రిలయన్స్ చేతికి బజోడాట్ఏఐ
By Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన అనుబంధ కంపెనీ హాప్టిక్, ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కన్వర్జేషనల్ కామర్స్ స్టార్టప్, బజోడాట్ఏఐను కొనుగోలు చేసింది. ఈ స్టార్టప్ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను హాప్టిక్ కంపెనీ వెల్లడించలేదు. ఈ స్టార్టప్ కొనుగోలుతో మరింత మెరుగైన వాయిస్, చాట్ కామర్స్ సొల్యూషన్స్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అందజేయగలమని హాప్టిక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్వపన్ రాజ్దేవ్ వెల్లడించారు. శామ్సంగ్, కేఎఫ్‌సీ, కోక-కోలా, ఓయో రూమ్స్, హెచ్డీఎఫ్సీ తదితర బ్రాండ్లకు తమ సర్వీసులందజేస్తున్నామని వివరించారు. బజోడాట్ఏఐను 2016లో ఆనంద్ రామచంద్రన్, వివేక్ ఆర్యలు స్థాపించారు.
You may be interested
3-వారాల గరిష్టానికి పసిడి
Wednesday 25th September 2019అమెరికాలో తలెత్తిన రాజకీయ వివాదంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర 3వారాల గరిష్టాన్ని అందుకున్నాయి. తన రాజకీయ ప్రత్యర్థులకు నష్టం చేకూర్చేందుకు విదేశీ శక్తుల్ని వాడుకోవాలని ట్రంప్ ప్రయత్నించారని ఆ దేశ ప్రధాన ప్రతిపక్షమైన డెమాక్రటిక్ పార్టీ ఆరోపణలు చేసింది. ట్రంప్‌కు వ్యతిరేకంగా అభిశంసన ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పలోసీ ప్రకటించారు. మరోవైపు అమెరికా-చైనా వాణిజ్య చర్చల సఫలంపై మేఘాలు కమ్ముకోవడంతో పసిడి ధర పసిడి ఫ్యూచర్లకు
ఆర్థిక మోసాల నివారణకు ట్విట్టర్ కొత్త ఆస్త్రం
Wednesday 25th September 2019న్యూఢిల్లీ: ఆర్థిక మోసాలకు ట్విట్టర్ వేదిక కాకుండా చూసేందుకు ఆ సంస్థ నూతన విధానాన్ని ప్రకటించింది. ట్విట్టర్ సాయంతో వ్యక్తులు ప్రైవేటు ఆర్థిక సమాచారం పొందడం, నగదు పొందడం వంటి మోసపూరిత చర్యలను నిషేధించింది. మోసపూరిత, నిషేధిత చర్యలను రిపోర్ట్ చేయాలనుకునే యూజర్లు... ట్విట్టర్ యాప్‌లోని మెనూలో ఉన్న రిపోర్ట్ట్విట్ ద్వారా తెలియజేయవచ్చని సూచించింది. ‘ఇట్స్ ఏ ఫైనాన్షియల్ స్కామ్’ ఆప్షన్‌ను ఎంచుకుని అనుమానిత ట్వీట్ల గురించి వివరంగా తెలియజేయవచ్చని