు ఖరీదు చేసే టిఫిన్‌.. యాభైకే, ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ అంటూ సగానికి సగం డిస్కౌంట్లు ఆఫర్‌ చేసే ఫుడ్‌ అగ్రిగేటర్‌ యాప్స్‌కి ప్రస్తుతం పెద్ద చిక్కొచ్చి పడింది. ఇలాంటి భారీ డిస్కౌంట్లు మేం ఇవ్వలేమంటూ యాప్స్‌ నుంచి హోటల్స్‌ ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయి. ముందుగా బెట్టు చేసినా .. ఆ తర్వాత సమస్య సామరస్యంగా

నేటి నుంచే జియోఫైబర్‌ సర్వీసులు ప్రారంభం

Thursday 5th September 2019

జియో బ్రాడ్‌బ్యాండ్‌తో సెట్‌టాప్‌ బాక్స్ ఉచితం..! న్యూఢిల్లీ: డీటీహెచ్‌, కేబుల్ టీవీ కస్టమర్లను ఆకర్షించే దిశగా టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రతి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌పై ఉచితంగా సెట్‌ టాప్‌ బాక్స్ కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. "జియోఫైబర్‌ కస్టమర్లందరికీ కాంప్లిమెంటరీ సెట్‌టాప్ బాక్స్ కూడా లభిస్తుంది" అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే, పేరొందిన ఎంటర్‌టైన్‌మెంట్ మొబైల్ యాప్స్‌లోని వీడియో కంటెంట్, సినిమాలు మొదలైనవన్నీ కూడా జియోఫైబర్ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి.

Most from this category