News


నికో వాటా రిలయన్స్‌, బీపీల చేతికి

Monday 16th September 2019
Markets_main1568607278.png-28393

  • 10 శాతం నికో వాటా.. రిలయన్స్‌, బీపీల పరం 
  • ప్రభుత్వం ఆమోదం ! 

న్యూఢిల్లీ: కేజీ-డి6 చమురు క్షేత్రంలో కెనడాకు చెందిన నికో రిసోర్సెస్‌కు ఉన్న 10 శాతం వాటాను ఇతర భాగస్వాములు టేకోవర్‌ చేశారని సమాచారం. ఈ చమురు క్షేత్రానికి సంబంధించి అభివృద్ధి వ్యయాల్లో తన వాటాను చెల్లించడంలో నికో రిసోర్సెస్‌ విఫలమైంది. దీంతో ఇతర భాగస్వాములు-రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇంగ్లాండ్‌కు చెందిన బీపీ పీఎల్‌సీలు నికో రిసోర్సెస్‌ వాటాను టేకోవర్‌ చేశాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ టేకోవర్‌కు చమురు మంత్రి ఎలాంటి షరతులు లేకుండానే ఆమోదం తెలిపారని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. నికో కంపెనీ  వాటా టేకోవర్‌తో కేజీ-డి6లో రిలయన్స్‌ వాటా 60 శాతం నుంచి 66.67 శాతానికి, బీపీ వాటా 30 శాతం నుంచి 33.33 శాతానికి పెరుగుతాయి. అయితే ఈ విషయమై రిలయన్స్‌, బీపీ కంపెనీల నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం కాలేదు. 



You may be interested

భగ్గుమన్న చమురు..రూ. 4200 పైకి ఎంసీఎక్స్‌ క్రూడ్‌

Monday 16th September 2019

గత వారంతంలో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి క్షేత్రాలపై డ్రోన్‌ దాడి జరగడంతో సోమవారం ట్రేడింగ్‌లో చమురు ధరలు భారీగా పెరిగాయి. షార్ట్‌ కవరింగ్‌, మార్జిన్‌ కాల్స్‌ పెరగడంతో సోమవారం మార్కెట్‌ ప్రారంభంలో దేశీయ ఎంసీఎక్స్‌(మల్టీ కమొడిటీ ఎక్సేంజ్‌)లో చమురు రూ. 4200 స్థాయిని అధిగమించింది. బ్రెంట్‌ క్రూడ్‌ ప్రపంచ మార్కెట్లో సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో 20 శాతం పైగా లాభపడింది. తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఉదయం 9.25

స్థిర రేటుపై గృహ రుణాలు

Monday 16th September 2019

కొంత కాలం తర్వాత ఫ్లోటింగ్‌ రేటు తీసుకొచ్చే యోచనలో ఎస్‌బీఐ ఆర్‌బీఐ నుంచి స్పష్టత కోరిన బ్యాంకు లేహ్‌: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ స్థిర రేటుపై గృహ రుణాలను తీసుకురావాలనుకుంటోంది. ఇవి స్థిర రేటు (ఫిక్స్‌డ్‌) నుంచి అస్థిర రేటు(ఫ్లోటింగ్‌)కు మారే గృహ రుణాలు. అంటే ప్రారంభం నుంచి నిర్ణీత కాలం వరకు (సుమారు ఐదు పదేళ్లు) ఒకటే వడ్డీ రేటు కొనసాగుతుంది. ఆ తర్వాత నుంచి మార్కెట్‌ రేట్లకు అనుగుణంగా గృహ

Most from this category